Wanaparthy Development: వనపర్తి పట్టణ సమగ్ర అభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వనపర్తి సంస్థానాధీశులు రాజా కృష్ణదేవరావు స్పష్టం చేశారు. ఆదివారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి.. రాజా కృష్ణదేవరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణ ప్రగతి, రాబోయే రోజుల్లో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు.
వనపర్తిని మరింత ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సంస్థానం తరఫున తగిన మద్దతు, సహకారం అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి రాజావారిని కోరారు. దీనిపై రాజా శ్రీకృష్ణదేవరావు సానుకూలంగా స్పందించారు. వనపర్తి పట్టణాభివృద్ధి కోసం ఎమ్మెల్యే మేఘారెడ్డి నిరంతరం చేస్తున్న కృషి, ఆయన పనితీరు చాలా బాగుందంటూ అభినందించారు. పట్టణ ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకునే ప్రతి మంచి నిర్ణయానికి తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ మర్యాదపూర్వక భేటీలో వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ పుట్టపాక మాధవి, ఎస్ఎల్ఎన్ రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి మధుసూదన్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కదిరె రాములు, మార్కెట్ యార్డు మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గారి శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ గొల్ల వెంకటయ్య పాల్గొన్నారు. అలాగే పెబ్బేరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యాపార రామిరెడ్డి, శ్రీరంగాపురం మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు విజయవర్ధన్ రెడ్డి, రంజిత్ కుమార్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also read: వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు!