Sridhar Babu: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో అవకాశాలు పుష్కలమని.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా-యూటా పారిశ్రామికవేత్తలను కోరారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్-యూటా ఎండీ, సీవోవో డేవిడ్ కార్లెబాగ్ నేతృత్వంలోని యూటా పారిశ్రామికవేత్తల బృందం సెక్రెటేరియట్‌లో మంత్రిని ప్రత్యేకంగా కలిసింది.
యూటా-తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాలపై ప్రధాన చర్చ
టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, లైఫ్ సైన్సెస్, ఏఐ ఆధారిత హెల్త్ కేర్, క్లీన్ ఎనర్జీ, ఎడ్యుకేషన్, స్కిల్స్ తదితర రంగాల్లో యూటా- తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రోల్ మోడల్- శ్రీధర్‌బాబు..
ఈ సందర్భంగా కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా గ్లోబల్ ఎకానమీకి సపోర్ట్ ఇచ్చేలా, లాంగ్-టర్మ్ వాల్యూ క్రియేషన్‌కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని మంత్రి శ్రీధర్‌బాబు వారికి తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తీసుకొచ్చిన సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఏయే రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం, పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Also Read: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..
తెలంగాణలో అవకాశాలు పుష్కలం- శ్రీధర్‌బాబు
అనంతరం టీ-హబ్, టీ- వర్క్స్, వీ హబ్‌లను వరల్డ్ ట్రేడ్ సెంటర్-యూటా, సిలికాన్ స్లోప్స్ అండ్ యూటా టెక్ స్టార్టప్‌లతో అనుసంధానించేలా చొరవ చూపాలని ప్రతినిధి బృందాన్ని కోరారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌లో యూనివర్సిటీ ఆఫ్ యూటా, బీవైయూ, న్యూమాంట్ యూనివర్సిటీలతో కలిసి రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థలు ఉమ్మడి అకడమిక్, రీసెర్చ్ ప్రోగ్రామ్ లను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ద్వైపాక్షిక సహకారం పెట్టుబడులకే పరిమితం కాకుండా ఇన్నోవేషన్, స్కిల్స్, టెక్నాలజీ రంగాల్లో ఉమ్మడి ఆవిష్కరణలకు దిక్సూచిగా మారాలని మంత్రి ఆకాంక్షించారు.
యూటా పారిశ్రామికవేత్తల బృందంతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
యూటా-తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాలపై ప్రధాన చర్చ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలుస్తుందన్న మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడి pic.twitter.com/LmI5pD4eln
— BIG TV Breaking News (@bigtvtelugu) November 8, 2025