BigTV English

Rent Problems for ATM: రెంట్ కట్టనందుకు ఏటీఎంకు తాళం.. సోషల్ మీడయాలో వీడియో వైరల్

Rent Problems for ATM: రెంట్ కట్టనందుకు ఏటీఎంకు తాళం.. సోషల్ మీడయాలో వీడియో వైరల్

Rent Problems for ATM: డబ్బులు ఇవ్వాల్సి ఉంటేనో.. లేదా రెంట్ కట్టకపోతేనో ఇంటి ఓనర్లు ఇళ్లకు తాళాలు వేసిన ఘటనలు మీరు చూసే ఉంటారు. కానీ, ఓ ఏటీఎంకు కూడా అద్దె తిప్పలొచ్చాయి. రెంట్ కట్టకపోవడంతో ఆ ఏటీఎం ఉన్న ఇంటి ఓనర్ ఆ ఏటీఎం రూంకు తాళం వేశాడు. దీంతో డబ్బులు డ్రా చేసుకుందామని ఏటీఎంకు వచ్చిన కస్టమర్లు ఆ తాళాన్ని చూసి వెనుదిరుగుతున్నారు. రెంట్ పే చేయనందుకే ఏటీఎంకు తాళం వేసినట్లు ఆ ఇంటి ఓనర్ ఓ పేపర్ కూడా అంటించాడు. ఈ సంఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల్లో వస్తున్న వివరాల ప్రకారం..


కరీంనగర్ లోని హౌజింగ్ బోర్డు కాలనీలో ఓ ఏటీఎం మెషీన్ ఉన్నది. ఈ ఏటీఎంకు కస్టమర్లు వచ్చి డబ్బులను డ్రా చేసుకుని వెళ్తుంటారు. అయితే, ప్రస్తుతం ఆ ఏటీఎం వద్దకు వస్తున్న కస్టమర్లు ఆశ్చర్యపోతున్నారు. అదేమంటే.. ఆ ఏటీఎంకు తాళం వేసి ఉంది. దానిపైన ఓ పేపర్ కూడా రాసి అంటించాడు. ఇదేంటని తెలుసుకుంటే రెంట్ పే చేయనందుకు ఏటీఎంకు తాళం వేసినట్లు దానిపై పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: జన్వాడ ఫామ్ హౌస్‌లో సర్వే చేసిన అధికారులు.. రేపో మాపో కూల్చుడేనా..?


ఈ విషయం తెలిసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. డబ్బులిచ్చే ఏటీఎంకు డబ్బులు లేని పరిస్థితి వచ్చిందా? అంటూ చెవులు కొరుక్కుంటున్నారు.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×