E-Paper
Advertisement

BRS Loves YSRCP : బీఆర్ఎస్, వైసీపీ ప్రేమ కథ.. పెళ్లా, సహజీవనమా?

BRS Loves YSRCP : బీఆర్ఎస్, వైసీపీ ప్రేమ కథ.. పెళ్లా, సహజీవనమా?

రాక రాక కేసీఆర్ బయటకు రావడంతో ఇటు తెలంగాణలోనే కాదు అటు ఏపీ రాజకీయాలపైనా ఆసక్తికర చర్చ జరుగుతున్నది. కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఇక్కడి ప్రతిపక్షనేత. మరి ఏపీ రాజకీయంపై ఎందుకు మాట్లాడినట్టు.. ఎవరికి ఆయన పరోక్షంగా సాయం చేయదలుచుకున్నారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌కా? చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలే అందుకు బెస్ట్ ఉదాహరణ అని ఏపీలో జోరుగా చర్చ జరుగుతున్నది. నదీ జలాల అంశంలో చంద్రబాబు చెబితేనే కేంద్రం చేస్తున్నదని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయ గురువు కావడం విశేషం. అందుకే ఆయన డెరెక్షన్‌లో తెలంగాణ సీఎం పనిచేస్తున్నారని చెప్పకనే చెప్పారని ఏపీలో వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నట్లు సమాచారం.

జగన్‌కే సాయం చేసినట్టే కదా..

చంద్రబాబుపై ప్రస్తుతం ఏపీలో పెద్దగా నెగిటివిటీ లేదు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై సానుకూల ధృక్పతంతోనే ఉన్నారు. ఎందుకుంటే అక్కడ ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కూటమికే ప్లస్ అయ్యింది. మరోవైపు సిక్స్ గ్యారెంటీస్, రాజధాని అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల విషయంలో గత జగన్ సర్కార్ కంటే కూటమి సర్కార్ చాలా వేగంగా పురోగమిస్తున్నది. అందుకే వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలను అక్కడి జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. సొంత రాష్ట్ర ప్రతిపక్ష నేత చెబితే జనాలు పట్టించుకోవడం లేదని.. తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ సాయం జగన్ కోరుకుంటున్నారా? ఈ సీక్రెట్ లవ్ స్టోరీ..ఇంకెంతకాలం అని కూటమి శ్రేణులు విమర్శిస్తున్నారు.

జగన్ ఇలాఖాలో కేసీఆర్ ఫ్లెక్సీలా?

నిన్న జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇలాఖాలో కొందరు వైసీపీ శ్రేణులు కేసీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది.అంటే కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వస్తున్నారని, ప్రెస్‌మీట్ పెట్టబోతున్నారని వారికి ముందే తెలుసా? ఈ క్రమంలోనే కేసీఆర్‌కు మద్దతుగా వారు అక్కడ ప్లెక్సీలు ఏర్పాటు చేశారా? కేసీఆర్ ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాతారని సైతం వారికి ముందే తెలుసా? అందుకే కేసీఆర్ ప్రెస్‌మీట్ అనంతరం ఆయనకు మద్దతుగా కొందరు వైసీపీ నేతలు మాట్లాడటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రాష్ట్రాల ప్రభుత్వాలు అభివృద్ధి కోసం సహకరించుకోవడం అందరికీ తెలుసు. కానీ, విచిత్రంగా రెండు రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు ఇలా గుట్టుగా దోస్తీ చేయడం దేనికి సంకేతం? అసలు వీళ్ల స్ట్రాటజీ ఏంటి? టీడీపీని ఎందుకు టార్గెట్ చేశారు? తెలంగాణలోని వైసీపీ అభిమానులను ప్రసన్నం చేసుకోవడానికే కేసీఆర్ ఇలా చేశారా? లేక జగన్‌కు మాట సాయం చేద్దామనుకున్నారా? అనే ప్రచారం జోరందుకుంది.

అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ భారత రాష్ట్రసమితిని ప్రారంభించి.. ఏపీలో ఆఫీసు కూడా ఏర్పాటు చేశారు. కొందరికి అక్కడి బాధ్యతలు కూడా అప్పగించారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ ఓటమి తర్వాత ఆయన ఫాంహోస్‌కే పరిమితమయ్యారు. జగన్, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇరువురు నేతలు ఒకరికొకరు సహకరించారు. రాష్ట్రంలో నదీ జలాల వివాదం జగన్ హయాంలోనే మొదలైందని, కేసీఆర్ జగన్ ఇంటికి వెళ్లి చేపల కూర తిని రాయలసీమ లిఫ్ట్‌కు ఒకే చెప్పి వచ్చారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ విమర్శిస్తున్నారు. అధికారం పోయినా వీరిద్దరూ ఇలా సహకరించుకుంటున్నారంటే వీరిమధ్య ఉన్నది ప్రేమ.. పెళ్లా? సహజీవనమా? అని కొందరు తుంటరి కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రాష్ట్రాన్ని ముక్కలు చేశారనే కోపం ఏపీ ప్రజలకు.. కేసీఆర్ మీద పోదని, ఆయన మద్దతిచ్చిన వారికి ఉండదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×