lokeskసమయం, సందర్భం చూసి వారికి స్ట్రాంగ్ వార్నింగ్‌తో పాటే దిమ్మతిరిగే సమాధానాలు సైతం ఇస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై ముందుగా సమాధానాలు చెప్పాలని, ఆ తర్వాతే తాము చేస్తున్న అభివృద్ధిపై ప్రశ్నించాలని కోరుతున్నారు.ఎందుకంటే వైసీపీ హయాంలో వచ్చిన పెట్టుబడుల కంటే చేసిన అప్పులే ఎక్కువ అని లెక్కలతో సహా ఆయన సమాధానాలు ఇస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు సుమారు రూ.లక్ష కోట్ల మేర పెట్టుబడులు సాధించినట్టు వెల్లడించారు. ఇప్పటివరకు వివిధ అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలు, ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పందాలను ఉదహరిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రస్తుత్తం ఆర్ఠిక లోటుతో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలో ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, నిధుల ద్వారా సంక్షేమం, అభివృద్ధి ముందుకు సాగుతున్నది. రాజధాని నిర్మాణ దశలోనే ఉండటం వలన పూర్తిస్థాయిలో కంపెనీలు, పరిశ్రమలు కొలువుదీరలేదు. ఫలితంగా ఏపీ యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తున్నది. దానిని అధిగమించేందకు ఏపీ సర్కార్.. పెట్టుబడులపై దృష్టి సారించింది.రెండ్రోల కిందట అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.2,300 కోట్లతో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.
ఈ పరిశ్రమ ఉత్తరాంధ్రలో స్థాపించడం వలన స్థానికంగా 1,750 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి నారాలోకేశ్ మాట్లాడుతూ.. వచ్చే ఐదేండ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రకటించారు. ఉత్తరాంధ్రను పారిశ్రామిక అభివృద్దిలో నెంబర్ వన్‌గా నిలుపుతామన్నారు.దీనిపై కూడా వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఎందుకంటే, కూటమి సర్కార్ కేవలం ఉత్తరాంధ్రకే ప్రయారిటీ ఇస్తున్నదని.. పరిశ్రమలు, కంపెనీలను అక్కడికే తీసుకెళ్లడం వలన రాయలసీమ ప్రాంతం మళ్లీ వెనక్కి వెళ్తుందని, ఇక్కడ కూడా ఫోకస్ పెట్టాలని గగ్గోలు పెడుతున్నట్టు తెలిసింది.దీనిపైనా మంత్రి నారాలోకేశ్ దీటుగా బదులిచ్చారు.
AP CM : ఏపీ, తెలంగాణ మధ్య 5 గ్రామాల పంచాయితీ.. బాబు నిర్ణయంపై ఉత్కంఠ?
పెట్టుబడిదారులకు అనువైన ప్రాంతం, వారికి జల, వాయు రవాణా మార్గాలను చూసుకుని వారు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారని, అదేవిధంగా భూసేకరణ కూడా కీలకమైన అంశమని మంత్రి లోకేశ్ వైసీపీ నేతలకు అర్థమయ్యేలా చెప్పినట్టు తెలుస్తున్నది. ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంతం పెట్టుబడులకు అనుకూలంగా ఉండాలి. అందుకు ప్రభుత్వం సహకారం ఎంతో ముఖ్యం. భూసేకరణ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చాకే కంపెనీలు ముందుకు వస్తాయనే విషయాన్ని ఆయన గుర్తుచేసినట్టు సమాచారం.తమది మాటలు చెప్పేప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని మంత్రి నారాలోకేశ్ వైసీపీ నేతలకు స్పష్టంచేశారు. తమ ప్రభుత్వంలో పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా ఈజీ పాలసీని రూపొందించినట్టు వెల్లడించారు.