E-Paper
Advertisement

Municipal Elections: కరీంనగర్ కాంగ్రెస్‌లో గందరగోళం..

Municipal Elections: కరీంనగర్ కాంగ్రెస్‌లో గందరగోళం..
Advertisement

Municipal Elections:  మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఏ పార్టీలో లేనివిధంగా కరీంనగర్ కాంగ్రెస్ లో అయోమయ పరిస్థితి నెలకొందంట. పార్టీలో కీలకంగా ఉన్న నలుగురు లీడర్లలో ఎవరు ఎన్నికల్లో టికెట్ ఫైనల్ చేస్తారో? ఏ లీడర్ ని నమ్ముకుంటే తమకి టికెట్ వస్తుందోనని కార్పొరేషన్ ఎన్నికల ఆశావహులు అందోళన చెందుతున్నారంట. ఆ నలుగురిలో ఒకాయనోమో అధిష్టానం మొత్తం బాధ్యతలు తనకే ఇచ్చిందని అంటున్నారంట. టికెట్ ఫైనల్ చెయ్యడానికి అయనెవరూ అని ఇంకొకరు కామెంట్స్ చేస్తున్నారు. అలాకలిసికట్టుగా పనిచేయాల్సిన అధికారపక్ష నాయకుల వైఖరితో కాంగ్రెస్ శ్రేణులు తికమకపడాల్సి వస్తోందంట

మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్ కాంగ్రెస్‌లో కలహాలు

మున్సిపల్ ఎన్నికల హడావుడి రాష్ట్రం మొత్తాన్ని హీటేక్కిస్తుంటే కరీంనగర్‌లో మాత్రం కలిసికట్టుగా ఉండాల్సిన అధికార పక్షం నాయకులు అధిపత్యం కోసం పాకులాడుతున్నారు… జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అర్బన్ జిల్లా అధ్యక్షుడు, సుడా ఛైర్మన్, మరో కీలక నేతల వైఖరితో పార్టీ శ్రేణులు అయోమయానికి గురి అవుతున్నారు..గత ఎన్నికలలో కరీంనగర్ పార్లమెంటు నుండి ఎంపీగా పొటి చేసిన వెలిచాల రాజేందర్ రావు తనకి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జ్‌గా బాధ్యతలు చేపట్టాక కొద్దిగా దూకుడు పెంచారు…తనకి కాంగ్రెస్ అధిష్టానం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతలు అప్పజెప్పిందని, తానే టికెట్లు ఫైనల్ చేస్తానని కరీంనగర్ లో వాడవాడల తిరుగుతున్నారు.

రాజేందర్‌రావు ప్రకటనలపై కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి

Advertisement

అయితే పార్టీని బలోపేతం చెయ్యడానికి వాడవాడలా తిరుగుతున్న రాజేందర్‌రావుకి ఇటీవల ఓ బీఆర్ఎస్ నేత ఇచ్చిన ఝలక్‌తో సీన్ రివర్స్ అయ్యే పరిస్థితి ఏర్పడిందంట.. గత కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క డివిజన్లో కూడా గెలవలేకపోయింది. ఆ క్రమంలో ఇటీవల ఓ మాజీ కార్పొరేటర్ దంపతులకి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పి వారు పార్టీలో చేరారని రాజేందర్ రావు ప్రకటించారు … అయితే మరుసటి ఉదయమే తాను పార్టీ మారలేదని సదరు మాజీ కార్పొరేటర్ ప్రకటించారు..ఇ ప్పుడు ఇదే విషయమై మిగితా నాయకులు రాజేందర్‌రావు వ్యవహార శైలిపై మండిపడుతున్నారు.

కాంగ్రెస్ లో నేతల మధ్య శక్తి పోరాటం.. మేడిపల్లి సత్యం అసహనం

కాంగ్రెస్‌లో అందరూ కలిసి ఉన్నట్లే పైకి కనిపిస్తున్నా ఎవరివారే తమ అధిపత్యం నెగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు… కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన చొప్పదండి ఎమ్మెలకచూ మేడిపల్లి సత్యం మిగితా నాయకుల వ్యవహార శైలిపై కొంత అగ్రహం అసహనంతో ఉన్నారంటున్నారు.. తాము ఎవరం టికెట్లు ఫైనల్ చెయ్యమని, కాంగ్రెస్ జిల్లా కార్యలయంలో పోటీ చేయాలనుకుంటున్న అశావాహుల నుండి దరాఖాస్తులు తీసుకుంటామని మేడిపల్లి సత్యం చెప్తున్నారు. వచ్చిన ధరఖాస్తులపై సర్వేలు చేయించి కులాల వారిగా బలాబలాలు నిర్దారించుకొని టికెట్లు ఫైనల్ చేస్తామని చెప్పినా కూడా రాజేందర్‌రావు వైఖరి మారకపోవడంతో ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయంట..

రాజేందర్‌రావు టికెట్ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లడి

Advertisement

అందరం కలిసి నిర్ధారించాల్సిన టికెట్ల వ్యవహారం లో రాజేందర్‌రావు తమని కాదని కొత్తవారిని ప్రోత్సహిస్తున్నారని, తమకి టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారని ఇటీవల కొంత మంది కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ మేడిపల్లి సత్యంను కలిసి ఫిర్యాదు కూకూడా చేశారు. అలాగే ఇటీవల జిల్లా పర్యటన కి వచ్చిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి సైతం రాజేందర్‌రావు వ్యవహారాన్ని తీసుకెళ్లారు.

కరీంనగర్‌లో కాంగ్రెస్ శీర్షికలపై చర్చ

ఇటివల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఇన్చార్జ్ మంత్రి కొత్త జిల్లాల్లోని మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్ లీడర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు… అయితే రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో లేని పంచాయితి కరీంనగర్ జిల్లాలో వచ్చింది. కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్‌రావు వైఖరితో పార్టీకి కొత్త తలనొప్పి వస్తుందని జిల్లా కాంగ్రెస్అధ్యక్షుడు, అర్బన్ జిల్లా అధ్యక్షుడు, సుడా ఛైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి, గ్రంథాలయ ఛైర్మన్ అందరూ కుడా ఫిర్యాదు చెయ్యడంతో ఇంచార్జ్ మంత్రి తుమ్మల ఆయన్ని గట్టిగానే మందలించారంట.

ఇన్చార్జ్ మంత్రి తుమ్మల అధికార ప్రదర్శన

కరీంనగర్ కాంగ్రెస్లో ఉన్న విబేధాలు మంత్రి తుమ్మల ముందే భగ్గుమనడం చర్చనీయాంశంగా మారింది కరీంనగర్‌పై అధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న నేతలందరూ మంత్రి ముందే బాహాబాహికి దిగినంత పనిచేసారు.. వెలిచాల ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై మిగితా నాయకులు భగ్గుమన్నారు…ఇంచార్జ్ మంత్రి తుమ్మల, జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ముందే వెలిచాలపై అసహనం వ్యక్తం చేశారు…అయితే దాన్ని సీరియస్‌గా తీసుకున్న ఇన్చార్జ్ మంత్రి తుమ్మల గట్టిగానే రాజేందర్‌రావుని మందలించారని టాక్.

పార్టీ లైన్ ఎవరు దాటరాదు – తమ్మల వార్నింగ్

అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకొని పార్టీ విజయానికి కృషి చెయ్యాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీలు కైవసం చేసుకోవాలని తమ్మల స్పష్టం చేశారంట. పార్టీ లైన్ ఎవరూ దాటవద్దని, టికెట్లు ‌అధిష్టానం ఫైనల్ చేస్తుందని తుమ్మల గట్టి వార్నింగే ఇచ్చారంట.. మరి కాంగ్రెస్ నాయకుల తీరు మారుతుందో..లేక ఎవరికి వారే అన్నట్లే వ్యవహరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉట్టి ముంచుతారో చూడాలి.

Story by: Apparao, Big Tv

Related News

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

కమ్మని కబుర్లు వెనుక కన్నింగ్ ప్లాన్.. వీల్లని నమ్మితే మీ పని అయిపోయినట్టే?

ఒకే దెబ్బకు రెండు నిర్ణయాలు.. సురేఖ వ్యవహారంతో పాటు కేబినెట్ మార్పులపై రచ్చ!

తెలంగాణలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.. ప్రాణాలు కాపాడే మందుల వెనుక పల్లెల వినాశనం!

కొత్త పార్టీ ప్రకటనతో విజయసాయి రెడ్డి బిగ్ ప్లాన్.. జగన్‌కు చెక్ పడినట్టేనా..!

పవన్ బర్త్‌డే వేళ సంచలన నిర్ణయం.. జనసేనలో యువజన విభాగం ఏర్పాటుకు రంగం సిద్ధం!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

Big Stories

Advertisement
×