Gundeninda GudiGantalu Today episode November 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యం ప్రభావతి ఇద్దరూ సుశీల కోసం బయట ఎదురు చూస్తూ ఉంటారు.. ఇంటిదాకా వచ్చింది ఇంట్లోకి రాకుండా పోతుందా ఏంటి అని ప్రభావతి అంటుంది.. అందరూ కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి సంతోషంగా ఉంటారు.. మీనా హారతి తీసుకొని వస్తుంటే.. ఏంటి నువ్వు మంచి దానివి అని మార్కులు కొట్టేయాలని చూస్తున్నావా ఆ హారతి రోహిణి శృతి ఇస్తారు అని అంటుంది.. హారతి వాళ్ళకి ఇచ్చి తీయమని చెప్తుంది..
మీనా అక్కడే ఉంది కదా ముగ్గురు కలిసి తీస్తారని సుశీల అంటుంది. లోపల సుశీలమ్మ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినవి చూసి ఆమె చాలా సంతోషంగా మురిసిపోతుంది. ప్రభావతి మాత్రం ఇదంతా మీ కోసం నేనే దగ్గర నుండి చేయించాను అత్తయ్య గారు అని అంటుంది. బాలు ఏంటి నీ మొహం ఎప్పుడైనా ఇలాంటివి చేసిందా అని సెటైర్లు వేస్తాడు.. నాకు తెలుసు రా మీరందరూ నా కోసం ఇలాంటి ఏర్పాట్లు చేస్తారని, మీరు నాకు ఇష్టమైన గిఫ్ట్ ఇస్తే మీకు నేను గిఫ్ట్ ఇస్తానని సుశీల అంటుంది. ఆ గిఫ్ట్ ను ఎలాగైనా కొట్టేయ్యాలని అందరు అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంక ప్రభావతి అత్తయ్య ఇలాంటి గిఫ్ట్ ఇస్తుందో ఏదైనా ఆకలిస్తుందేమో డబ్బులు ఇస్తుందేమో అని ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమెకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆ గిఫ్ట్ నేనే కొట్టేయాలి అని ప్రభావతి ఆలోచిస్తుంది.. అప్పుడు అక్కడికి వచ్చిన సత్యం ఏంటి అంతగా ఆలోచిస్తున్నావని ప్రభావతి అని అడుగుతాడు. అయితే అత్తయ్య గారికి నేను ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ నేనే కొట్టేయాలి అని ప్రభావతి అంటుంది.. అటు మనోజ్, రోహిణి కూడా ఆ గిఫ్ట్ ను కొట్టేయ్యాలని ప్లాన్ వేస్తారు. మరోవైపు శృతి, రవి కూడా గిఫ్ట్ కోసం ప్లాన్ చేస్తారు.
బాలు కూడా బామ్మ కి ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. నేను దగ్గరికి వెళ్లిన బాలు మీనా నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను నేను బయటికి వెళ్లిపోతాను అని అంటాడు. ఏమైందండీ ఇప్పుడు ఎవరేమన్నారు అని అడుగుతుంది.. ఎవరు ఏదో అన్నారని కాదు.. ఇక్కడే ఉంటే బంగారం గురించి నా మనసు రగిలిపోతుంది ఖచ్చితంగా నేను దీన్ని బయట పెట్టేస్తాను అని బాలు అంటాడు.. మీరు కాస్త ఓర్పుగా ఉండండి బామ్మ గారిని సంతోష పెట్టడమే మన బాధ్యత. ఈ వయసులో ఆమె బాధపడటం అవసరమా అని మీనా అంటుంది.. మీరు బామ్మ గారికి ఏం గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు అని నేను అంటుంది. నేను ఆమెకి మంచి చేయించేద్దామని అనుకున్నాను కానీ ఇలా జరగడంతో నా మనసేం బాగోలేదు అని బాలు అంటాడు.
అయితే బామ్మ ని చిన్నప్పుడు నుంచి చూసింది మీరే కదా ఆమెకు ఏదంటే ఇష్టం మీకు బాగా తెలుసు కదా అని నేను అంటుంది. మా అమ్మ నన్ను దగ్గరికి రానివ్వకుంటే మా బావ అమ్మ నాన్న పెంచింది. నాకు ఏ లోటు లేకుండా చూసుకుంది. ఆమె మనసుకు నచ్చిన గిఫ్ట్ ఏంటా అని ఆలోచిస్తున్నా.. ఏదో ఒకటి కొందాంలే అది కచ్చితంగా భామకు నచ్చుతుంది అని బాలు అంటాడు. సరే నేను బయటికి వెళ్లి వస్తాను అని అనగానే.. ఆగండి వచ్చినప్పటి నుంచి వెళ్తాను వెళ్తాను అంటున్నారు అని మీనా అడుగుతుంది. ఇక్కడే ఉంటే నాకు కోపం తగ్గట్లేదు అందుకే అలా బయటికి వెళ్లి మళ్లీ వస్తాను అని బాలు అంటాడు.
Also Read :కెమెరా బాయ్ టు యాక్టర్.. అనిల్ జీవితంలో కష్టాలు.. ఫస్ట్ రెమ్యూనరేషన్..?
బయట కూర్చుని ఉన్న సత్యం సుశీల ఎక్కడికి రా వెళ్తున్నావు అని అడుగుతారు. ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి మీరందరూ ఇక్కడే ఉంటారని అందరం కలిసి ఉండాలని అనుకున్నాం కదా మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ అనే అడుగుతుంది. ఇంట్లో ఉంటే నాకు భయంగా ఉంది ఎక్కడ ఏ గొడవ పెట్టుకుంటాను అని ట్రిప్ వచ్చింది వెళ్లేసి వస్తాను అని బాలు అంటాడు. వెళ్లాల్సిందే నాకు కచ్చితంగా అని సుశీల అంటుంది. ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను సరేనా అని బాలు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..