E-Paper
Advertisement

తిరుపతి–రక్సాల్ ఎక్స్‌ ప్రెస్ సహా 18 రైళ్లు రద్దు.. 20 రైళ్లు మధ్యలోనే నిలిపివేత!

తిరుపతి–రక్సాల్ ఎక్స్‌ ప్రెస్ సహా 18 రైళ్లు రద్దు.. 20 రైళ్లు మధ్యలోనే నిలిపివేత!
Advertisement

Indian Railway  Alert: ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది.  18 ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేయడంతో పాటు మరో 23 రైళ్లను దారిమళ్లించినట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. సమస్తిపూర్–దర్భంగా రైల్వే సెక్షన్‌ లో ట్రాక్ డబ్లింగ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించింది. తూర్పు మధ్య రైల్వే పరిధిలోని సమస్తిపూర్ డివిజన్‌లో నాన్ ఇంటర్‌ లాకింగ్ పనులు చేపట్టడంతో మే 11 నుంచి 14 వరకు రైళ్ల రద్దు, డైవర్షన్ కొనసాగుతుందని రైల్వే అధికారులు ప్రకటించారు.

సమస్తిపూర్–దర్భంగా మార్గంలో ట్రాక్ డబ్లింగ్ పనులు

సమస్తిపూర్–దర్భంగా మార్గంలో ట్రాక్ డబ్లింగ్ ప్రాజెక్ట్‌ లో భాగంగా చేపడుతున్నట్టు సమస్తిపూర్ పీఆర్ఓ ఆర్‌కే సింగ్ వెల్లడించారు. రైళ్ల రాకపోకలను మరింత వేగంగా, సురక్షితంగా నిర్వహించడానికి ఈ పనులు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం జరుగుతున్ననాన్ ఇంటర్ లాకింగ్ పనుల వల్ల తాత్కాలికంగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని, పనులు పూర్తయ్యాక ఈ లైన్ సామర్థ్యం మరింతగా పెరుగుతుందని తెలిపారు.

ఏ రైళ్లు రద్దు అయ్యాయంటే?

Advertisement

రద్దైన రైళ్లలో సమస్తిపూర్–మణిహారి, దర్భంగా–సమస్తిపూర్, అరా–జయనగర్, ముజఫర్‌ పూర్–జయనగర్, దర్భంగా–వారణాసి సిటీ, సమస్తిపూర్–బరౌనీ, సమస్తిపూర్–ముజఫర్‌ పూర్ మార్గాల్లో నడిచే ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. రోజువారీ ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా వినియోగించే ఈ రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పలు ఎక్స్ ప్రెస్ రైళ్ల దారిమళ్లింపు

ఇక పలు ఎక్స్‌ ప్రెస్ రైళ్లను కూడా దారి మళ్లించారు. సమస్తిపూర్–ముజఫర్‌ పూర్–సీతామర్హి,  దర్భంగా–సీతామర్హి–రక్సాల్–సుగౌలి మార్గాల్లో నడిచే రైళ్లు ప్రత్యామ్నాయ రూట్లలో నడుపుతున్నారు. గోండియా–రక్సాల్ ఎక్స్‌ ప్రెస్, జయనగర్–అరా ఎక్స్‌ ప్రెస్, దర్భంగా–న్యూఢిల్లీ క్లోన్ స్పెషల్, జయనగర్–అమృత్‌ సర్ ఎక్స్‌ ప్రెస్, దర్భంగా–అమృత్‌ సర్ ఎక్స్‌ ప్రెస్, తిరుపతి–రక్సాల్ ఎక్స్‌ ప్రెస్, దర్భంగా–అహ్మదాబాద్ ఎక్స్‌ ప్రెస్ లాంటి ముఖ్యమైన రైళ్ల మీద కూడా ఈ ఎఫెక్ట్ పడనుంది.

Advertisement

అంతేకాకుండా, సమస్తిపూర్ డివిజన్‌ లోని పలు స్టేషన్ల వద్ద 20 ప్యాసింజర్ రైళ్లను గమ్యస్థానానికి ముందుగానే నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. మరో ఏడు రైళ్లను ఒకటి నుంచి మూడు గంటల వరకు రీషెడ్యూల్ చేసినట్టు తెలిపారు. దీంతో ప్రయాణ సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

రైల్వే అధికారుల కీలక సూచనలు

రైల్వే శాఖ ప్రయాణికులకు ముందస్తుగా తమ రైళ్ల స్టేటస్ తెలుసుకోవాలని సూచించింది. ప్రయాణానికి ముందు అధికారిక వెబ్‌ సైట్, NTES యాప్, రైల్వే హెల్ప్‌ లైన్ ద్వారా రైళ్ల సమయాలు, రద్దులు, రూట్ మార్పుల వివరాలు చెక్ చేసుకోవాలన్నది. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు చేసే వారు ముందుగానే సమాచారం తెలుసుకుని ప్లాన్ చేసుకుంటే ఇబ్బందులు తగ్గుతాయని అధికారులు సూచించారు. ఈ ట్రాక్ డబ్లింగ్ పనులు పూర్తయిన తర్వాత రైళ్ల రద్దీ తగ్గడమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని రైళ్లను ఈ మార్గంలో నడపడానికి అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. రైళ్ల ఆలస్యాలు తగ్గి, ప్రయాణ సమయం తగ్గే అవకాశముందన్నారు.

Read Also: హైదరాబాద్- ముంబై ప్రయణం ఇక 3 గంటలే.. బుల్లెట్ రైలు డీపీఆర్ కంప్లీట్!

Related News

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

అర్ధరాత్రి కూడా భానుడి ప్రతాపమే.. భూమిపై సూర్యుడు అస్తమించని ఆ 5 వింత ప్రదేశాలేవో తెలుసా?

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

భూమిపై 5 ప్రమాదకర పర్యాటక ప్రాంతాలు.. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం.. అయినా వెళుతున్న టూరిస్ట్స్

Big Stories

Advertisement
×