E-Paper
Advertisement

HYDRA: అటు జన్వాడ ఫాంహౌస్.. ఇటు ఒవైసీ కాలేజీ.. కూల్చివేతలకు సిద్ధం?

HYDRA: అటు జన్వాడ ఫాంహౌస్.. ఇటు ఒవైసీ కాలేజీ.. కూల్చివేతలకు సిద్ధం?
Advertisement

– మళ్లీ తెరపైకి జన్వాడ ఫాంహౌస్‌
– కొలతలు తీసుకున్న అధికారులు
– నిబంధనలు ఉల్లంఘించినట్టు గతంలో రిపోర్ట్
– బఫర్‌ జోన్‌లో భారీ ప్రహరీ గోడ నిర్మాణం
– ఒవైసీ కాలేజీపైనా పెద్దఎత్తున చర్చ
– సలకం చెరువును పరిశీలించిన అధికారులు?
– కూల్చివేతపై పెద్దఎత్తున ప్రచారం

Demolition: హైడ్రా ఏర్పాటైన తర్వాత అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. నింబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన వారు ఎంతటి వారైనా కూల్చివేతలకు వెనుకాడటం లేదు. కేటీఆర్‌ లీజుకు తీసుకున్నానని చెప్తున్న జన్వాడ ఫాంహౌస్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఇరిగేషన్ అధికారులు కేటీఆర్ ఫాంహౌస్‌కి వెళ్లారు. అక్కడ కొలుతలు కూడా తీసుకున్నారు. ఫాంహౌస్‌ వ్యవహారంపై ఇరిగేషన్ శాఖతోపాటు హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో వారు రంగంలోకి దిగారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలపై హైడ్రా గత కొంతకాలంగా కొరడా ఝుళిపిస్తోంది. గండిపేట్‌ జలాశయం ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఫాంహౌ‌స్‌లను కూల్చివేసేందుకు వివరాలు సేకరిస్తోంది. జన్వాడ ఫాంహౌస్ కూల్చివేసే విషయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 99 ప్రకారమే నడుచుకోవాలని హైడ్రాను ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఫాంహౌస్ ఉంటే తానే దగ్గర ఉండి కూల్చివేయిస్తానని కేటీఆర్ చెప్పారు. అయితే, అక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు అధికారులు గతంలోనే తేల్చారు.

Advertisement

2020లోనే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. బుల్కాపూర్ నాలాను కబ్జా చేసినట్లు రిపోర్ట్ ఇచ్చారు. స్వేచ్ఛ – బిగ్‌ టీవీ దగ్గర జన్వాడపై జరిపిన సర్వే రిపోర్ట్ ఉంది. బుల్కాపూర్‌ నాలా పక్కనే ఉన్న ఈ ఫాంహౌస్ ఉంది. మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ అక్కడే ఉండేవారు. ఫాంహౌస్ చుట్టూ కేటీఆర్ భార్య, సన్నిహితుల భూములు ఉన్నాయి. బుల్కాపూర్ నాలాను కబ్జా చేస్తూ ఫాంహౌస్ గేటు నిర్మాణం చేశారు. గేటు కారణంగా నాలా కుచించుకుపోయిందనేది రిపోర్ట్ సారాంశం. 2020లో రిపోర్ట్ తయారైనా గతంలో అధికారులు చర్యలు తీసుకోలేదు. నాలాకు 9 మీటర్ల వరకూ బఫర్ జోన్‌ ఉంది. నిబంధనల ప్రకారం బఫర్‌ జోన్‌లోనూ ఎలాంటి కట్టడాలు ఉండకూడదు. భారీ ప్రహారీ గోడను కట్టి గేటు ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫాంహౌస్ నిర్మించారు. ఇరిగేషన్ అధికారులు కొలతలు తీసుకున్న నేపథ్యంలో జన్వాడ ఫాంహౌస్ కూల్చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ నువ్వేమైనా పుడింగివా.. అసలు నీకు ఫ్యాన్స్ ఉన్నారా.. జనసేన ఎమ్మెల్యే ఫైర్

Advertisement

ఒవైసీ కాలేజీ కూడా కబ్జాయే!

చాంద్రాయణగుట్టలో సలకం చెరువులో 12 ఎకరాలు కబ్జా చేసి ఒవైసీ కాలేజీ నిర్మాణం చేసినట్టు హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కాలేజీని కూల్చివేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటికే కాలేజీకి నోటీసులు పంపారు. మంగళవారం సలకం చెరువును పరిశీలించినట్టు తెలుస్తోంది. దీంతో రేపోమాపో దీన్ని కూడా కూల్చివేస్తారని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒవైసీ కాలేజీ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఒవైసీ పెద్ద బంగ్లా నిర్మించారని, ఆయన ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉండొచ్చని అన్నారు. దానిపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మద్దతుతోనే చెరువు కబ్జా చేసి కాలేజీ కట్టారని, 30 ఎకరాల చెరువుల్లో 12 ఎకరాలు ఆక్రమించారని ఆరోపించారు. ఒవైసీ బ్రదర్స్ ఎడ్యుకేషన్ పేరుతో కోట్లు కొల్లగొడుతోందన్న రాజాసింగ్, చెరువుల పరిరక్షణకు సీఎం చేస్తున్న పనిని అభినందిస్తున్నానని అన్నారు. సీఎంను అక్బరుద్దీన్ భయపెట్టాలని చూస్తున్నారని, ఆయన భయపడకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఇలాగే బెదిరిస్తే ఆయన అరెస్ట్ చేయించారని గుర్తు చేశారు. తన నియోజకవర్గంలో ఎంఐఎం నేతలు హైదరాబాద్ కలెక్టర్ మద్దతుతో ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆరోపించారు. వాటిపైనా ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ ల్యాండ్‌ను కాపాడాలని కోరారు రాజాసింగ్.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×