E-Paper
Advertisement

కల్వకుంట్ల కవిత సరికొత్త పొలిటికల్ స్కెచ్.. నేటి నుంచి పర్యటన..!

కల్వకుంట్ల కవిత సరికొత్త పొలిటికల్ స్కెచ్.. నేటి నుంచి పర్యటన..!
Advertisement

Kavitha Tour: స్వేచ్ఛ బ్యూరో: కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నవారు. పార్టీ జెండా పండుగను పురస్కరించుకొని జిల్లాల పర్యటనకు పార్టీ కమిటీ షెడ్యూల్ రూపొందిస్తుంది. సింగరేణి కోల్ బెల్టు ఏరియాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జరిగే జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

పార్టీ జెండా దిమ్మెలు..

ఈనెల 20 నుంచి జూన్ 20వ తేదీ వరకు తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగను నిర్వహించనుంది. అందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల రక్షణసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగే జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఇప్పటికే పార్టీ జెండాలు, బ్యానర్లు, తోరనాలకు సంబంధించిన సామగ్రిని అన్ని నియోజకవర్గాలకు పంపిణీ చేశారు. పార్టీ జెండా దిమ్మెలు నిర్మాణం,జెండాల ఆవిష్కరణను పండుగ వాతావరణంలో చేపట్టబోతున్నారు.

Advertisement

Also read: ఏం సిరీస్ గురూ… కలలోనూ వెంటాడే సీన్లున్న కొరియన్ సిరీస్

షెడ్యూల్ ఫిక్స్..

నెల రోజులపాటు జరిగే జెండా పండుగ కార్యక్రమంలో ఉమ్మడి పది జిల్లాల్లోనూ కవిత పాల్గొనబోతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అదే విధంగా సింగరేణి కోల్ బెల్టు ప్రాంత నియోజకవర్గాలైన చెన్నూరు. రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఇల్లెందు, పినపాక , సత్తుపల్లిలోనూ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన షెడ్యూల్ ను సైతం పార్టీ రూపొందిస్తున్నట్లు తెలిసింది. పార్టీ శ్రేణుల్లో ఈ కార్యక్రమంలో జోష్ నింపడంతో పాటు త్వరలో చేపట్టబోయే సభ్యత్వ నమోదుకు ఇది నాంది కావాలని భావిస్తున్నారు.

బలమైన నేతలు

Advertisement

అంతేగాకుండా ఈ జెండా పండుగను విజయవంతం చేసే నేతల వివరాలను సేకరిస్తూ రాబోయే కాలంలో పార్టీ పదవులతో పాటు టికెట్లు సైతం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు నియోజకవర్గంలో బలమైన నేతలను సైతం తయారు చేయాలని కవిత భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే పార్టీ ప్రకటించిన తర్వాత ప్రజల్లోకి తొలుత జెండా పండుగతోనే వెళ్లాలని భావించి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఏది ఏమైనా ఈ జెండా పండుగతో పార్టీ పాంచజన్యం సిద్దాంతాలను ప్రజలకు వివరించాలని ఇప్పటికే నేతలకు సూచించారు.

Also Read: వచ్చే నెలలో బంజారా జోడో ఏక్తా భారత్ యాత్ర: రవింద్ర నాయక్!

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×