E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి, మనోజ్ కు ప్రభావతి వార్నింగ్.. మనోజ్ కు కడుపుమంట.. రోహిణి పై మీనాకు అనుమానం..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి, మనోజ్ కు ప్రభావతి వార్నింగ్.. మనోజ్ కు కడుపుమంట.. రోహిణి పై మీనాకు అనుమానం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode May20th: బాలు మీనా ఇద్దరు కలిసి ఆ డబ్బులు తీసుకెళ్లిన వాళ్ళని కనిపెట్టాలని అనుకుంటారు.. డైలీ పూలు తెచ్చి ఇస్తానని నువ్వే వెళ్లి వాళ్ళ ఇంటికి మాటలు కలుపు ఆ తర్వాత దీని గురించి మాట్లాడదాము అని అంటారు.. మీనా బాలు చెప్పినట్లుగానే వెళ్లి టీవీ యాక్టర్ కళ్యాణ్ ఇంటికి వెళుతుంది.. అయితే అప్పటికి అక్కడ చింతామణి పెళ్లి గురించి ఆర్డర్ కోసం అని అక్కడికి వస్తుంది.. మీ నాకు ఆ విషయం చెప్పగానే మీనా వెళ్లి మళ్లీ కళ్యాణ్ ని అడుగుతుంది. అతనికి మీనా కి డబుల్ గుడ్ న్యూస్.. పూల ఆర్డర్ కూడా తనకే వచ్చిందని చాలా సంతోషంగా ఉంటుంది..

రోహిణికి స్ట్రాంగ్ వార్నింగ్..

ప్రభావతి హాల్లో కూర్చుని మనోజ్ రోహిణి రాగానే ఆగండి మీతో మాట్లాడాలి అని అంటుంది. ఏంటి అప్పుడే వచ్చేసారు అని అడుగుతుంది ప్రభావతి.. ఒకప్పుడు నేను హాల్లో కూర్చుంటే నాతో మాట్లాడడానికి అందరూ వనికి పోయేవారు. మీరు మాత్రం నన్ను చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎవరు కూడా మీ వల్లే నన్ను పట్టించుకోవడమే మానేశారు అని ప్రభావతి అంటుంది. మీరు చేసిన ఎదవ పని వల్లే అందరూ మీకు తోడుగా నేనున్నానని నన్ను అనుమానిస్తున్నారు అని చెప్పగానే రోహిణి మనోజ్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మళ్లీ నా గౌరవం నాకు రావాలి అంటే మీరు వెంటనే డబ్బులు కట్టాల్సిందేనని ప్రభావతి అంటుంది.

నువ్వు డబ్బులు తీసుకురావాలి..

Advertisement

ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అమ్మ.. మేం కూడా డబ్బుల కోసం చాలా ట్రై చేస్తున్నాము అని చెప్పగానే మనోజ్ ని ప్రభావతి దారుణంగా అవమానిస్తుంది. నువ్వు డబ్బులు కోసం ప్రయత్నిస్తున్న అని చెప్పద్దురా ఎందుకంటే నీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు రూపాయికి పెట్టిన ర్దరూపాయికి కూడా ఎవరు కొనరు అని ప్రభావతి అనగానే మనోజు ఫీలవుతాడు. నువ్వు మలేషియా నుంచి డబ్బులు తీసుకొని వస్తావా రావా అని రోహిణిని ప్రభావతి అడుగుతుంది. మీ నాన్న జైల్లో ఉన్నాడు సరే డబ్బులు జైల్లో లేవు కదా నువ్వు ఎప్పుడు తీసుకొస్తావో చెప్పు అని ప్రభావతి రోహిణికి వార్నింగ్ ఇస్తుంది.

మనోజ్ కు బాలు స్ట్రాంగ్ కౌంటర్..

ఏంటి ముగ్గురు మూర్ఖులు ఒకచోట చేరారు ఏం మాట్లాడుకుంటున్నారు.. ఈసారి ఏం మింగాలని అనుకుంటున్నారు అని బాలు ఇంట్లోకి రాగానే అడుగుతాడు.. సత్యం ఏమైంది మళ్లీ గొడవ ఏంటి అని అడుగుతాడు.. నాన్న వీళ్ళు చూడండి ఎలా మాట్లాడుతున్నారో అని బాలు అంటాడు. వీడి దగ్గర డబ్బులు కొట్టేసిన వాడి గురించి వెతుకుతున్నాను నాన్న వాడు ఎక్కడ దొరుకుతాడు అర్థం కావడం లేదు అని బాలు అంటాడు.. ఎందుకు ఆ డబ్బుల్ని పంచుకోవాలని అనుకుంటున్నావా అని ప్రభావతి అనగానే చూసావా నాన్న నీ మాట కోసం నేను ఇంత చేస్తుంటే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అని బాలు అంటాడు.. మేము చెప్పినట్టు వింటే విను లేదంటే నీకు ఇకమీదట ఇంట్లో కూడా స్నానం ఉండదు అని బాలు మనోజ్ కి వార్నింగ్ ఇస్తాడు.

మనోజ్ కు కడుపుకోత..

Advertisement

బాగా ఆకలేస్తుంది అమ్మ అన్నం తినాలి అని మనోజ్ ఎంతగా చెప్తున్నా సరే.. ప్రభావతి మాత్రం మీ డబ్బులు తేలిన తర్వాత వెళ్లాలి అన్నట్లుగా అంటుంది.. ప్రభావతి ఈ మాటలు పనడం కన్నా డబ్బులు తెచ్చి ఇవ్వడమే మేలు అని అంటుంది.. నాన్న గనుక జైలుకు వెళ్లకన్నాను అంటే డబ్బులు ఇలా విసిరి కొట్టేవాడు అని రోహిణి అనగానే మీనా రెచ్చిపోతుంది. ఏంటి ఇన్ని రోజులు మీ నాన్న ఎలా విసిరేసాడు ఎక్కడ విసిరేసాడు అని రోహిణికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. మీరు ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడద్దు అని మీనా అంటుంది.. దెబ్బకు రోహిణి నోరు మూసుకుంటుంది. మన నలుగురికి బిర్యానీ తీసుకొచ్చాను అని బాలు అంటాడు.. మనోజ్ రోహినీలను మాత్రం బయటికి వెళ్లి తినమని చెప్తాడు..

రోహిణి వంట.. ప్రభావతికి మంట..

ఇక రాత్రి అవగానే రవి శృతిలు ఇంటికి వస్తారు.. మనోజ్ రోహిణిలు ఇద్దరు కూడా వంటగదిలో ఏమీ చేయలేదు అని చూస్తూ ఉంటారు.. ఏమి చేయలేదు అనే మీనా ని దోసెలు వేయమని మనోజ్ అడుగుతాడు.. నీకు ఒక పెళ్ళాం ఉంది కదా ఆవిడ చేత వేయించుకొని బాలు అంటాడు.. ఇంట్లో ఏమి వంట చేయలేదు అనగానే మేము పిజ్జా తెచ్చుకున్నాము అని శృతి అంటారు. అయితే పిండి ఉంది కదా దోస వేసుకోమని చెప్పగా నేను రోహిణి నేను దోశలు వేసుకుని వస్తానని వంటగదిలోకి వెళ్తుంది.. ఈయన ఎంతగా దోస గురించి చెప్పిన సరే రోహిణి మాత్రం చండాలంగా దోశ వేసి అందరికీ షాక్ ఇస్తుంది. దోస ఎలా ఉన్నా సరే చట్నీ బాగుంటే అదే పోతుందిలే లోపలికి అని మనోజ్ ఒక్క ముక్క లోపలి పెట్టుకోగానే మంటతో విలవిలలాడిపోతాడు. ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా ఆ మంటకి తట్టుకోలేక చుక్కలు చూస్తారు. రోహిణి వంటతో ఇద్దరికీ కడుపు మంట మొదలైంది.

రోహిణి పై అనుమానం..

రోహిణి వంటగదిలోకి రాగానే మీనా ఏంటి రోహిణి నువ్వు రౌడీ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నావా? ఏదైనా అప్పు చేసావా అని అడుగుతుంది.. నేను ఎవరి దగ్గర అప్పు చేయలేదు ఇంతకీ నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని అంటే మా తమ్ముడు చెప్పాడు అని చెప్పగానే రోహిణి షాక్ అవుతుంది.. ఇప్పుడే నాకు ఇంట్లో స్థానం లేకుండా పోయింది ఇక ఈ నిజం కూడా బయటపడితే నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు అని భయపడిపోతుంది.. ఇక తర్వాత రవి, బాలు కూడా రోహిణి గుణ దగ్గర అప్పు చేస్తుంది అని మాట్లాడుకుంటారు.. మనోజ్ కి విషయం చెప్తే మనోజ్ గొడవకి దిగుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ఇంట్లోంచి వెళ్లిపో రా.. సెంటిమెంట్ సీన్ తో కన్నీళ్లు.. శ్రీవల్లి సేఫ్..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×