E-Paper
Advertisement

Agriculture Drones: అన్నదాతలకు శుభవార్త.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు 10 డ్రోన్లు!

Agriculture Drones: అన్నదాతలకు శుభవార్త.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు 10 డ్రోన్లు!
Advertisement

Agriculture Drones: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రికరణను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రతి జిల్లాకు పది చొప్పున డ్రోన్ల పంపిణీకి సిద్ధమవుతుంది. 40 శాతం సబ్సిడీతో డ్రోన్లను అందజేయనుంది. లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలకు.. అదేవిధంగా మహిళా సంఘాలకు సైతం అందజేయనున్నట్లు సమాచారం. ఈ డ్రోన్ల వినియోగంతో పైరు పిచ్చి కారి సమయం 80 శాతం మేర తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ డ్రోన్ల పంపిణీ తో కూలీల ఖర్చు తగ్గి రైతులకు మేలు జరుగుతుందని ఆర్థిక భారం తగ్గనుంది.

సబ్సిడీపై రైతులకు..

వ్యవసాయ రంగంలో రోజురోజుకు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. కూలీల కొరత రైతులను వేధిస్తుంది. దీంతోపాటు రైతులకు ఆర్థిక భారం పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజా ప్రభుత్వం రైతులను యాంత్రికరణను ప్రోత్సహించేందుకు పక్క ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. అందులో భాగంగా సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మేకనైజేషన్ (ఎస్ఎంఎఎం) పథకం కింద వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై రైతులకు అందజేస్తుంది. సన్న చిన్న కారు రైతులకు, ఎస్సీ ఎస్టీ, మహిళా రైతులకు ప్రాధాన్యతలతో కూడిన యంత్రాలను ఇప్పటికే ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. అందులో భాగంగానే పంటకు పిచికారి చేసేందుకు కూలీల కొరత తీవ్రంగా వేధిస్తూ ఉండడంతో ప్రభుత్వం వ్యవసాయ డ్రోన్లను కూడా సబ్సిడీపై అందజేసేందుకు నిర్ణయం తీసుకుంది.

ఖర్చులో 40% సబ్సిడీ..

Advertisement

ఇప్పటికే అన్ని జిల్లాల్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. తొలి విడుదల రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు పది చొప్పున వ్యవసాయ డ్రోన్లను అందజేసేందుకు సిద్ధమైంది. డ్రోన్ల కొనుగోలుకు అయ్యే ఖర్చులో 40% సబ్సిడీతో ప్రభుత్వం ఇవ్వనుంది. డోనుకు 10 లక్షలు ధర అయితే అందులో 4 లక్షలు ప్రభుత్వం ఇవ్వనుంది. అయితే జిల్లాకు 10 మాత్రమే డోన్లు ఇస్తామని ప్రకటించడంతో ఆశతో ఉన్న రైతులకు నిరాశ ఎదురయింది.

Also Read: Vijaya Dairy: డేంజర్ బెల్స్.. తెలంగాణ బ్రాండ్ పేరుతో ఏపీ కల్తీ పాలు, నెయ్యి అమ్మకం

కలెక్టర్లకే ఎంపిక బాధ్యత

Advertisement

ప్రభుత్వం సబ్సిడీపై అందజేసే వ్యవసాయ డ్రోన్ల ఎంపిక బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. అయితే తొలి విడుదల వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలకు, అదే విధంగా మహిళా సంఘాల సభ్యులకు అందజేయబోతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మాత్రం వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలకు మాత్రమే సబ్సిడీ డ్రోన్లను అందజేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ప్రకటించారు. ఇది ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు 311 పైగా ఉన్నాయి. ప్రాథమిక సహకార సంఘాలు 904 ఉన్నాయి. అయితే ఈ సంఘాలకు డ్రోన్లను ఎలా.. ఎన్ని అందజేస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

కూలీల ఖర్చు తగ్గి రైతులకు లాభం

వ్యవసాయ డ్రోన్ల వినియోగంతో పిచికారి సమయం 80 శాతం వరకు తగ్గడంతో పాటు ఎరువులు, సూక్ష్మ పోషకాలు సమానంగా పంటపై పిచికారి చేయడం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కూలీల ఖర్చు తగ్గి రైతులకు లాభం పెరుగుతుందని, సబ్సిడీపై డోన్లను సంఘాలకు అందజేయడంతో సన్నా చిన్నకారు రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన రోన్లను అందుబాటులోకి తీసుకువచ్చి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ డ్రోన్లను అందజేసేందుకు ప్రణాళికలు సైతం రూపొందిస్తున్నట్లు సమాచారం.

Also Read: Iran Drone Hits Dubai: మాట తప్పిన ఇరాన్.. దుబాయ్‌లోని మెరీనా టవర్స్‌‌పై డ్రోన్ల దాడి, ఆపై మంటలు

డ్రోన్ల ధరలపై విమర్శలు?

ప్రభుత్వం డ్రోన్లను సరఫరా చేసేందుకు కొన్ని కంపెనీలను ఎంపిక చేసింది. అయితే ఎంపిక చేసిన 9 కంపెనీలన్నీ కూడా పది లక్షల నుంచి 13 లక్షల వరకు ధరను నిర్ణయించాయి. 10 లీటర్ల డ్రోన్లకు ధర 10 లక్షల పైగా ఉండటంతో విమర్శలకు దారితీసింది. బహిరంగ మార్కెట్లో.. ప్రైవేటు కంపెనీలు ఆరు లక్షల నుంచి 8 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం ఎంపిక చేసిన కంపెనీలు ఎక్కువ ధరలు నిర్ణయించడం.. ప్రభుత్వ ఇచ్చిన సబ్సిడీ రైతులకు ఏమాత్రం ఆర్థిక భరోసా ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అధికారులు బహిరంగ మార్కెట్లలో ధరలను పరిశీలించకుండానే కంపెనీలు ఇచ్చిన కొటేషన్లకు ఓకే చెప్పారని ఆరోపణలు వస్తున్నాయి.

రైతులకు మేలు

కమిషన్లు వస్తాయని ఆయా కంపెనీలకు ముందస్తు ఒప్పందాల మేరకు అప్పగించారా అనేది ప్రచారం జరుగుతుంది. ఎలా కంపెనీలకు అప్పగించారు అనేది కూడా సర్వత్ర చర్చ జరుగుతుంది. రైతులకు మేలు చేయాల్సిన అధికారులు.. ఎక్కువ కొటేషన్ ఎందుకు చేశారనేది వారికే తెలియాలి. ఇప్పటికైనా అధికారులు సమీక్షించి రైతులకు మేలు చేసేలా సబ్సిడీ వారికి హార్దిక భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా రైతులకు మేలు జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది.

Also Read: CM Chandrababu: రాయదుర్గంలో ఆనాడు తప్పు చేశా.. సీఎం చంద్రబాబుకు డీఎల్ఎఫ్ సంస్థ హామీ

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×