E-Paper
Advertisement

మే 31 వరకు నో ఇజ్రాయెల్ ఫ్లైట్స్.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం!

మే 31 వరకు నో ఇజ్రాయెల్ ఫ్లైట్స్.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం!
Advertisement

Air India Cancels Israel Routes: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా, ఎయిర్ ఇండియా  కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా, న్యూఢిల్లీ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్లే విమాన సర్వీసులను మే 31 వరకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అమల్లో ఉంటుందని తెలిపింది.

ఇప్పటికే పలు విమానాలు రద్దు

ఇటీవల పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో, పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇప్పటికే టెల్ అవీవ్‌కు  సర్వీసులను నిలిపివేశాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్‌ కు చెందిన కొన్ని విమానయాన సంస్థలు మాత్రమే పరిమిత ఆంక్షల మధ్య తమ సేవలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇజ్రాయెల్ లోని భారతీయల ఆందోళన

Advertisement

ఎయిర్ ఇండియా తాజా నిర్ణయంతో ఇజ్రాయెల్‌ లో నివసిస్తున్న భారతీయులు ఆందోళన చెందుతున్నారు.  అక్కడ దాదాపు 40 వేల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల భారత్ కు రావాలనుకునే వారికి ఈ విమానాల రద్దు ఇబ్బందిగా మారనుంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో స్వదేశానికి తిరిగి రావాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి వస్తోంది.

ప్రస్తుతం ఇజ్రాయెల్ నుంచి బయటకు రావాలనుకునే భారతీయులు జోర్డాన్ లేదంటే ఈజిప్టు లాంటి పక్క దేశాల మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. అక్కడి నుంచి ఇతర దేశాలకు విమాన సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. ఈ రూట్ కొంత సమయం తీసుకున్నప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మార్గాలలో ఇదే కీలకమైనది.

భారత రాయబార కార్యాలయం కీలక నిర్ణయం

Advertisement

అటు ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, టెల్ అవీవ్‌ లోని భారత రాయబార కార్యాలయం కీలక చర్యలు చేపడుతోంది.  భారతీయులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. 24 గంటలు పని చేసే అత్యవసర హెల్ప్‌ లైన్‌ ను ప్రారంభించింది. ఎవరైనా సమస్యల్లో ఉంటే వెంటనే సంప్రదించేందుకు అవకాశం కల్పించింది. అదేవిధంగా, అక్కడి భారతీయుల వివరాలను సేకరించేందుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ డ్రైవ్ కూడా నిర్వహిస్తోంది. ఇటీవల రాయబారి, రాయబార కార్యాలయ బృందం వర్చువల్ సమావేశం నిర్వహించి, ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ కార్మికులు, విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు, ఆందోళనలు తెలుసుకుని, అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మాత్రమే కాకుండా, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు నిరంతరం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, అక్కడ ఉన్న భారతీయులు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు. అధికారిక సూచనలను పాటిస్తూ, అవసరమైతే రాయబార కార్యాలయాన్ని సంప్రదించడం మంచిదన్నారు.

Read Also: విమాన ప్రయాణికులకు షాక్.. 60% ఉచిత సీట్ల రూల్ కు బ్రేక్!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×