E-Paper
Advertisement

New Year Restrictions: హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. అర్ధరాత్రి 1 గంట వరకే పర్మిషన్!

New Year Restrictions: హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. అర్ధరాత్రి 1 గంట వరకే పర్మిషన్!
Advertisement

New Year Restrictions: మహానగరంలో నూతన సంవత్సర వేడుకల (New Year 2026) కోసం హైదరాబాద్ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఈ మేరకు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్ వేర్వేరుగా మార్గదర్శకాలు జారీ చేశారు. ముఖ్యంగా పబ్బులు, క్లబ్బులు, ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

తమ పరిధిలోని పబ్బులు, హోటల్స్, క్లబ్స్ యజమానులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మైనర్లను (18 ఏళ్ల లోపు వారిని) పబ్బుల్లోకి అనుమతిస్తే సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్బులకు ఎంట్రెన్స్, ఎగ్జిట్ గేట్లు వేర్వేరుగా, తప్పనిసరిగా ఉండాలని సూచించారు. పరిమితికి మించి రద్దీని (Crowd) అనుమతించవద్దని, లౌడ్ మ్యూజిక్ విషయంలో ఇండోర్, అవుట్‌డోర్ టైమింగ్స్ పాటించాలని స్పష్టం చేశారు. ఈవెంట్ల కోసం వెస్ట్ జోన్‌లో ఇప్పటివరకు 23 దరఖాస్తులు వచ్చాయని, నిర్వాహకులు కచ్చితంగా పార్కింగ్ స్థలాన్ని చూపించాలని, రోడ్లపై పార్కింగ్ చేస్తే చర్యలు ఉంటాయని తెలిపారు.

Advertisement

మరోవైపు, ఐటీ కారిడార్‌లోని మాదాపూర్ డీసీపీ రితిరాజ్ కూడా కీలక నిబంధనలను ప్రకటించారు. న్యూ ఇయర్ వేడుకలకు పోలీసు అనుమతి తప్పనిసరి అని, అర్ధరాత్రి 1 గంట వరకే ఈవెంట్లకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఈవెంట్స్ జరిగే ప్రదేశాల్లో ఫైర్ సేఫ్టీ కిట్లు కచ్చితంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ఆన్ ది స్పాట్ స్పందించేలా శిక్షణ పొందిన వెయిటర్లు, సిబ్బంది మాత్రమే విధుల్లో ఉండాలని ఆదేశించారు.

డ్రగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం:

మాదక ద్రవ్యాల వినియోగంపై పోలీసులు జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటించారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఎన్‌డిపిఎస్ (NDPS) యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెడతామని ఇద్దరు డీసీపీలు హెచ్చరించారు. అలాగే నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్‌పోస్టులను కట్టుదిట్టం చేయనున్నారు. మందు తాగి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేయడమే కాకుండా జైలు శిక్ష పడేలా చర్యలు ఉంటాయన్నారు. కేవలం న్యూ ఇయర్ రోజే కాకుండా, సాధారణ రోజుల్లో కూడా ప్రజలు ఈ నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు.

Advertisement

Read Also: Rachakonda CP Sudheer Babu: రాచకొండను ఎన్‌బీడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్‌గా మారుస్తాం: సీపీ సుధీర్ బాబు

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×