BigTV English

Etela Rajender: ఈటల దంపతుల సంచలన ప్రెస్‌మీట్‌.. బీజేపీకి బై?.. కాంగ్రెస్‌కు జై?

Etela Rajender: ఈటల దంపతుల సంచలన ప్రెస్‌మీట్‌.. బీజేపీకి బై?.. కాంగ్రెస్‌కు జై?
etela wife

Etela Rajender latest news(Today breaking news in Telangana): మంగళవారం ఈటల రాజేందర్ దంపతులు మీడియా ముందుకు రానున్నారు. సంచలన ప్రెస్‌మీట్ పెట్టబోతున్నారు. ఏదో పెద్ద విషయమే ప్రకటించబోతున్నారు. రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్న ప్రస్తుత సమయంలో.. ఈటల రాజేందర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నారు? అనేది మరింత హాట్ టాపిక్‌గా మారింది.


ఓవైపు బీజేపీలో లుకలుకలు.. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి ఆహ్వానాలు. ఈటల పొలిటికల్ జంక్షన్లో ఉన్నారు. చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉండి.. పొంగులేటి, జూపల్లిలను బీజేపీలో చేర్పించే విషయంలో విఫలమయ్యారు. బీజేపీలో కేసీఆర్ కోవర్డులు ఉన్నారంటూ.. గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌తో విభేదాలు కూడా ఉన్నాయి. ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ఓసారి, సీఎం కేండిడేట్‌గా ప్రకటిస్తారని ఇంకోసారి.. ప్రచారం జరిగింది. అది ఆయనకే మరింత మైనస్ అయింది. కర్నాటక ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ పరిస్థితి మరింత దిగజారింది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పార్టీని వీడుతారంటూ లీకులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరినీ ఢిల్లీ పిలిపించి మరీ బుజ్జగించింది అధిష్టానం. అయితే, హైకమాండ్‌తో చర్చల తర్వాత కూడా ఈటల నిరుత్సాహంతోనే ఉన్నారు. పొంగులేటి, జూపల్లిలు చేసిన బ్రెయిన్ వాష్ ఆయన మీద బాగానే పని చేస్తున్నట్టుందని అంటున్నారు.

ఈటల రాజేందర్ బీజేపీలో ఉండటం కంటే కూడా.. కాంగ్రెస్‌లో చేరడమే కరెక్ట్ అంటూ పొంగులేటి టీమ్ ఈటలను బాగా డిస్ట్రబ్ చేసింది. అటు, తెలంగాణలో కమలపార్టీ భవిష్యత్తు అంత ఆశాజనకంగా ఏమీ లేదు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేననే భావన ప్రజల్లో బలంగా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీని అంతా డౌట్‌గానే చూస్తున్నారు. ఆ అనుమానం ఈటలలోనూ పెరిగింది. పార్టీలో గ్రూపులు, కోల్డ్‌వార్‌తోనూ ఆయన బాగా విసిగిపోయారని తెలుస్తోంది.


కట్ చేస్తే, ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కాస్త రెస్ట్ తీసుకుని.. భార్యతో బాగా ఆలోచించి, చర్చించి.. ఓ ఫైనల్ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ డెసిషన్ ఏంటో చెప్పడానికే ప్రెస్‌మీట్ పెడుతున్నారని చెబుతున్నారు. ఈటల స్వతహాగా అత్యంత సమర్థుడైన లీడర్. అయితే, అత్యంత కీలక సమయాల్లో మాత్రమే ఆయన సతీమణి జమున జోక్యం చేసుకుంటారు. గతంలో బీఆర్ఎస్‌ను వీడే సమయంలో ఈటల వెంట నిలిచారు జమున. ఆ సమయంలో ఉమ్మడిగా మీడియా సమావేశం పెట్టి.. కేసీఆర్ తీరును ఎండగట్టారు. అయితే, ఉద్యమ విప్లవ భావాలు మెండుగా ఉండే ఈటల రాజేందర్.. కాషాయ కూటమిలో కొంతకాలంగా ఇమడలేకపోతున్నారని వార్తలు వస్తున్నాయి. మంగళవారం ఈటల దంపతుల ప్రెస్‌మీట్ అనగానే.. సతీసమేతంగా మీడియా ముందకు వస్తున్నారంటే.. ఏంటి సంగతి? ఈటల రాజేందర్ బీజేపీని వీడుతున్నారా? ఆ నిర్ణయం ప్రకటించడానికే ప్రెస్‌మీట్ పెడుతున్నారా? బీజేపీని వీడితే.. ఆయన పయణం ఎటు? సొంతపార్టీ పెడతారా? అంతా అంటున్నట్టు కాంగ్రెస్‌లో చేరుతారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×