BigTV English

Jaggareddy: సీఎంను గెలకడం ఎందుకు? తిరిగి తన్నించుకోవడమెందుకు కేటీఆర్.. ఇక మారవా: జగ్గారెడ్డి

Jaggareddy: సీఎంను గెలకడం ఎందుకు? తిరిగి తన్నించుకోవడమెందుకు కేటీఆర్.. ఇక మారవా: జగ్గారెడ్డి

Jaggareddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించే స్థాయి కేటీఆర్ కు ఏమాత్రం లేదని ఫైరయ్యారు. కేటీఆర్ ఒక్క బూతు మాట మాట్లాడితే.. సీఎం పది తిట్లు తిడతారని మండిపడ్డారు. సీఎంను గెలకడం ఎందుకు..? తన్నిపిచ్చుకోవడం ఎందుకు అని జగ్గారెడ్డి నిలదీశారు.


‘కేసీఆర్ సీటిస్తే కేటీఆర్ డైరెక్ట్ ఎమ్మెల్యే అయ్యాడు. మేమంతా ఎన్నో వ్యయ ప్రయాసలతో రాజకీయ నేతలయ్యాం. అనుభవంతో కూడుకున్న రాజకీయం మాది. మాకున్న అనుభవాల ముందు కేటీఆర్ గుండు సున్నా. మీరు మాట్లాడేదాన్ని బట్టే మా స్పందన ఉంటుంది.. సీఎంను గోకుడు ఎందుకు..? తన్నిపిచ్చుకోవడం ఎందుకు..? ఐదేళ్లు పాలించాలని ప్రజలకు మాకు అవకాశం ఇచ్చారు.. కేటీఆర్ నోరు విప్పితే అబద్దాలే.. కేటీఆర్ విదేశీ పర్యటనల్లో ఏం చేస్తున్నారు..? కేటీఆర్ కు డక్కాముక్కీలు ఎలా తెలుస్తాయి.. కేటీఆర్ సర్పంచ్ గా గెలిచాడా.. జడ్పీటీసీగా గెలిచాడా ’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం పరిపాలన పరంగా రివ్యూలు చేస్తున్నారు. ఉదయం 10 నుండి రాత్రి 12 వరకు ఉన్నతాధికారులతో రెగ్యులర్ రివ్యూస్ నిర్వహిస్తున్నారు. ఇల్లు, క్యాంప్ ఆఫీస్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ నుండి నిరంతరం సీఎం రివ్వ్యూ చేస్తున్నారు. కేటీఆర్ ఈ మధ్య హైదరాబాద్ లో ఉండటం లేదు. నెలలో 10 రోజులు మాత్రమే హైదరాబాద్ కు వస్తున్నారు. నెలకోసారి విదేశాల్లో కేటీఆర్ ఉంటున్నారు. హైదరాబాద్ వచ్చిన టైం లో ఏదో డ్రామా చేసి వార్తల్లో ఉండాలని తపన పడుతున్నారు. విదేశాల్లో కేటీఆర్ ఉన్నప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది అవగాహన లేక కేటీఆర్ మాట్లాతున్నారు’ అని జగ్గారెడ్డి ఫైరయ్యారు.


సీఎం ఢిల్లీ పోయారు.. కనపడడం లేదు అని కేటీఆర్ అంటున్నాడు. నిధుల కోసం సీఎం ఢిల్లీ పోవాల్సిందే. పదేళ్లు అధికారంలో ఉన్నారు అవగాహన లేదా..? కేంద్రంలో ప్రధాని, కేంద్ర మంత్రులను నిధుల కోసం.. నీళ్ల పంచాయితీ కోసం పరిపాలన కోసం పోవాల్సి వస్తుంది.. ఆ మాత్రం సోయి లేదా.. మీరేమో లిక్కర్ దందా కోసం ఢిల్లీ పోయిర్రు. ప్రధాన మంత్రి, మంత్రుల వద్దకు పోవడం కంటే ED ఆఫీస్ కే ఎక్కువ పోయిర్రు. కాంగ్రెస్ పార్టీ పుట్టినిల్లు ఢిల్లీ కాబట్టి మా సీఎం, మేము పోతాం. బీఅరెస్ లాగా గల్లీ పార్టీ కాదు మాది. ప్రజల నాడీ, ప్రజల సమస్యలు తెలియకుండానే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారు. మా అనుభవం ముందు జీరో నథింగ్ నువ్వు. ఎలాంటి ఒడిదొడుకులు లేకుండానే కేసీఆర్ పుణ్యం గా ఎమ్మెల్యే అయ్యావ్’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

ALSO READ: AP Govt: ఏపీ సర్కార్ వినూత్న ఆలోచన.. ఏఐతో దోమలకు చెక్.. అదెలా అంటే?

తిట్ల పురాణం కుటుంబం మీది. మీరు మంచిగా మాట్లాడితే.. మేము మంచిగా మాట్లాడతాం. మీరు ఎమ్ రా అంటే మేము ఏంది భే అంటాం. బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది అని మీరే ఒప్పుకున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు కాంగ్రెస్ బయపడుతుందని.. కేసీఆర్ అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. నేను రివెంజ్ తీసుకోవాలని అనుకుంటే హరీష్ రావు హైదరాబాద్‌లో తిరగలేడు. కానీ నేను రివెంజ్ పాలిటిక్స్ చేయను. పాస్ పోర్ట్ కేసులో నన్ను అరెస్ట్ చేశారు. అదే కేసులో హరీష్, కేసీఆర్ ఉన్నారు. నేను కావాలి అనుకుంటే సీఏం దగ్గరికి వెళ్లి వీళ్ళని లోపల వేయాలి అంటే వెయ్యరా..? కానీ మేము అలా చేయం. అది మా తత్వం కాదు’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×