E-Paper
Advertisement

డ్యూటీలో ఉండి ఆ సీన్లు.. కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన ఏఎస్ఐ

డ్యూటీలో ఉండి ఆ సీన్లు.. కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన ఏఎస్ఐ
Advertisement

Jagtial Police: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక పోలీసు అధికారి చేసిన నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజల సమస్యలను వినడానికి ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) తన విధులను పక్కనపెట్టి ఫోన్‌లో అశ్లీల చిత్రాలను చూస్తూ కెమెరాకు చిక్కారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. కలెక్టర్ సహా ఉన్నతాధికారులందరూ ప్రజల అర్జీలను స్వీకరిస్తూ బిజీగా ఉన్నారు. అయితే, భద్రతా విధుల కోసం అక్కడ ఉన్న ASI రహాఫ్ మాత్రం తన కుర్చీలో కూర్చుని, అందరూ చూస్తుండగానే తన మొబైల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలను వీక్షిస్తూ కనిపించారు. ఆయన వెనుక ఉన్నవారు ఈ దృశ్యాలను వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన అత్యంత పవిత్రమైన వేదికపై, బాధ్యతాయుతమైన పోలీస్ హోదాలో ఉండి ఇలాంటి పనులకు ఒడిగట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజావాణి వంటి ముఖ్యమైన మీటింగ్ జరుగుతుండగా ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూడటం క్రమశిక్షణారాహిత్యమని జిల్లా పోలీస్ బాస్ (SP) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు, సదరు ASI పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

ఈ ఘటనతో పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని తోటి అధికారులు భావిస్తున్నారు. డ్యూటీలోఉండ‌గా క్రమశిక్షణతో ఉండాల్సిన పోలీసులు ఇలాంటి పనులకు పాల్పడటంపై నెటిజ‌న్లు మండిపడుతున్నారు.

Advertisement

Read Also: Srikakulam: హైవేపై గాలిలో పల్టీలు కొట్టిన ఇన్నోవా.. కారులో ఓ కుటుంబం.. ఇదిగో వీడియో!

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×