E-Paper
Advertisement

TRS పేరు నా నుదుట రాసిపెట్టి ఉందేమో.. కీలక ప్రకటన చేసిన కల్వకుంట్ల కవిత

TRS పేరు నా నుదుట రాసిపెట్టి ఉందేమో.. కీలక ప్రకటన చేసిన కల్వకుంట్ల కవిత
Advertisement

తెలంగాణ రాజకీయ యవనికపై సరికొత్త అధ్యాయం మొదలైంది. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక పునరుజ్జీవం కోసం కృషి చేసిన కల్వకుంట్ల కవిత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె స్థాపించిన కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ పార్టీకి ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) అనే పేరు ఖరారు అయింది. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో నేరుగా ఆమోద పత్రాన్ని అందుకున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తు కార్యచరణను వివరించారు.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 2026 జనవరి నెలలో ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నట్లు కవిత వెల్లడించారు. తాము ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలో మూడవ పేరు అయిన తెలంగాణ రక్షణ సేనను ఈసీ కేటాయించింది. యాదృచ్ఛికంగా ఈ పేరు సంక్షిప్త రూపం టీఆర్ఎస్ (TRS) కావడం విశేషం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విడదీయలేని భాగమైన ఈ మూడు అక్షరాలు మళ్ళీ తన పార్టీకే రావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. విధి వైచిత్రి వింతగా ఉంటుందని టీఆర్ఎస్ పేరు తన నుదుట రాసిపెట్టి ఉన్నట్లుగా అనిపిస్తోందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

Advertisement

రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడటమే తమ పార్టీ ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ భాష సంస్కృతి అస్తిత్వం కోసం జాగృతి సంస్థ ద్వారా నిరంతరం పోరాడామని గుర్తు చేశారు. అదే అంకితభావంతో ఇప్పుడు రాజకీయ వేదిక ద్వారా ప్రజలకు సేవ చేస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల సంఘం నిబంధనలకు కట్టుబడి చట్టబద్ధంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. అస్తిత్వ పరిరక్షణ ధ్యేయంగా రక్షణ సేన సైనికుల్లా పని చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తెలంగాణ రక్షణ సేన ఆవిర్భావం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా మారుతోంది. టీఆర్ఎస్ అనే అక్షరాలతో ప్రజలకు ఉన్న అనుబంధం తమకు కలిసి వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై కవిత దృష్టి సారించనున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర సమస్యలపై పోరాటాలను ఉధృతం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ సమాజం తమను ఆదరిస్తుందని రక్షణ సేన నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ALSO READ: కదంతొక్కిన అంబటి.. నా కుక్క కూడా భయపడదంటూ.. లోకేశ్‌కు మాస్ వార్నింగ్!

Related News

భారత్ ఫ్యూచర్ సిటీలో NIUM నూతన ప్రాంగణానికి.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్!

చెడు చేసేవారికి ఎప్పటికీ విజయముండదు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో 14,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

హైదరాబాద్‌లో కొత్త బోర్లకు నో పర్మిషన్! ఎల్‌నినోపై సీఎస్ సంజయ్ జాజు సంచలన ఆదేశాలు

గద్వాల జిల్లాలో రైస్ మిల్లర్ల భారీ స్కాంమ్.. రూ.6 కోట్ల సీఎంఆర్ ధాన్యం గోల్‌మాల్!

సింగరేణి ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు.. పూర్తి పే స్కేల్ పట్టిక ఇదే!

సీఎం రేవంత్‌తో మధుయాష్కీ భేటీ.. పాలన, పార్టీ బలోపేతంపై కీలక చర్చ

కరువు కేబినెట్ సబ్ కమిటీకి.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ 23 ప్రశ్నల బహిరంగ లేఖ!

Big Stories

Advertisement
×