E-Paper
Advertisement

Isnapur Municipality: ఇస్నాపూర్‌లో కౌన్సిలర్ అభ్యర్థి వినూత్న ప్రచారం.. ఇలా కూడా చేస్తారా..!

Isnapur Municipality: ఇస్నాపూర్‌లో కౌన్సిలర్ అభ్యర్థి వినూత్న ప్రచారం.. ఇలా కూడా చేస్తారా..!
Advertisement

Isnapur Municipality: స్వేఛ్చ బ్యూరో: సామాన్యంగా ఎన్నికలు వచ్చాయంటే అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి “నన్ను గెలిపించండి.. మీ కష్టాలు తీరుస్తాను.. మీ వార్డును క్లీన్ చేస్తాను” అని హామీల వర్షం కురిపిస్తారు. కానీ, ఇస్నాపూర్ మున్సిపాలిటీ 13వ వార్డులో మాత్రం సీన్ రివర్స్‌లో ఉంది. గెలిచిన తర్వాత చూద్దాం అనే ధోరణి కాకుండా, “ముందు పని చేసి చూపిస్తా.. ఆ తర్వాతే ఓటు అడుగుతా” అంటూ కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మి, నరసింహారెడ్డి వినూత్నంగా దూసుకుపోతున్నారు.

సమస్య కనిపిస్తే చాలు.. రంగంలోకి!

ప్రచారంలో భాగంగా లక్ష్మి, నరసింహారెడ్డి కాలనీల్లో పర్యటిస్తున్నప్పుడు, ప్రజలు తమ వార్డులోని డ్రైనేజీ సమస్యలు, పేరుకుపోయిన చెత్త గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సాధారణంగా ఎవరైనా “నేను గెలవగానే ఇవన్నీ క్లీన్ చేయిస్తా” అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ నరసింహారెడ్డి మాత్రం అక్కడికక్కడే స్పందిస్తూ, మున్సిపల్ సిబ్బందిని పిలిపించి వార్డులో పేరుకుపోయిన చెత్తను, మురికిని శుభ్రం చేయిస్తున్నారు. ప్రచారంలో ఉండగానే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో స్థానిక కాలనీవాసులు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Also Read: Vishwambhara: విశ్వంభర రిలీజ్ డేట్ పై ప్రొడ్యూసర్ క్లారిటీ..అందుకే ఆలస్యమైందా?

మాటలు కావు.. పనులు ముఖ్యం

“చాలామంది ఓట్ల కోసం వస్తారు, కానీ ఈయన మాత్రం సమస్యను చూడగానే పరిష్కరిస్తున్నారు” అని కాలనీవాసులు కొనియాడుతున్నారు. నిజమైన నాయకత్వం: పదవి రాకముందే బాధ్యతగా మెలుగుతున్నలక్ష్మి, నరసింహారెడ్డి తీరుపై సోషల్ మీడియాలోనూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వార్డులో హాట్ టాపిక్‌గా మారిన ‘క్లీన్’ ప్రచారం

Advertisement

కేవలం మైకులు పట్టుకుని ఊదరగొట్టడం కంటే, ఇలా ప్రత్యక్షంగా కాలనీల రూపురేఖలు మార్చడం ఓటర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. పారిశుధ్యంపై ఆయన చూపిస్తున్న చొరవతో 13వ వార్డులో లక్ష్మి,నరసింహారెడ్డి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రాజకీయ నాయకులంటే కేవలం ఎన్నికల వేళ కనిపించేవారు కాదని, నిరంతరం ప్రజల మధ్య ఉండి పనిచేసేవారే నిజమైన నాయకులని లక్ష్మి, నరసింహారెడ్డి నిరూపిస్తున్నారు. ఈ వినూత్న ప్రచారం రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.

Also Read: Vishwambhara: విశ్వంభర రిలీజ్ డేట్ పై ప్రొడ్యూసర్ క్లారిటీ..అందుకే ఆలస్యమైందా?

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×