E-Paper
Advertisement

ఆగస్టు ప్రీమియర్‌కు బిగ్ బాస్ 10 రెడీ.. కింగ్ నాగ్ కొత్త లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా, ఈసారి మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ?

ఆగస్టు ప్రీమియర్‌కు బిగ్ బాస్ 10 రెడీ.. కింగ్ నాగ్ కొత్త లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా, ఈసారి మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ?

Bigg Boss Telugu 10 Promo: బిగ్ బాస్…ఈ షోకి ఆడియన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.ఇదే క్రమంలో మరోసారి ఆడియన్స్ ని అలరించేందుకు పదో సీజన్ రెడీ అయిపొయింది.అందులో భాగంగా బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఎన్నడూ లేనంతగా అంచనాలు పెంచేస్తూ పదో సీజన్ అఫీషియల్ ప్రోమో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.హోస్ట్ అక్కినేని నాగార్జున రివీల్ చేసిన ‘దశావతారం’ థీమ్ చూసి కింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 సరికొత్త నిర్వచనం చెప్పబోతున్నపదో సీజన్

ఈ మైల్ స్టోన్ సీజన్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే  తెగ డిబేట్లు పెట్టేస్తున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్ . ఈ చిన్న వీడియో క్లిప్‌లో ఉన్న ప్రతి ఫ్రేమ్‌ను జల్లెడ పట్టె పనిలో పడ్డారు నెటిజన్లు. గతంలో ఎన్టీఆర్, నాని హోస్ట్‌లుగా చేసిన సీజన్ల కంటే, నాగార్జున హోస్ట్‌గా వచ్చిన గత కొన్ని సీజన్లు ఒక ఎత్తైతే, ఈ పదో సీజన్ రియాలిటీ షోలకే సరికొత్త నిర్వచనం చెప్పబోతోందని స్పష్టమవుతోంది.

also read :ఆ ఒక్క టీజర్‌తో పెరిగిన అంచనాలు.. యశ్ ‘టాక్సిక్’ డైరెక్టర్ బర్త్‌డే గ్లింప్స్ వైరల్.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడేనా?

ఈ పాపులర్ రియాలిటీ షో విజయవంతంగా పదేళ్ల మైలురాయిని చేరుకోవడం టాలీవుడ్ బుల్లితెర చరిత్రలో ఒక పెద్ద సక్సెస్ అనే చెప్పాలి.కమల్ హాసన్ క్లాసిక్ మూవీ ‘దశావతారం’ తరహాలోనే.. ఈ కాన్సెప్ట్ వెనుక ఆటలో పది రకాల విభిన్నమైన షేడ్స్ లేదా రూల్స్‌లో ఊహించని భారీ మార్పులు ఉండబోతున్నాయని గట్టిగానే హింట్ ఇచ్చారు మేకర్స్.

స్పెషల్ సీజన్‌లో పది రకాల అవతారాలు 

ఇక ఈ లేటెస్ట్ ప్రోమోలో  స్టైలిష్ లుక్‌లో మెరిసిపోయారు నాగ్.ఈ స్పెషల్ సీజన్‌లో ఆట పది రకాల అవతారాలను చూపిస్తుందని ఆయన ఇచ్చిన క్లూస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఈ థీమ్ పది మంది పాత సీజన్ల స్ట్రాంగ్ మాజీ కంటెస్టెంట్స్ రీ-ఎంట్రీని కూడా సూచిస్తుండొచ్చనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

సాధారణంగా దశావతారం అంటే పది రకాల రూపాలు లేదా అవతారాలు అని అర్థం. బిగ్ బాస్ కాంటెక్స్ట్‌లో చూస్తే, కంటెస్టెంట్స్ మైండ్ గేమ్‌ను పరీక్షించడానికి పది రకాల గేమ్ ఛేంజింగ్ ఫార్మాట్లను తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్లాన్ చేస్తున్న హౌస్ డిజైన్ కూడా ఈ గ్రాండ్ థీమ్‌కు తగ్గట్టుగానే విజువల్ వండర్‌గా ఉండబోతోందని సమాచారం. ప్రోమోలో విజువల్స్ హై-టెక్ ఎలిమెంట్స్‌తో పాటు ట్రెడిషనల్ లుక్‌ను కలిగి ఉండటం ప్రేక్షకుల్లో షోపై మరింత క్యూరియాసిటీని పెంచేసిందనే చెప్పాలి.

also read :ఫ్యాన్స్‌కు షాక్.. ‘జాతిరత్నాలు 2’ కి ఆ ఒక్కటి మైనస్ అంటున్న నాగ్ అశ్విన్!

ఇక ఈ క్రేజీ షో స్ట్రీమింగ్ విషయానికి వస్తే స్టార్ మా (Star Maa) SD మరియు HD ఛానల్స్‌లో ఈ షో ప్రసారం కానుంది. ఇక డిజిటల్ ఆడియన్స్ కోసం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar) యాప్‌లో 24/7 లైవ్ ఫీడ్ అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్, అన్‌కట్ సీన్స్ కోసం మిలియన్ల కొద్దీ వ్యూయర్స్ ఈ ప్లాట్‌ఫామ్‌ను ఫాలో అవుతుంటారని చెప్పక్కర్లేదు.

సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్ ప్రీమియర్?

ఇకపోతే ఈ ఏడాది ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్ ప్రీమియర్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. షో టైమింగ్స్, కంటెస్టెంట్ల లిస్ట్‌పై త్వరలోనే రాబోయే మరికొన్ని క్రేజీ టీజర్లలో క్లారిటీ రానుందని తెలుస్తుంది. ఈసారి మెంటల్ గేమ్ చాలా టఫ్‌గా ఉండబోతోందని, దశావతారం ట్విస్ట్‌లో భాగంగా పది వారాల పాటు అత్యంత కఠినమైన టాస్క్‌లు ఉంటాయని ఇన్‌సైడ్ టాక్.ఇక ఇప్పటికే పలువురు మాజీ కంటెస్టెంట్స్ ఈ ఫస్ట్ ప్రోమోపై సోషల్ మీడియాలో క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు కూడా.

ఇక వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ఇందులో సినిమాలు, సీరియల్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్.. ఇలా రకరకాల రంగాలకు చెందిన సెలబ్రిటీల ఎంపికలో కూడా ఈసారి మంచి బ్యాలెన్స్ ఉండబోతోందని తెలుస్తుంది.ఇక నాగార్జున ఎనర్జీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే రీసెంట్ వైల్డ్ యాక్షన్ సినిమాల వైబ్స్ గుర్తుకొస్తున్నాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాత విన్నర్స్ ఎవరైనా మళ్ళీ గెస్ట్‌లుగా వస్తారా? అనే సస్పెన్స్ కూడా నడుస్తోంది..ఏది ఏమైనా లాంచ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ క్రేజ్ ఇంకా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

also read :NBK 111.. థియేటర్లలో స్పీకర్లు పగిలిపోవడం ఖాయం.. బాలయ్య సినిమాపై తమన్ ఊరమాస్ అప్‌డేట్!

Related News

ఆ సీన్లు తీసేయాల్సిందే.. ‘పెద్ది’ మేకర్స్‌కు ఆదివాసీల అల్టిమేటం.. థియేటర్లు బంద్ చేస్తామంటూ హెచ్చరిక!

NBK 111.. థియేటర్లలో స్పీకర్లు పగిలిపోవడం ఖాయం.. బాలయ్య సినిమాపై తమన్ ఊరమాస్ అప్‌డేట్!

ఆ ఒక్క టీజర్‌తో పెరిగిన అంచనాలు.. యశ్ ‘టాక్సిక్’ డైరెక్టర్ బర్త్‌డే గ్లింప్స్ వైరల్.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడేనా?

పాపం ఆ అమ్మాయిని టార్గెట్ చేయొద్దు.. జాన్వీ కపూర్‌పై ట్రోలింగ్..ఘాటుగా స్పందించిన జగ్గుభాయ్

ఫ్యాన్స్‌కు షాక్.. ‘జాతిరత్నాలు 2’ కి ఆ ఒక్కటి మైనస్ అంటున్న నాగ్ అశ్విన్!

జాన్వీ ఇన్‌స్టా చాట్ లీక్.. ఆ సీన్లపై అసహనం, బుచ్చిబాబుపై గుర్రు, చెర్రీ గురించి కూడా!

‘నాకు హేటర్స్ ఉన్నారా ఏంటి?’.. నెటిజన్ ప్రశ్నకు సామ్ క్రేజీ రిప్లై!

Big Stories

×