E-Paper
Advertisement

‘ప్రస్తుత అధ్యక్షుని నియామకం చెల్లదు’.. హెచ్‌సీఏకి హైకోర్టు భారీ షాక్​

‘ప్రస్తుత అధ్యక్షుని నియామకం చెల్లదు’.. హెచ్‌సీఏకి హైకోర్టు భారీ షాక్​
Advertisement

High Court – HCA: హైదరాబాద్ క్రికెట్​ అసోసియేషన్​ (హెచ్‌సీఏ)కు హైకోర్టు షాకిచ్చింది. ప్రస్తుతం అధ్యక్షునిగా ఉన్న అమర్​ నాథ్ నియామకం చెల్లదని తీర్పునిచ్చింది. వెంటనే బాధ్యతల నుంచి వైదొలగాలని ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరిపి కొత్త అధ్యక్షున్ని ఎన్నిక చేయాలని పేర్కొంది.

ఇంతకు ముందు వరకూ హెచ్‌సీఏ అధ్యక్షునిగా జగన్మోహన్​ రావు ఉన్న విషయం తెలిసిందే. ఈ పదవి కోసం ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలాక్సీ క్రికెట్​ క్లబ్ కు చెందిన అమర్​ నాథ్​ పై జగన్మోహన్ రావు ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అయితే జగన్మోహన్​ రావు ఎన్నికను ఎన్నికను సవాల్ చేస్తూ అమర్​ నాథ్​ అంబుడ్స్​ మెన్​ కు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి కృష్ణాయాదవ్​ కు చెంది గౌలిపురాలో ఉన్న శ్రీచక్ర క్రికెట్​ క్లబ్​ లో సభ్యునిగా ఉన్నట్టు జగన్మోహన్​ రావు ఫోర్జరీ సర్టిఫికెట్లు సృష్టించి హెచ్ సీఏ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారని పేర్కొన్నారు.

Advertisement

Also Read: ఎయిర్ ప్యూరిఫైయర్ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే.. ఊరిపితిత్తులు ఔట్!

దీనిపై విచారణ జరిపిన అంబుడ్స్​ మెన్​ జగన్మోహన్​ రావు స్థానంలో అమర్​ నాథ్​ ను అధ్యక్షునిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హెచ్​ సీఏ కార్యకలాపాలు స్తంభించకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పేర్కొంది. కాగా, అమర్​ నాథ్​ ను హెచ్​ సీఏ అధ్యక్షునిగా నియమించటాన్ని సవాల్ చేస్తూ జగన్మోహన్​ రావు హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అంబుడ్స్​ మెన్​ నిర్ణయంతో జరిగిన అమర్​ నాథ్​ నియామకం చెల్లదని తీర్పునిచ్చింది. జనరల్ బాడీ మీటింగ్ జరిపి కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకోవాలని సూచించింది.

Advertisement

Also Read: కాక్రోచ్ ఉద్య‌మంపై కాషాయ ద‌ళం విషం! కిస్ ఆఫ్ ల‌వ్ నిర‌స‌న ఫోటోలతో ప‌క్క‌దారి ప‌ట్టించే య‌త్నం..

Related News

ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో దారుణం.. కత్తులతో దాడి చేసి చంపేసి, సీసీటీవీ సాక్షిగా..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తెలంగాణ ఇష్యూ ఢిల్లీకి.. BRS నేతల భారీ ప్లాన్!

తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..?

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దుర్గం చెరువు 2 రోజులు క్లోజ్!

పోలీసుల ముందుకు కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్… ఆ ముగ్గురితో లింకులపై ఆరా!

సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!

Big Stories

Advertisement
×