E-Paper
Advertisement

Allu Arjun: అల్లు అర్జున్ నువ్వేమైనా పుడింగివా.. అసలు నీకు ఫ్యాన్స్ ఉన్నారా.. జనసేన ఎమ్మెల్యే ఫైర్

Allu Arjun: అల్లు అర్జున్ నువ్వేమైనా పుడింగివా.. అసలు నీకు ఫ్యాన్స్ ఉన్నారా.. జనసేన ఎమ్మెల్యే ఫైర్
Advertisement

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్రోల్స్ లోనే ఎక్కువ బన్నీ పేరు వినిపిస్తుంది. అందుకు కారణం.. వైసీపీ నేతకు బన్నీ సపోర్ట్ చేయడమే. ఇది ఎప్పటినుంచో నడుస్తున్న వివాదమే కదా అని అనుకుంటే పొరపాటే..  మానిన గాయాన్నీ బన్నీ మళ్లీ రేపాడు. ఈ మధ్యనే మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లో నాకు నచ్చితే నా ఫ్రెండ్ కోసం ఎక్కడికైనా వస్తా.. నా మనసుకు నచ్చితే వస్తా అంటూ ఆగిపోయిన వివాదానికి ఆజ్యం పోశాడు.

ఇక దీంతో మెగా ఫ్యాన్స్  బన్నీని ఇంకా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇంకోపక్క బన్నీ అటెన్షన్ కోసమే చేస్తున్నాడని కొందరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే బన్నీ మాటలకు కౌంటర్ గా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్  చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నేడు తాడేపల్లిగూడెంలో  జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు అల్లు అర్జున్ కు సంబంధించిన ప్రశ్న ఎదురయ్యింది.

Advertisement

బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ” అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నారా .. ? ఈ విషయం నాకు తెలియదే. వాళ్లలో ఎక్కువ మెగా ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు.  మెగా కుటుంబం నుంచి విడిపోయిన వ్యక్తులు.. బ్రాంచీలుగా, షామియానాలుగా పెట్టుకున్నారేమో నాకు తెలియదు. ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారని ఆయన అనుకుంటున్నాడేమో.. చిరంజీవి అభిమానులు నీలో చిరంజీవిని చూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ అభిమానులు నీలో పవన్ కళ్యాణ్ ను చూస్తున్నారు. రామ్ చరణ్ అభిమానులు నీలో రామ్ చరణ్ ను చూస్తున్నారు.

అల్లు అర్జున్  నువ్వేమైనా పుడింగివా.. ?  నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావ్.  నాకు ఇష్టమైతే వస్తా అని అంటే.. రాకు, మానెయ్.. ఎవడు  రమ్మన్నాడు..? నిన్నేమైనా రమ్మని అడిగామా.. ? నువ్వు రాకపోయినా మేము నెగ్గాము. తండ్రిని ఎంపీగా నిలబడితే నెగ్గించుకోలేకపోయాయావ్” అంటూ నోరు జారాడు.

Advertisement

ఇక దీంతో శ్రీనివాస్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలయ్యింది. అల్లు ఫ్యాన్స్ కట్ట కట్టుకొని శ్రీనివాస్ కు సంబంధించిన ప్రతి వీడియోను తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై శ్రీనివాస్ స్పందించాడు.

““నాకు ఇష్టమైతే నేను వస్తా” – ఒక మెగా అభిమానిగా చిరంజీవి గారిని కానీ, నాగబాబు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరైనా సరే గౌరవం లేకుండా మాట్లాడితే నేను వస్తా! గతాన్ని మర్చిపోయి మాట్లాడితే కచ్చితంగా వస్తా! మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమనగా.. నా వాక్యాలు పూర్తిగా వ్యక్తిగతం! ఒక మెగా అభిమానిగా మాత్రమే నేను స్పందించా గమనించగలరు” అంటూ   చెప్పుకొచ్చాడు. మరి  ఈ వివ్వడంపై బన్నీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

https://twitter.com/BolisettiSrinu/status/1828421370860175581

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×