ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. రాహుల్ డల్లుగా ఉంటే రాజ్ వచ్చి ఓదారుస్తాడు. నిన్న జరిగింది గుర్తు చేసుకుని బాధపడుతున్నావా..? అంతా మర్చిపోయి హ్యాపీగా ఉండు అని చెప్తాడు. అయనా రాహుల్ డల్లుగానే ఉంటాడు. అందరూ తలో మాట అంటుంటారు. ఇంతలో పోలీసులు వస్తారు.. వాళ్లను చూసిన రాజ్ అదేంటి మన ఇంటికి పోలీసులు వస్తున్నారు అంటాడు. అందరూ పోలీసులను చూసి షాక్ అవుతారు. ఇంతలో సుభాష్ ఏంటి ఎస్సై గారు ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు. రాజ్ కూడా ఏంటి ఎస్సై గారు ఎవరి కోసం ఇక్కడికి వచ్చారు అని అడగ్గానే.. ఎస్సై ఇక్కడ రాహుల్ ఎవరు అని అడుగుతాడు. దీంతో రాహుల్ షాక్ అవుతాడు. వీడు మళ్లీ ఏం చేసి చచ్చాడు వీడి గురించి అడుగుతున్నారేంటి..? అని రుద్రాణి మనసులో అనుకుంటుంది.
ఇంతలో రాహుల్ లేచి నేనే రాహుల్ సార్.. ఏమైంది అని అడగ్గానే.. కానిస్టేబుల్ అరెస్ట్ హిమ్ అని ఎస్సై చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు. ఏంటి ఎస్సై గార మా వాడు ఏం చేశాడని అరెస్ట్ చేస్తున్నారు..? అని అడగ్గానే.. అతను మర్డర్ చేశాడు అని ఎస్సై చెప్పగానే.. అందరూ మరింత షాక్ అవుతారు.. ఏం మాట్లాడుతున్నారు ఎస్సై గారు అని రాజ్ అడగ్గానే.. రాహుల్ అనే ఈ వ్యక్తి కొట్టడం వల్లే కూయిలీ అనే అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిని రాహుల్ చంపాడని ఆ అమ్మాయి భర్త కేసు పెట్టాడు అని చెప్పగానే.. రాజ్ అడ్డు పడతాడు.. ఎస్సై గారు మా వాడు మర్డర్ చేసేంత దుర్మార్గుడు కాదు.. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని చెప్తుంటే.. అది మేము చూసుకుంటాము.. నీకు కూయిలీ అనే అమ్మాయికి పరిచయం ఉందా..? ఆ అమ్మాయిని నువ్వు నిన్న కొట్టావా..? అని ఎస్సై అడగ్గానే.. కొట్ట లేదు సార్ జస్ట్ తోశాశాను ఆ మాత్రం దానికే చనిపోతుందా..? అని రాహుల్ చెప్పగానే.. అదంతా కోర్టులో చెప్పుకో.. కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి.. అంటాడు ఎస్సై..రుద్రాణి అడ్డు పడి సార్ వాడు అమాయకుడు ఏ తప్పు చేయలేదు సార్.. వాడిని వదిలేయండి అని చెప్పగానే.. అతను ఏ తప్పు చేయకపోతే జడ్జి గారే వదిలేస్తారు అని రాహుల్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు.
తర్వాత స్వప్న బాధపడుతుంటే రాజ్, కావ్య వెళ్లి ఓదారుస్తారు. అక్కా రాహుల్ కు ఏమీ కాదు నువ్వేం బాధపడకు అని కావ్య చెప్పగానే.. పోలీసులు రాహుల్‌ను తీసుకెళ్లినందుకు నేను బాధపడటం లేదు కావ్య.. నేను మళ్లీ ఇంకొకసారి మోసపోయానేంటి అని బాధపడుతున్నాను.. అంటుంది. దీంతో స్వప్న నువ్వు మోసపోయానని ఎందుకు అనుకుంటున్నావు.. అక్కడ ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు కదా అంటాడు రాజ్. కానీ పోలీసులు సరాసరి రాహుల్ ను వెతుక్కుంటూ వచ్చారంటే ఏమనుకోవాలి. మీరు రాహుల్‌ను మార్చాలి అనుకున్నారు. రాహుల్ మారకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఎప్పటికీ తనన మార్చడం సాధ్యం కాదు అందుకే నేను నమ్మను అన్నాను.. మీరే ఒక్క అవకాశం ఇవ్వమన్నారు.. అంటూ స్వప్న ఏడుస్తుంది.
దీంతో కావ్య లేదు అక్కా నువ్వు అనుకున్నది నిజం కాదనిపిస్తుంది. నాకు ఎందుకో అనుమానంగా ఉంది. రాహుల్ డబ్బు మీద ఆశ ఉన్నవాడే అందని దానికి నిచ్చెన వేసే వాడే కానీ ఒక మనిషిని చంపేంత ధైర్యం రాహుల్‌కు ఉందని నేను అనుకోవడం లేదు అక్క అని కావ్య చెప్పగానే.. అవును స్వప్న వాడు మూర్ఖుడే కావచ్చు కానీ హత్య చేసేంత దుర్మార్గుడు కాదు అని రాజ్ చెప్పగానే.. కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా..? నమ్మకుండా ఎలా ఉండగలం చెప్పు.. అంటూ ప్రశ్నిస్తుంది స్వప్న.. దీంతో కళ్లకు కనిపించినవన్నీ నిజాలు కాదు.. కనిపించనివి అబద్దాలు కాదు.. వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దానికి తొందరపడకుండా అర్థం చేసుకో అని రాజ్ చెప్పగానే.. స్వప్న ఆలోచిస్తుంది.
తర్వాత రంజిత్, రుద్రాణికి ఫోన్ చేసి రాహుల్, కూయిలీని కొట్టిన వీడియో తన దగ్గర ఉందని రెండు కోట్లు ఇస్తే.. వీడియో డిలీట్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. దీంతో రుద్రాణి ఆలోచిస్తుంది. రంజిత్ కాల్ కట్ చేస్తాడు. వెంటనే కిందకు వచ్చి రంజిత్ ఫోన్ చేసిన విషయం అందరికీ చెప్తుంది. వాడు రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నాడని చెప్తుంది. దీంతో రాజ్, కావ్య తాము రాహుల్‌ను కాపాడి తీసుకొస్తామని చెప్తారు. దీంతో మీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయని కాపాడతారు.. మీరందరూ నా కొడుక్కి శిక్ష పడాలని చూస్తున్నారు.. నేను వెంటనే వెళ్లి రంజిత్ దగ్గరకు వెళ్లి డీల్ మాట్లాడతానని వెళ్లిపోతుంది.
స్వప్నను రుద్రాణి వెంట వెళ్లి ఏం చేస్తుందో తమకు ఇన్మఫర్మేషన్ ఇవ్వమని చెప్తాడు రాజ్. సరే అంటూ స్వప్న వెళ్లిపోతుంది. అసలు మీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయని రాహుల్ ను కాపాడతారు అని సుభాష్ అడగ్గానే.. మేము మొన్న ఆ ఇంటికి వెళ్లినప్పుడే ఆ ఇంట్లో సీక్రెట్ కెమెరా పెట్టింది కావ్య. అని రాజ్ చెప్పగానే.. అందరూ హ్యాపీగా ఫీలవుతారు.. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు త్వరగా వెళ్లి ఆ కెమెరాలో ఏం రికార్డు అయిందో చూడండి అని సుభాష్ చెప్పగానే.. రాజ్, కావ్య వెళ్లిపోతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.