Hyderabad: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఆదివారం ఓ ఎలక్ట్రిక్ కారు (EV)లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు నుండి దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడటంతో సమీపంలో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. కారు నంబర్ ప్లేట్ (TS09GD1262) ఆకుపచ్చ రంగులో ఉండడంతో, మంటలు అంటుకున్నది ఎలక్ట్రిక్ వాహనమేనని స్పష్టమైంది.
పొగలు ఎగసిపడటం గమనించిన స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. గాంధీ నగర్ ట్రాఫిక్ పోలీసులు, దోమలగూడ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు. అయితే కారు అప్పటికే పూర్తిగా దగ్దం కాగా, మరో కారు పాక్షికంగా దగ్ధం అయింది.
అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు, కేవలం వాహనానికి మాత్రమే నష్టం కలిగింది. బ్యాటరీ సమస్య వల్ల మంటలు చెలరేగాయా లేక ఇతర సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ కారులో చెలరేగిన మంటలు..
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఘటన
ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు pic.twitter.com/vt8HTcWRxg
— ChotaNews App (@ChotaNewsApp) November 16, 2025
Read Also: Car Fire Accident: కారు బీభత్సం.. బైక్, ట్యాంకర్‌ను ఢీ కొని దగ్ధమైన వాహనం..