E-Paper
Advertisement

హైదరాబాద్‌‌లో ‘జేమ్స్ బాండ్ స్ట్రీట్’ ఉందా? ఇదిగో ఇక్కడ ఉందట, కానీ..

హైదరాబాద్‌‌లో ‘జేమ్స్ బాండ్ స్ట్రీట్’ ఉందా? ఇదిగో ఇక్కడ ఉందట, కానీ..
Advertisement

James Bond Street: దేశంలోని అత్యంత చారిత్రాత్మక నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇక్కడి కట్టడాలు, ప్రాంతాలు ఎన్నో విశిష్టతలను కలిగి ఉన్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ లోని ఓ విధి పేరు.. ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ చిత్రమైన.. జేమ్స్ బాండ్ ((James Bond Street) పేరుతో ఆ వీధి ఉండటమే ఇందుకు కారణం. ఇంతకీ ఆ వీధి నగరంలో ఎక్కడ ఉంది? ఆ పేరు వెనుక ఉన్న నిజానిజాలేంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.

మ్యాటర్ ఏంటంటే?

హైదరాబాద్‌లోని బేగంపేట (Begumpet) సమీపంలోని బి.ఎస్. మఖ్తా (B.S. Maktha) ఏరియాలో ఉన్న ఒక వీధికి గూగుల్ మ్యాప్స్‌లో ‘జేమ్స్ బాండ్ స్ట్రీట్’ అని పేరు కనిపిస్తోంది. సోమజిగూడకు అతి సమీపంలో ఉండే ఈ వీధి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మెుదలైంది. హైదరాబాద్ లో జేమ్స్ బాండ్ స్ట్రీట్ ఉందన్న విషయం ఇన్నాళ్లు తెలియలేదే అంటూ నగరవాసులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

కేవలం మ్యాప్‌లో మాత్రమే..!

Advertisement

సదరు వీధిని జేమ్స్ బాండ్ పేరుతో గూగుల్ మ్యాప్స్ చూపిస్తున్నప్పటికీ రియాలిటీలో అలాంటి బోర్డులు స్థానికంగా ఎక్కడా కనిపించడం లేదు. అక్కడ నివాసం ఉండే వారు సైతం.. తమ వీధికి ఈ పేరు ఉన్న విషయం తెలియదని అంటున్నారు. గూగుల్ మాత్రం అలా జేమ్స్ బాండ్ స్ట్రీట్ ఎందుకు చూపిస్తుందో అర్థం కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. తాము కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని.. ఎన్నడూ జేమ్స్ బాండ్ స్ట్రీట్ పేరుతో ఎలాంటి బోర్డును గానీ, అలాంటి ఆనవాళ్లను గానీ చూడలేదని స్పష్టం చేస్తున్నారు.

అధికారిక రికార్డుల్లోనూ అంతే..!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) రికార్డుల్లోనూ జేమ్స్ బాండ్ స్ట్రీట్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. అలాగే స్థానిక మున్సిపల్ జాబితాలో సైతం ఈ పేరు గురించి లేకపోవడం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ రికార్డుల్లో లేని పేరు.. గూగుల్ మ్యాప్స్ లో మాత్రం ఎలా వచ్చిందన్న అనుమానాలను స్థానికులతో పాటు నెటిజన్లు సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే గూగుల్ మ్యాప్స్ లో ఎవరైనా పేరును ఎడిట్ చేసి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. లేదంటే కొన్నేళ్ల క్రితం ఉన్న ఈ పేరు ఉండి.. అది డిజిటలైజ్ అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు.

Advertisement

Also Read: బుల్లి స్మార్ట్ స్క్రీన్.. వార్తలు, వీడియో కాల్స్, ఓటీటీలు.. క్రేజీ బెన్‌ఫిట్స్ భయ్యా!

జేమ్స్ బాండ్ పేరు ప్రత్యేకత..!

ఇదిలా ఉంటే జేమ్స్ బాండ్ చిత్రాలు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో పాపులర్ అయ్యాయి. సాధారణంగా జేమ్స్ బాండ్ అనగానే ‘007’ అన్న నెంబర్ సైతం ఠక్కున గుర్తుకు వస్తుంది. బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ (MI6) లో ఎవరికైనా ’00’ ప్రిఫిక్స్ ఉందంటే వారికి మిషన్ కోసం ఎవరినైనా చంపే అధికారం (License to Kill) ఉందని అర్థం. మరోవైపు జేమ్స్ బాండ్ పాత్ర ఎప్పుడూ అత్యంత ఖరీదైన సూట్లు, విలాసవంతమైన వాచీలు, అధునాతన కార్లను వాడుతూ ప్రేక్షకుల్లో చెరగని ముద్రను వేశాయి. ఒకే క్యారెక్టర్ పేరుతో 60 ఏళ్లపాటు సినిమాలు రావడం జేమ్స్ బాండ్ కు ఉన్న ప్రత్యేకతగా చెప్పవచ్చు.

Also Read: విజయ్ ర్యాలీలో బాంబు కలకలం.. సైకిల్ వదిలి నటుడు పరుగో పరుగు!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×