E-Paper
Advertisement

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. హుజూరాబాద్‌ లేబర్ ఆఫీసులో ఏఎల్ఓ సస్పెన్షన్..!

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. హుజూరాబాద్‌ లేబర్ ఆఫీసులో ఏఎల్ఓ సస్పెన్షన్..!
Advertisement

Swetcha Effect: స్వేచ్ఛ బ్యూరో: హుజూరాబాద్ సహాయ కార్మిక కార్యాలయంలో (Assistant Labour Office) గత కొంతకాలంగా సాగుతున్న అక్రమాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై ‘స్వేచ్ఛ న్యూస్” పత్రిక సామాజిక బాధ్యతతో చేపట్టిన వరుస కథనాలు చివరకు అధికారిణి సస్పెన్షన్‌కు దారితీశాయి. కార్మికుల హక్కులను కాలరాస్తూ, కార్యాలయాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అడ్డాగా మార్చారన్న ఆరోపణలపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు, హుజూరాబాద్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ALO) డి. చందనను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ జోన్ జాయింట్ లేబర్ కమిషనర్ ఎం. రాజేంద్ర ప్రసాద్ ఈ మేరకు శనివారం (మార్చి 7, 2026న) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

అక్రమాల గుట్టు రట్టు చేసిన ‘స్వేచ్ఛ’:

కార్మిక శాఖలో కొద్దిరోజులుగా ఫైళ్ల కదలిక కోసం ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం పెరిగిందని, లంచం ఇస్తేనే పనులు జరుగుతున్నాయన్న అంశంపై ‘స్వేచ్ఛ న్యూస్ “‘ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల (BOC Workers) సంక్షేమ పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, పునరుద్ధరణలు మరియు క్లెయిమ్ ఫైళ్లను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన రహస్య లాగిన్ ఐడిలు, పాస్‌వర్డ్‌లను సైతం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, కార్యాలయ డేటాను దుర్వినియోగం చేస్తున్నారన్న విషయాన్ని పక్కా ఆధారాలతో ప్రచురించడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.

Advertisement

Also Read: Agriculture Drones: అన్నదాతలకు శుభవార్త.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు 10 డ్రోన్లు!

విచారణలో తేలిన కీలక అంశాలు..?

కరీంనగర్ డిప్యూటీ లేబర్ కమిషనర్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు జరిపిన ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి.

Advertisement

నిర్లక్ష్యం: కార్యాలయానికి సక్రమంగా హాజరుకాకపోవడం, హాజరు రిజిస్టర్లలో సంతకాలు చేయకపోవడం వంటి క్రమశిక్షణారాహిత్యం ఉన్నట్లు తేలింది.

అవినీతి: అర్హులైన కార్మికుల క్లెయిమ్‌లను ఆమోదించకుండా కాలయాపన చేయడం, ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై అనధికారిక వసూళ్లకు పాల్పడటం ప్రధాన ఆరోపణలుగా ఉన్నాయి.

భద్రతా ఉల్లంఘన: ప్రభుత్వ కంప్యూటర్లను మరియు సున్నితమైన సమాచారాన్ని బయటి వ్యక్తుల యాక్సెస్‌కు ఇవ్వడం తీవ్రమైన నేరంగా పరిగణించారు.

కఠిన చర్యలు – నిబంధనలు:

తెలంగాణ సివిల్ సర్వీసెస్ (CCA) రూల్స్, 1991 లోని రూల్ 8(1) ప్రకారం చందనను తక్షణమే సస్పెండ్ చేశారు. క్రమశిక్షణా విచారణ పూర్తయ్యే వరకు ఆమె సస్పెన్షన్‌లోనే కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కాలంలో ఆమె హుజూరాబాద్‌ను విడిచి వెళ్లకూడదని, ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ‘స్వేచ్ఛ న్యూస్’ కథనాల ద్వారా అధికారులు స్పందించి అవినీతిపై ఉక్కుపాదం మోపడంతో, భవన నిర్మాణ కార్మికులు మరియు వివిధ కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Student Harassment: వీణవంక గురుకులంలో గురువుల అరాచకం.. బలవంతంగా పిల్లతో పాదాభివందనాలు!

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×