E-Paper
Advertisement

తెలంగాణకు భారీ పెట్టుబడుల వరద.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే?

తెలంగాణకు భారీ పెట్టుబడుల వరద.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే?
Advertisement

Future City: తెలంగాణ భవిష్యత్తును మార్చే అత్యంత కీలక ప్రాజెక్ట్‌గా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు, నవంబర్ నెలాఖరులోగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని అధికారులకు డెడ్‌లైన్ విధించారు. ప్రపంచ స్థాయి సంస్థలకు తెలంగాణను గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో..

మీ పెట్టుబడులకు మాది భరోసా’ అనే నినాదంతో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ వ్యూహరచన చేస్తోంది. ఈ సమ్మిట్ ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు, మన యువతకు లక్షలాదిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సర్కార్ భావిస్తోంది.

అంతర్జాతీయ స్థాయికి..

Advertisement

ఫ్యూచర్ సిటీ సాకారమైతే హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయికి మరింత పెరుగుతాయి. మొత్తంగా డిసెంబర్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్.. తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించడంలో అత్యంత కీలకం కానుంది.

Also read: ఆడి కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొట్టి, బాధితుడ్ని తొక్కుకుంటూ వెళ్లిన డ్రైవర్!

Tags

Related News

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు.. ఏకంగా రూ.39 లక్షలకు పైగా లంచం వసూల్!

ఈ-ముద్ర ప్రైవేట్ కీస్ లోపం అసలు ఎలా జరిగింది?.. అసలు మ్యాటర్ ఇదే?

రైతుల కష్టాలకు ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణం.. ఆర్.ఎస్ ప్రవీణ్ ఫైర్!

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. గొడవలో డీఆర్డీఓ ఉద్యోగి మృతి.. అసలేం జరిగిందంటే?

వచ్చే 8 నెలలు బిగ్ అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న కీలక సూచనలివే?

నేరాలపై ఉమ్మడి దండయాత్ర.. దక్షిణాది రాష్ట్రాల పోలీసు బాస్‌ల మెగా మీట్!

ఇదేం విచిత్రం.. మూడు కార్పొరేషన్లకు 3 రకాల ఆర్థిక తారతమ్యాలా..?

Big Stories

Advertisement
×