Intinti Ramayanam Today Episode November 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని వాళ్ల అమ్మ ఎవరు అని తెలుసుకోవాలని లోపలికి వెళ్లి ఆ పల్లవి చూస్తుంది. మా అమ్మ లేదు అని అన్నావు కదా ఈవిడే మా అమ్మ అని అవని పరిచయం చేస్తుంది. ఇన్ని రోజులు అవనికి అమ్మానాన్న లేరు అని అవమానించావు ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చారని అక్షయ్ అంటాడు. పల్లవి మీ అమ్మ వచ్చింది సరే నాన్న కూడా ఉండాలి కదా ఎక్కడ అని అడుగుతుంది. మీ నాన్న ఎక్కడున్నాడు ఆయన ఏం చేస్తాడు ఇవన్నీ తెలుసుకోవాలి కదా అని పల్లవి అడుగుతుంది.
అమ్మ నాన్న ఇద్దరూ ఉంటేనే కదా నువ్వు వచ్చేది అని దారుణంగా మాట్లాడుతుంది పల్లవి. ఇప్పుడు ఆ విషయాల గురించి నేను చెప్పలేను అమ్మ అని మీనాక్షి అంటున్నా సరే పల్లవి మాత్రం గుచ్చి గుచ్చి ఇబ్బంది పెడుతుంది. నువ్వేం పట్టించుకోవద్దు అమ్మా అని మీనాక్షితో అవని అంటుంది. ఆ తర్వాత మీనాక్షిని లోపలికి తీసుకోని వెళ్ళమని ఆరాధ్యకు చెప్తుంది.. తర్వాత రోజు పల్లవి నాన్న చక్రధర్ అని తెలుసుకొని షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి వాళ్ల నాన్న చక్రధర్ అని చెప్పింది కదా.. నా భర్త చక్రధర్ ఇద్దరు ఒక్కటేనా అని ఆలోచిస్తూ ఉంటుంది. వాడే వీడైతే ఎలా అని మీనాక్షి ఆలోచిస్తూ ఉండగా అవని లోపలికి వస్తుంది. ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నావు అని మీనాక్షిని అడుగుతుంది. పల్లవి వాళ్ళ నాన్న పేరు చక్రధర్ అని అన్నారు ఆయన బిజినెస్ మాన్ అవునా అని అడుగుతుంది. పేరుకే మంచి బిజినెస్ మాన్ మూర్ఖుడు. చాలా కోపిస్తే ఆయన ఏమనుకుంటే అది చేయాలని అనుకుంటారు. నీకు ఆయన ఫోటో చూపిస్తాను అని చక్రధర ఫోటోని అవని చూపిస్తుంది. అతని ఫోటో చూడగానే భయంతో మీనాక్షి కళ్ళు తిరిగి పడిపోతుంది..
అమ్మ ఏమైంది అమ్మ అని టెన్షన్ పడుతూ ఉంటుంది అవని.. ఇంట్లోనే వాళ్ళందరూ కూడా మీనాక్షికి ఏదో అయిపోయిందని కంగారుపడుతూ ఉంటారు. ఎంతగా లేపినా సరే మీనాక్షి లేకపోవడంతో టెన్షన్ పడి అవని హాస్పిటల్ తీసుకెళ్తాను అని అంటుంది.. అయితే మీనాక్షిని హాస్పిటల్ తీసుకెళ్దాం మేము కూడా వస్తామని పార్వతి అంటుంది.. మీరేం వద్దు అత్తయ్య నేను తీసుకుని వెళ్తాను. ఒకవేళ ఏదైనా సీరియస్ గా అనిపిస్తే మీకు కాల్ చేస్తాను అప్పుడు వద్దురులేండి అని అంటుంది.
అవనే తన తల్లిని హాస్పిటల్కి తీసుకొని వెళుతుంది. అక్కడ డాక్టర్ని కన్సల్టయ్యి తన తల్లి పరిస్థితి ఎలా ఉందని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏదో విషయం గురించి బాగా టెన్షన్ పడుతుందండి అందుకే ఆమె స్పృహ కోల్పోయింది నేను ఇంజక్షన్ చేస్తాను కాసేపట్లో స్పృహలోకి వస్తుందని డాక్టర్ చెప్తారు. రాజేంద్రప్రసాద్ ఫోన్ చేస్తాడు.. అమ్మ అవని మీ అమ్మకు ఎలా ఉంది అమ్మ ఇప్పుడు అని అడుగుతాడు.. పార్వతీ కూడా ఈ విషయాన్ని అడుగుతుంది.. ఇప్పుడేం పర్లేదు కదా అంటే పర్లేదు అత్తయ్య కాసేపట్లో స్పృహలోకి వస్తుంది నేను తీసుకుని వస్తాను అని అవని అంటుంది.
మీనాక్షి, అవని హాస్పిటల్లో ఉండడం చక్రధర్ మనిషి చూస్తాడు. ఈ విషయాన్ని వెంటనే చక్రధర్ కి చెప్పేస్తాడు.. ఏ హాస్పిటల్లో ఉన్నారా చెప్పురా నేను వస్తాను ఈరోజు మీనాక్షి పని అయిపోతుంది అని అతనితో అంటాడు అతను డీటెయిల్స్ చెప్పగానే చక్కగా అక్కడికి వస్తాడు.. స్పృహలోకొచ్చిన మీనాక్షిని చూసి అవని సంతోషపడుతుంది. ఏంటమ్మా నువ్వు ఇలా పడిపోయావు నేను వెళ్లి బిల్లు కట్టేసి వస్తాను వెళ్ళిపోదామని అంటుంది.
ఇంటికి వచ్చిన కమల్ ఇవాళ నేను ఐదు బుకింగ్ లో చేశాను 7000 వచ్చాయి.. అని అనగానే రాజేంద్రప్రసాద్ పార్వతి ఇద్దరు కూడా అవనీ వదిన వాళ్ళ అమ్మకి బాగాలేదురా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిందని అంటారు. వదిన ఒక్కటే తీసుకెళ్ళింది ఇంట్లో ఎవరూ లేరా.. ఎవరో కొన్ని తోడుగా పంపించొచ్చు కదా అని కమల్ సీరియస్ అవుతాడు.. ఇంట్లో ఎవరూ లేరు అందుకే వదిన ఒక్కటే తీసుకెళ్ళింది అని అంటుంది పార్వతి. అక్షయ్ రాగానే అందరూ కూడా అవని ఒకటే తీసుకెళ్లింది అని అంటారు.
Also Read : గిఫ్ట్ కొట్టేసేందుకు ప్రభావతి ప్లాన్..బాలుకు మీనా క్లాస్.. సుశీల కోసం మనోజ్ గిఫ్ట్..
శ్రియ పల్లవిలు అవనిని తిడుతూ ఉంటే అక్షయ్ అందరికీ క్లాస్ పీకుతాడు.. ఏం తెలుసు అని గురించి మాట్లాడుతున్నారు ఏదో అనుమానం ఉండడం వల్లే మీరు ఇలా మారిపోయారు అని అంటాడు. నా భార్య గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే నేను మర్యాద కూడా ఇవ్వను అని అక్షయ్ అందరికీ వార్నింగ్ ఇస్తాడు. అవని కి ఫోన్ చేస్తే అవని లేదంటే నేను వచ్చేస్తున్నాను అని అంటుంది. మీనాక్షి చూస్తున్న చక్రధర్ ఆమెను చంపేందుకు ప్రయత్నం చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..