E-Paper
Advertisement

బొబ్బిలి వీణల లొల్లి లేపిన ఎమ్మెల్యే బేబీ నాయన.. అయిన కదలని అటవీ శాఖ ఫైళ్లు!

బొబ్బిలి వీణల లొల్లి లేపిన ఎమ్మెల్యే బేబీ నాయన.. అయిన కదలని అటవీ శాఖ ఫైళ్లు!
Advertisement

Bobbili Veena: బొబ్బిలి వీణలు.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి ఈ వీణలు. శతాబ్దాల చరిత్ర ఈ అరుదైన కళారూపానిది. దీనికి GI ట్యాగ్ కూడా లభించింది. అలాంటి సంప్రదాయ కళకు ఇప్పుడు కష్టమొచ్చింది. ఇప్పుడీ కష్టం ఇలానే కొనసాగితే.. ఏడు స్వరాల అమృతాన్ని కురిపించే ఆ వీణ నాదం మూగ వేదనగా మారే ప్రమాదం ఉంది. తరతరాలుగా ఈ కళను నమ్ముకున్న హస్తకళాకారులను పనస కలప కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒకప్పుడు ఆర్డర్లు వస్తే చాలు ఉత్సాహంగా చేతులకు పని చెప్పే కళాకారులు ఇప్పుడు ముడిసరుకు దొరక్క చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పనస కలప..

బొబ్బిలి వీణలకు అంతర్జాతీయంగా అంత క్రేజ్ ఉండటానికి కారణం అది ఏకఖండ వీణ కావడం. అంటే ఎక్కడా అతుకులు లేకుండా ఒకే పనస మొద్దును తొలిచి ఈ వీణను తయారు చేస్తారు. పనస కలపకు శబ్దాన్ని ప్రకంపించే గుణం అద్భుతంగా ఉంటుంది. పైగా ఈ కలప తేలికగా ఉండి, వాతావరణ మార్పులకు త్వరగా పాడవదు. వందేళ్లయినా వీణ చెక్కుచెదరకుండా ఉండాలంటే పనస కలప ఒక్క పరిష్కారం. కానీ ఇప్పుడు ఆ పనస కలప దొరకడమే గగనమైపోయింది. ఈ సమస్యను గుర్తించిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన చొరవతో ఇటీవల అసెంబ్లీలో బొబ్బిలి వీణల అంశం ప్రస్తావనకు వచ్చింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా, ప్రభుత్వం బొబ్బిలి వీణ కళాకారుల కోసం 5 లక్షలు మంజూరు చేసింది.

Advertisement

Also read: భారత్‌ లో ఈవీ బైక్‌ల జోరు.. త్వరలో మార్కెట్‌ లోకి అడుగు పెట్టనున్న 5 మోడళ్లు ఇవే!

వీణల తయారీ వేగవంతం..

ప్రభుత్వ నిధులతో సుమారు మూడు నెలల క్రితం అటవీ శాఖ అధికారులు రెండున్నర లక్షల విలువైన పనస కలపను కొనుగోలు చేసి బొబ్బిలి వీణల కేంద్రం సమీపంలో నిల్వ ఉంచారు. అయితే ఇప్పటి వరకు ఆ కలపను కళాకారులకు పంపిణీ చేయకపోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలప పంపిణీపై ప్రశ్నిస్తే త్వరలో సమావేశం ఏర్పాటు చేసి ఇస్తామని అధికారులు చెబుతున్నారంటున్నారు కళాకారులు. అయితే ఆ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టత మాత్రం లేదు. ఇప్పటికే పనుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు కలప అందిస్తే వీణల తయారీ వేగవంతమై జీవనోపాధికి ఊరట లభిస్తుందనేది వారు చెబుతున్న మాట.

గిఫ్ట్ ఆర్టికల్స్ గా..

Advertisement

నిజానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకప్పుడు పనస తోటలు ఎక్కువగా ఉండేది. కానీ కాలక్రమేణా రైతులు పనస తోటలను నరికేసి, ఎక్కువ లాభాలనిచ్చే జీడిమామిడి, యూకలిప్టస్ తోటల వైపు మొగ్గు చూపారు. అది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. పెద్ద వీణల తయారీ తగ్గడంతో, చాలామంది కళాకారులు ఉపాధి కోసం గిఫ్ట్ ఆర్టికల్స్ గా ఇచ్చే మినీ వీణల తయారీకే పరిమితమవుతున్నారు. మరికొందరు ఈ వృత్తిని వదిలేసి రోజువారీ కూలీ పనులకు వెళ్తున్నారు. ఇక కిందా మీద పడి కలప కోసం పోరాటాలు చేస్తే.. ఇలా అధికారులు మరింత ఆలస్యం చేస్తున్నారంటున్నారు కార్మికులు.

Also Read: జుట్టు పీచులా మారిపోయిందా? శనగపిండి హెయిర్ మాస్క్‌తో మెరిసిపోవడం గ్యారెంటీ!

Related News

ఫ్లాప్ షో నుంచి హిస్టారికల్ విక్టరీ దాకా.. 37 రోజుల్లో ఢిల్లీని ఊపేసిన జెన్-జీ తుఫాన్!

ఒరేయ్‌.. నీనింకా చావ‌లేదురా.. అప్పుడే చంపేయ‌కుర్రి…! మీ బ్రే..కింగుల అత్యుత్సాహం చావ..!

బొద్దింక గర్జన-శాశ్వతమేనా ?

జంత‌ర్ మంత‌ర్ టు పార్ల‌మెంట్‌.. తెలంగాణ గ‌ల్లీ నుంచి ఢిల్లీ జెన్‌-జీకి ప్ర‌తిపాద‌న‌..!

కాక్రోచులకు అండగా కాంగ్రెస్‌.. విద్యార్థి ఉద్య‌మాల‌కు వెన్నుద‌న్నుగా ఉంటామంటూ..

ఎప్పుడు త‌గ్గాలో తెలుసుకున్నాడు.. కానీ నెగ్గ‌లేదు! అభిమానుల‌కు మింగుడు ప‌డ‌ని మోడీ నిర్ణ‌యం..

హ‌మ్మ‌య్య‌.. ఊపిరిపీల్చుకున్న టాలీవుడ్‌.. మ‌న సెల‌బ్రిటీలు తేలుకుట్టిన దొంగ‌లు..!

బొద్దింక‌ల చేత‌జిక్కి … చేతులు కాలాక ఆకులు.. బద్నాం చేసిన పంతం..!

Big Stories

Advertisement
×