BigTV English

OTT Movie : చేతబడి చేసి చావుకు దగ్గరయ్యే అమ్మాయి… మాస్క్ చుట్టే మిస్టరీ అంతా… 7 రోజుల్లో ఆ పని చేయకపోతే ఫ్యామిలీ ఫసక్

OTT Movie : చేతబడి చేసి చావుకు దగ్గరయ్యే అమ్మాయి… మాస్క్ చుట్టే మిస్టరీ అంతా… 7 రోజుల్లో ఆ పని చేయకపోతే ఫ్యామిలీ ఫసక్

OTT Movie : ఇండోనేషియన్ హారర్ సినిమాలలో దెయ్యాల గోల ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమాలలో బ్లాక్ మ్యాజిక్ కంటెంట్ వణుకు పుట్టిస్తుంటుంది. ఈ సినిమాలను పగటిపూట చూసినా గగుర్పాటుకి గురిచేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ మరణం తర్వాత ఏడు రోజుల పాటు ఆత్మ భూమిపై ఉంటుందనే నమ్మకంపై ఆధారపడింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘The Last 7 Days’ 2025లో విడుదలైన ఇండోనేషియన్ సూపర్‌ నాచురల్ హారర్ చిత్రం. అవి సూర్యాది దర్శకత్వంలో, అగ్లా అర్టలిడియా (తారి), హైదర్ సలీష్ (కాదర్), అనంత్య రెజ్కీ కిరణ (బియాన్), సుల్తాన్ హమోనంగన్ (హనీఫ్), ఫన్నీ ఘస్సాని (అంగ్గున్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2020లో పిజారు యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలైన అదే పేరుతో ఉన్న షార్ట్ ఫిల్మ్ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా 2025 జనవరి 23న థియేటర్లలో విడుదలై, 1 గంట 47 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 5.3/10 రేటింగ్ పొందింది. 2025 జూన్ 15 నుండి ఇండోనేషియన్ ఆడియోతో నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్, తెలుగు, హిందీ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే 

తారి, కదర్ తమ తల్లి అంగ్గున్ మరణించడంతో, ఆమె అంత్యక్రియల కోసం సెంట్రల్ జావాలోని తమ పూర్వీకుల ఇంటికి వస్తారు. అంగ్గున్‌తో తారికి చిన్నప్పటి చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె పట్ల కాస్త కోపం కూడా ఉంటుంది. తారి తన ఇద్దరు పిల్లలు, బియాన్, హనీఫ్ తో కలిసి వస్తుంది. వాళ్లు తమ అమ్మమ్మను ఇక్కడ మొదటిసారి చూస్తారు. వీళ్ళ సంప్రదాయం ప్రకారం, మరణించిన వ్యక్తి ఆత్మ ఏడు రోజుల పాటు ఇంట్లోనే ఉంటుందని నమ్ముతుంటారు. కానీ అంగ్గున్ మరణం వెనుక ఒక శాపం ఉంది. ఇప్పుడు దాన్ని తొలగించకపోతే ఆమె ఆత్మకి శాంతి ఉండదు. ఈ ఏడు రోజుల్లో, తారి, కదర్, పిల్లలు భయంకరమైన అనుభవాలు ఎదుర్కొంటారు. ముసుగులతో ఉన్న ఆత్మలు, వింత ఆచారాలు, అంగ్గున్ మృతదేహం నిటారుగా నిలబడటం లాంటివి కళ్ళకు కనబడుతుంటాయి. ఇది కథను మరింత భయంకరంగా మారుస్తుంది.


ఈ శాపం వెనుక అంగ్గున్ గతంలో చేసిన రహస్య ఒప్పందం ఉందని తెలుస్తుంది. దాన్ని ఏడు రోజుల్లోపు తీర్చకపోతే కుటుంబం మీద పెను ప్రమాదం వస్తుంది. తారి, కదర్ ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో తారి పిల్లలను రక్షించడానికి బస్సు టికెట్లు కొనడానికి వెళ్తుంది. ఇక్కడ నుంచి వాళ్ళను బయటికి పంపించాలని చూస్తుంది. కానీ కదర్ బాధ్యతారాహిత్యంగా మద్యం సేవించి, ఒక అమ్మాయితో గడిపి, స్మశానంలో బట్టలు కూడా లేకుండా మేల్కొంటాడు. ఐదవ రోజున తారి అంగ్గున్ గతంలోని ఒప్పందం గురించి తెలుసుకుంటారు. ఇది ఒక దెయ్యం డిమాండ్‌తో ముడిపడి ఉంటుంది. ఇక ఈ క్లైమాక్స్ భయంకరమైన సంఘటనలతో ముగుస్తుంది. అంగ్గున్ దెయ్యంతో కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి ? తారి ఈ అంత్యక్రియలను జరుపుతుందా ? అంగ్గున్ ఆత్మ వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : పెళ్ళైన డాక్టర్ తో మోడల్ మెంటల్ పని… జీవితాన్నే మార్చేసే లింగరీ యాడ్… క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా

Related News

OTT Movie : పెళ్ళాలను మార్చుకునే దిక్కుమాలిన ఫాంటసీ… ఇంత ఓపెన్ గా అలాంటి సీన్లేంది భయ్యా ?

OTT Movie: పెళ్లికాని అర్చన పాట్లు.. కడుపుబ్బా నవ్వించే ఈ మలయాళం మూవీ అస్సలు మిస్ కావద్దు!

OTT Movie : గ్యాంగ్స్టర్ తో సీక్రెట్ డీల్… రివేంజ్ కోసం ఇంతకు దిగజారాలా ? ట్విస్టులే ట్విస్టులున్న పంజాబీ యాక్షన్ థ్రిల్లర్

OTT Movie: అసలే అజంతా గుహలు.. పక్కనే అందమైన అమ్మాయి, రొమాన్స్ ప్రియులకు పండగలాంటి సినిమా ఇది

OTT Movie : టీచర్ కు పాఠాలు నేర్పించే 17 ఏళ్ల కుర్రాడు… ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ ఎమోషనల్ డ్రామా

Big Stories

×