E-Paper
Advertisement

Wet-Bulb Temperature: ఎన్నడూ చూడని ఎండ! కొత్త రిసెర్చ్‌లో షాకింగ్ విషయాలు

Wet-Bulb Temperature: ఎన్నడూ చూడని  ఎండ! కొత్త రిసెర్చ్‌లో షాకింగ్ విషయాలు

Wet-Bulb Temperature: ఎస్.. కొన్నేళ్లుగా ప్రతి ఎండాకాలంలో.. ఎండలు భయపెడుతున్నాయ్. ఇప్పుడు మనం చూస్తున్నది.. మండే ఎండలు కాదు. వారాల పాటు నిప్పుల కొలిమి లాంటి వాతావరణం. రాబోయే వేసవి గురించి శాస్త్రవేత్తలు, రీసెర్చ్ రిపోర్టులు చెబుతున్న విషయాల గురించి తెలిస్తే.. ఇప్పుడే చెమటలు పడుతున్నాయ్. పర్యావరణ మార్పల వల్ల భూమి సెగలు కక్కుతోంది. ఒకప్పుడు ఎండాకాలం అంటే.. మధ్యాహ్నం తర్వాత ఎండలు మండిపోయేవి. దాంతో.. మధ్యాహ్నం పూట.. అడుగు బయటపెట్టేవాళ్లం కాదు. కానీ.. ఈరోజుల్లో ఉదయం 9 నుంచే భానుడి బ్యాటింగ్ మొదలైపోతోంది. సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఈ సమ్మర్‌లో అయితే.. ఎండల తీవ్రత గతం కంటే ఎక్కువ ఉంటుందని లేటెస్ట్ రీసెర్చ్ రిపోర్టులు సూచిస్తున్నాయ్.

భారీ ఉష్ణవేడి – వెట్ బల్బ్ టెంపరేచర్ అలర్ట్

సాధారణంగా.. టెంపరేచర్ 40 డిగ్రీలు దాటితేనే అల్లాడిపోతాం. రాబోయే కాలంలో.. దేశంలోని కొన్ని నగరాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలని మించి 50 డిగ్రీల దాకా చేరే ప్రమాదం ఉందంటున్నారు. ఇక.. వడదెబ్బ ధాటికి.. శరీరం తట్టుకోకపోతే.. ప్రాణాలకే ముప్పు అని హెచ్చరిస్తున్నారు. గాల్లో తేమ, వేడి కలిసినప్పుడు శరీరంలోని చెమట ఆవిరి కాదు. ఈ వెట్ బల్బ్ టెంపరేచర్ మనుషులకు అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈసారి.. ఇండియాలోని కొన్ని ప్రాంతాలు ఈ తేమతో కూడిన వేడిగాలుల బారిన పడే అవకాశం ఉంది. ఇది.. ప్రజారోగ్యంపై విస్తృతమైన ప్రభావాలు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అనాటమీ ఆఫ్ మాయిస్ట్ హీట్ వేవ్స్ ఇన్ ఇండియా అనే తాజా రీసెర్చ్‌లో తేలింది. ఈసారి రాబోయే రుతుపవనాలు వర్షాలనే కాదు తేమతో కూడిన వడగాలులను కూడా తీసుకొస్తాయని తొలిసారి అంచనా వేసింది. సాధారణ హీట్ వేవ్స్ మాదిరిగా కాకుండా.. తేమతో కూడిన వేడిగాలులు ఎక్కువ ప్రభావం చూపుతాయ్. దీనినే.. వెట్ బల్బ్ టెంపరేచర్ అంటారు. ఈ పరిస్థితుల్లో.. చర్మం నుంచి చెమట ఆవిరైపోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది.. మన శరీరాన్ని దానంతట అదే చల్లబరుస్తుంది. ఈ వాతావరణ పరిస్థితుల గురించి అవగాహన లేకపోవడం వల్ల గంటల్లోనే అలసట రావడం, ప్రాణాంతకమైన వడదెబ్బ సంభవించే ప్రమాదముంది. ముఖ్యంగా.. బహిరంగ ప్రదేశాల్లో పనులు చేసేవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభావం

80 ఏళ్లకు పైగా వెదర్ డేటాని పరిశోధించి, క్లైమేట్ డైనమిక్స్ జర్నల్‌లో వచ్చిన ఈ రీసెర్చ్.. రుతపవన వర్షాలు ఎక్కడ విరామం తీసుకుంటాయి? ఎక్కడ చురుగ్గా ఉన్నాయనేది బట్టి.. మోయిస్ట్ హీట్ వేవ్స్ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారొచ్చని కనుగొన్నారు. తేమతో కూడిన హీట్ వేస్.. ఎక్కడ, ఎప్పుడు సంభవిస్తాయో ఇప్పుడు అంచనా వేయగలుగుతున్నారు. ప్రమాదకరమైన వేడి అలసటకు దారితీసే పరిస్థితుల నుంచి ప్రజలను ముందుగానే హెచ్చరించొచ్చని చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ.. కొన్ని ప్రాంతాల్లో ఈ వెట్ బల్బ్ వెదర్ ఉన్న ప్రాంతాలున్నాయి. ఎండాకాలంలో వచ్చే హీట్ వేవ్స్ గురించి భారతీయులకు తెలుసు. కానీ.. ఈ తేమతో కూడిన వేడిగాలుల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. ఇదే.. చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెబుతున్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండకపోతే.. మనుషుల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. ఇప్పటికే.. గడిచిన కొన్నేళ్లలో సమ్మర్ సీజన్లు.. అత్యంత వేడి సంవత్సరాలుగా నమోదయ్యాయ్. సముద్ర మట్టాలు వేడెక్కడం వల్ల.. భూమిపై వేడి గాలుల తీవ్రత పెరుగుతూ వస్తోంది. నగరాల్లోనూ పగటి పూట ఉన్న వేడి, రాత్రి పూట కూడా తగ్గకపోవడం వల్ల ఉక్కపోతతో అల్లాడిపోవాల్సి వస్తోంది. ఈ వెట్ బల్బ్ టెంపరేచర్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తీసుకురావడమే కాదు.. విద్యుత్ డిమాండ్‌ని కూడా పెంచుతాయ్. వేడి, తేమతో కూడిన రోజుల్లో.. ఏసీలు, ఫ్యాన్ల వాడకం ఆటోమేటిక్‍‌గా పెరిగిపోతుందని రీసెర్చ్‌లో తేలింది.

ప్రజల ఆరోగ్యానికి ప్రాణాంతక ముప్పు

ఈసారి ఇండియాపై వెట్ బల్బ్ టెంపరేచర్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మనం చూసే ఉష్ణోగ్రత కంటే, వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది గాలిలోని తేమ, వేడి కలిసినప్పుడు మన శరీరంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇప్పటికే.. ఎండలు మండిపోతున్నాయ్. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయ్. రాబోయే రోజుల్లో.. టెంపరేచర్ 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా.. ఏపీ, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో గాల్లో తేమ శాతం పెరగడం వల్ల.. మాయిస్ట్ హీట్‌వేవ్స్ సంభవించే ప్రమాదం ఉంది. వెట్ బల్బ్ ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు చేరితే, ఆరోగ్యవంతులైన మనుషులు కూడా చెమట ద్వారా శరీరాన్ని చల్లబరుచుకోలేక, కేవలం కొన్ని గంటల్లోనే ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. ఇటీవలి పరిశోధనల ప్రకారం.. 31 డిగ్రీల వెట్ బల్బ్ టెంపరేచర్ దగ్గరే.. మానవ శరీరం తీవ్ర ఒత్తిడికి లోనవుతోందని తేలింది. దీనివల్ల.. వడదెబ్బ, గుండె సంబంధిత సమస్యలు పెరగుతాయనే హెచ్చరికలున్నాయి.

నీడలో విశ్రాంతి తీసుకున్న ప్రమాదమే..

మనిషి శరీరం కొంతవరకు మాత్రమే ఎండలను తట్టుకోగలదు. నిత్యం 45 డిగ్రీల పైన టెంపరేచర్ నమోదైతే.. అది శరీరంపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఉష్ణోగ్రతతో పాటు గాల్లోని తేమ కూడా ఇందుకు కారణమవుతుంది. గాల్లో తేమ ఉంటే, చెమట చర్మం నుంచి ఆవిరైపోదు. ఫలితంగా.. కొద్ది గంటల్లోనే అలసటతో పాటు ప్రాణాంతకమైన హీట్ స్ట్రోక్‌కు దారితీస్తుంది. తేమతో కూడి వేడిగాలులు 31 డిగ్రీలున్నా మనుషులకు చాలా ప్రమాదకరం. అది.. 35 డిగ్రీలకు చేరితే.. నీడలో విశ్రాంతి తీసుకుంటున్న వారికి కూడా ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. తేమతో కూడిన వేడి అనేది.. పొడి ఎండ కంటే చాలా డేంజర్. దీనినే.. వెట్ బల్బ్ టెంపరేచర్ అంటారు. సాధారణంగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు.. మన శరీరం చెమటని బయటకు పంపి, అది ఆవిరి కావడం ద్వారా శరీరాన్ని చల్లబరుస్తుంది. కానీ, గాలిలో తేమ ఎక్కువగా ఉంటే.. చెమట ఆవిరి కాదు. దీనివల్ల.. శరీరం లోపలే వేడి పేరుకుపోయి ప్రాణాంతక పరిస్థితి దారితీస్తుంది.

తేమతో కూడిన వేడి వల్ల కలిగే ప్రమాదాలు

తేమతో కూడిన వేడి వల్ల కలిగే దుష్పరిణామాలు చాలానే ఉన్నాయ్. హీట్ ఎగ్జాషన్ వల్ల విపరీతమైన అలసట, తల తిరగడం, వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తాయ్. శరీరం.. తన ఉష్ణోగ్రతను తనంతట తాను తగ్గించుకోలేని సమయంలో.. ఇది జరుగుతుంది. ఇక.. హీట్ స్ట్రోక్ అనేది.. అత్యవసర పరిస్థితి. శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే.. మెదడు, గుండె, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్కోసారి స్పృహ కోల్పోవడం కూడా జరగొచ్చు. ఈ పరిస్థితుల్లో శరీరాన్ని చల్లబరిచేందుకు గుండె వేగంగా రక్తాన్ని పంపింగ్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల.. బ్లడ్ ప్రెజర్ పెరిగి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతంగా చెమటలు పట్టడం వల్ల శరీరంలోని లవణాలు, నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. కండరాల నొప్పులు, నీరసం వస్తాయి. ఇది.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు

వడదెబ్బ తగలకుండా కేవలం నీడన ఉంటే సరిపోదు. వెట్ బల్బ్ వెదర్ వల్ల.. నీడన ఉంటే సరిపోదు. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకునేందుకు.. తరచుగా నీరు తీసుకోవాలి. కేవలం.. మంచినీళ్లే కాకుండా.. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్ల లాంటివి తాగడం వల్ల.. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు అందుతాయి. సింథటిక్ దుస్తులు కాకుండా.. కాటన్, లెనిన్ లాంటి బట్టలు ధరించాలి. గాల్లో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు.. కిటికీలకు తడి పరదాలు కట్టడం వల్ల గాలి కాస్త చల్లబడుతుంది. అతిగా మసాలాలు ఉన్న ఆహారం, మాంసాహారం తగ్గించాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి. విపరీతమైన తలనొప్పి, చర్మం ఎర్రబడటం, చెమట పట్టడం ఆగిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వారిని చల్లని ప్రదేశానికి చేర్చి.. వైద్య సహాయం అందించాలి. హీట్ వేవ్స్ సమయంలో.. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి పనులు చేయకపోవడం బెటర్ అంటున్నారు. ఒకప్పుడు.. సమ్మర్ వస్తే నీడలో, ఇంట్లో ఉంటే సరిపోయేది. కానీ.. ఇప్పుడలా కాదు. నీడన ఉన్నా.. జాగ్రత్తగా ఉండాలని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయ్.

Also Read: ఇండియన్ ఇన్వెస్టర్లకు షాక్.. దుబాయ్ మార్కెట్ షాకింగ్ రిపోర్ట్!

Story by: Anup, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×