BigTV English

Kavitha: కవిత ట్విట్టర్‌లో ఆ పేరు డిలీట్.. ఇప్పుడు కొత్తగా ఏం మార్పులు చేసిందంటే..?

Kavitha: కవిత ట్విట్టర్‌లో ఆ పేరు డిలీట్.. ఇప్పుడు కొత్తగా ఏం మార్పులు చేసిందంటే..?

Kavitha: బీఆర్ఎస్ కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత తన ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా ఆ మార్పులు చేశారు. ఇంతకు ముందు ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అని పెట్టుకున్న కవిత ఇప్పుడు వాటిని తీసేశారు. కేవలం మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అని పెట్టుకున్నారు. అదే విధంగా ట్విట్టర్ అకౌంట్ లో బీఆర్ఎస్ లోగోను కూడా తీసేశారు. ఎడుమ వైపు ఉన్న కారు గుర్తును తొలగించారు కల్వకుంట్ల కవిత.


మూడు రోజులు క్రితం కవిత మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. వ్యాఖ్యలు చేసిన అనంతరం బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకోవడం.. మళ్లీ కవిత కొత్త విషయాలు చెప్పడం అన్నీ రెండు రోజుల గ్యాప్ ల్లోనే అయిపోయాయి. ముందుగా కేసీఆర్ బద్నాం కావడానికి కారణం ఇద్దరు, ముగ్గురే కారణం అని చెప్పింది.. ‘హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణా రెడ్డి వల్లే కేసీఆర్ ఇన్ని మాటలు పడుతున్నారు. నా మీద కూడా అనేక ఆరోపణలు చేశారు. కానీ నేను వాటిని తట్టుకుని నిలబడ్డాను. హరీష్ రావు, సంతోష్ లు అవినీతి అనకొండలు. కేసీఆర్ చుట్టూ అవినీతి అనకొండలు చేరి మరకలంటిస్తున్నారు’ అని ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అన్నంత పనే చేసిందిగా..


ఇద్దరి ఇరిగేషన్ అధికారుల వద్ద వందల కోట్లు దొరికాయని కూడా కవిత ఆరోపణలు చేశారు. ‘అధికారుల వెనుక ఎవరున్నారో దర్యాప్తు చేయండి.. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా..? అందుకే హరీష్ ను ఇరిగేషన్ మంత్రిగా తొలగించారు.. వాళ్ల స్వార్థం కోసమే అవనీతికి పాల్పడ్డారు’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పై సీబీఐ కేసుల దాకా వచ్చాక పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత? అని కూడా మాట్లాడారు. ఇప్పుడు అన్నట్టుగానే బీఆర్ఎస్ పేరు, లోగోను ట్విట్టర్ నుంచి తీసేశారు.

ALSO READ: CM Revanth Reddy: యూరియా కొరతపై అసలు నిజాలు చెప్పేసిన సీఎం రేవంత్.. రాష్ట్రంలో జరిగేదంతా ఇదే..

Related News

Ganesh Laddu: మై హోమ్ భుజాలో రికార్డ్ ధర పలికిన లడ్డూ.. ఏకంగా అరకోటికి పైగానే

CM Revanth Reddy: యూరియా కొరతపై అసలు నిజాలు చెప్పేసిన సీఎం రేవంత్.. రాష్ట్రంలో జరిగేదంతా ఇదే..

Warangal mysteries: వరంగల్‌లో జరుగుతున్న వింతలేంటి? విని ఆశ్చర్యపోవాల్సిందే!

School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్, రేపు సూళ్లు బంద్!

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్

Big Stories

×