BigTV English

Upasana: బాధ్యత కోసం పెళ్లి వద్దు..మీ రాముడి కోసం వేచి చూడండి.. సలహా ఇచ్చిన ఉపాసన!

Upasana: బాధ్యత కోసం పెళ్లి వద్దు..మీ రాముడి కోసం వేచి చూడండి.. సలహా ఇచ్చిన ఉపాసన!

Upasana: ఉపాసన (Upasana)కామినేని కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. రామ్ చరణ్ (Ram Charan)భార్యగా, మెగా ఇంటికోడలుగా, అపోలో హాస్పిటల్ సీఈఓగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన నిత్యం మహిళలను ప్రోత్సహిస్తూ మహిళా సాధికారత కోసం ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఉపాసన ఎన్నో అద్భుతమైన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా మహిళల వివాహం గురించి ఉపాసన చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. సాధారణంగా అమ్మాయిలకు పెళ్లి చేసేస్తే ఒక బాధ్యత తీరిపోతుందని తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఇలా బాధ్యత తీరడం కోసం పెళ్లి చేసుకోవద్దని తెలిపారు.


మీ రాముడి కోసం ఎదురుచూడండి..

మహిళలకు సరైన గౌరవ, మర్యాదలు ఇచ్చే వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకోవాలని అప్పటివరకు మీ రాముడి కోసం ఎదురుచూడండి అంటూ ఉపాసన మహిళలకు పెళ్లి గురించి సలహాలు ఇచ్చారు. తాను ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయని ఒప్పుకున్న ఉపాసన ఇప్పటికీ కూడా పట్టణ ప్రాంతాలలో ఎంతో మంది ఈ వివాహపు ఉచ్చులో పడిపోతున్నారని తెలిపారు. మహిళలు ఇటీవల కాలంలో పురుషుల కంటే కూడా బాగా సంపాదిస్తున్నారు. వారికంటూ కొన్ని నియమ నిబంధనలను పెట్టుకొని పిల్లల్ని కూడా పెంచుతున్నారు.


డబ్బు.. హోదా కోసం పెళ్లి వద్దు..

ఒక మహిళకు పురుషుడి అవసరం గురించి కాకుండా,మిమ్మల్ని గౌరవించే, మిమ్మల్ని సమానంగా చూసే భాగస్వామిని ఎంపిక చేసుకోవాలని తెలియజేశారు. ఇకపై స్త్రీలు డబ్బు కోసం లేదా హోదా కోసమో పెళ్లి చేసుకోవద్దు. సరైన జీవిత భాగస్వామి దొరికినప్పుడు డబ్బు, హోదాని మనమే నిర్మించుకోవచ్చని తెలిపారు. స్త్రీలను బలవంతంగా పెళ్లిళ్లకు ఒప్పించకుండా వారి ఎంపికకు, అలాగే జీవితంలో అభివృద్ధి చెందడానికి సాధనాలను అలాగే స్వేచ్ఛను ఇద్దాం. ఒక అమ్మాయి తనకు సరైన జీవిత భాగస్వామి ఇతనే అంటూ తన రాముడిని కనుగొనే వరకు పెళ్లి చేసుకోవలసిన అవసరం లేదంటూ ఈ సందర్భంగా స్త్రీ వివాహం గురించి తెలియజేశారు.

ఇలా స్త్రీ సమానత్వం కోరుకునే ఉపాసన సమాజంలో పెళ్లి తర్వాత మహిళలకు కూడా  పురుషుల నుంచి సమాన గౌరవం ప్రేమ లభించినప్పుడే పెళ్లిళ్లు చేసుకోవాలని అలాంటి వ్యక్తి దొరికే వరకు పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు అంటూ చెప్పుకు వచ్చారు.  ఉపాసన ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉండటం వల్లే రామ్ చరణ్ తో తన వైవాహిక జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా సాగిపోతుందని చెప్పాలి. రామ్ చరణ్ నిజంగానే ఉపాసనకు రాముడు(Ramudu) లాంటి వ్యక్తి అంటూ మెగా అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ 2012 వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఇలా వివాహ తర్వాత ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ముందుకు సాగుతున్నారు. ఇటీవల ఈ దంపతులు క్లిన్ కారా(Klin Kaara) అనే చిన్నారికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Also Read: Shruti Hassan: నిశ్శబ్దం.. ప్రేమలో కలుద్దాం.. వాటికి గుడ్ బై చెప్పిన శృతిహాసన్

Related News

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Kishkindhapuri: ఆ టార్చర్ నుండి బయటపడేసిన కౌశిక్.. నో ముఖేష్ నో స్మోకింగ్..!

Madharaasi Collections : తెలుగు రాష్ట్రాల్లో షాకిచ్చిన ‘మదరాసి’.. ఇలా అయితే కష్టమే..!

Sukumar: పుష్ప 3 ర్యాంపేజ్.. సైమా అవార్డ్స్ స్టేజ్‌పై ఊహించని అప్డేట్ ఇచ్చిన సుక్కు

Sandeep Reddy Vanga: దానికి మించిన ఇంటర్వెల్ సీన్ ఇంకేదీ లేదు

Little hearts Collections : లిటిల్ హార్ట్స్‌కు బిగ్ షాక్… పాజిటివ్ టాక్ వచ్చినా తక్కువ కలెక్షన్లే

Big Stories

×