CM Revanth Reddy: కామారెడ్డి జిల్లాలో వరద బాధిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ ప్రజలను వరద తీవ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. వదర బాధితులను ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని సీఎం భరోసా ఇచ్చారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను, కాలనీలను పరిశీలించి అక్కడి ప్రజలకు సాయం చేస్తానని హమీ కూడా ఇచ్చారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయ్యాయని, పంటలతో పాటు ఇండ్లు కూడా వరదల్లో మునిగిపోయి ఇబ్బందులు పడ్డామని సీఎం రేవంత్ రెడ్డి రైతులు వివరించారు. రైతులు, గ్రామస్థులు అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. విభాగాల వారీగా వరద నష్టంపై పూర్తి వివరాలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసితే.
కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
వరద బాధిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘వరద నష్టం ఎక్కువగా జరగకుండా అధికారులు అప్రమత్తం అయ్యారు. సరైన సమయంలో స్పందించి చర్యలు చేపట్టిన అధికారుల కృషిని అభినందిస్తున్నా. పరిపాలన సౌలభ్యం కోసం వివిధ శాఖలను ఏర్పాటు చేసుకున్నాం. క్రైసిస్ మేనేజ్మెంట్ సమయంలో శాఖల మధ్య సమన్వయం ఉండాలి. జిల్లా కలెక్టర్లు వివిధ శాఖలన్నింటితో సమన్వయ సమావేశాలు నిర్వహించండి’ అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ALSO READ: Intelligence Bureau: ఐబీలో 455 ఉద్యోగాలు.. నో హెవీ కాంపిటేషన్, అప్లై చేస్తే కొలువు భయ్యా
15 రోజుల్లో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తా..
సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో వ్యవహరించాలి. సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పకడ్బందీగా అమలు చేయాలి. రాబోయే 15 రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తా. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇంచార్జ్ మంత్రి సీతక్క ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తారు. ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను సమీక్షలో మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లండి.. నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీఫ్ ఫండ్ ను రాబట్టుకోవాలి. భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత ప్రణాళికలు రూపొందించాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ALSOO READ: CM Revanth Reddy: కామారెడ్డిలో రైతులతో మాట్లాడిన సీఎం రేవంత్.. వారందరికీ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా..!
యూరియా కొరతపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
యూరియా కొరతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా పంపిణీపై రాష్ట్రంలో అసత్య ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. ‘రైతులు చాలా సేపు లైన్ లో నిలబడి అలిసిపోతున్నారు.. అసలు యూరియానే లేదని చెబుతున్నారు. రాష్ట్రంలో యూరియా సరిపడా అందుబాటులో ఉంది. అయితే అందరూ ఒకే దగ్గర ఉండేసరికి లైన్ పెద్దగా ఉంటుంది. క్యూలో చివర ఉన్న వాడికి యూరియా పంపిణీ చేయాలంటే 8 గంటల సమయం పడుతుంది. ఆ 8 గంటలు లైన్ లో నిలబడలేక సహనం లేక ధర్నాలకు దిగుతున్నారు. యూరియా కేంద్రం వద్ద ఉన్న రైతులను కొంత మంది కావాలనే తీసుకెళ్లి, రోడ్డుపై కూర్చోపెడుతున్నారు. ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.