OTT Movie : పోలీస్ ప్రొసీజరల్, సూపర్ నాచురల్ థీమ్స్ తో ఒక ట్యూనీషియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శనకు వచ్చింది. ఈ కథ అనుమానస్పద స్థితిలో కాలిపోయిన కొన్ని డెడ్ బాడిల ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన స్టోరీ ఇది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘Ashkal: The Tunisian Investigation’ 2022లో వచ్చిన ట్యూనీషియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. యూసెఫ్ చెబ్బీ దర్శకత్వంలో ఫాత్మా ఉస్సైఫీ (ఫాత్మా), మొహమ్మద్ హౌసిన్ గ్రేయా (బటాల్) మెయిన్ లీడ్స్ లో నటించారు. 92 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 6.0/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం prime videoలో స్ట్రీమింగ్ అవుతోంది.
ట్యూనీస్ దేశంలోని ట్యూనిస్ సిటీలో గార్డెన్స్ ఆఫ్ కార్తేజ్ అనే పెద్ద ప్రాజెక్ట్ ఏరియా ఉంది. ఇది పాత డిక్టేటర్ రెజీమ్ స్టార్ట్ చేసిన న్యూ డిస్ట్రిక్ట్. కానీ 2011 ఆరబ్ స్ప్రింగ్ రెవల్యూషన్ తర్వాత అబాండన్డ్ అయిపోయింది. ఖాళీ బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ సైట్స్ మాత్రమే మిగిలాయి. అక్కడ ఒక కేర్‌టేకర్ బాడీ కాలిపోయి దొరుకుతుంది. అతడు స్వయంగా నిప్పు పెట్టుకుని చనిపోయినట్టు కనిపిస్తుంది. కానీ ఎలాంటి ఆధారాలు లేవు, మిస్టీరియస్‌గా ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేటర్స్ ఫాత్మా, ఆమె పార్టనర్ బటాల్ ఈ కేస్ తీసుకుంటారు. వాళ్లు అబాండన్డ్ బిల్డింగ్స్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు మరిన్ని ఇలాంటి కాలిపోయిన బాడీస్ దొరుకుతాయి. అన్నీ సూసైడ్ లాగా కనిపిస్తాయి. కానీ ఎవరూ చూడలేదు, ఎలాంటి సాక్షాలు లేవు.
Read Also : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే
ఇన్వెస్టిగేషన్ సాగుతుండగా పాత రెజీమ్ కరప్షన్, ల్యాండ్ మాఫియా, పాలిటికల్ కవరప్‌లు బయటపడతాయి. విక్టిమ్స్ అందరూ ఆ ప్రాజెక్ట్‌తో లింక్ ఉన్నవాళ్లు. కేస్ డీప్ అవుతుండగా సూపర్‌నాచురల్ ఎలిమెంట్స్ ఎంటర్ అవుతాయి. బిల్డింగ్స్‌లో వింత షేప్స్ కనిపిస్తాయి. ఫాత్మాకి దెయ్యాలు కనిపిస్తున్న ఫీలింగ్ వస్తుంది. పాత సీక్రెట్స్ బయట పెట్టడానికి ట్రై చేస్తారు. ఫైనల్‌లో ఒక షాకింగ్ రివీల్ వస్తుంది. దీంతో కిల్లర్ ఎవరో తెలిసిపోతుంది. ఈ రివీల్ ఏంటి ? కిల్లర్ ఎవరు ? ఎందుకు వాళ్ళను చంపారు ? అనే విషయాలను, ఈ ట్యూనీషియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.