E-Paper
Advertisement

సీఎంఓ నుంచి బెదిరింపులు.. ప్రతి పనికి 15 శాతం కమీషన్.. కవిత సంచలన ఆరోపణలు!

సీఎంఓ నుంచి బెదిరింపులు.. ప్రతి పనికి 15 శాతం కమీషన్.. కవిత సంచలన ఆరోపణలు!
Advertisement

Kalvakuntla Kavitha: ‘ఇది ప్రజాపాలన కాదు.. పచ్చి దోపిడీ, లూటీ పాలన’ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఈ అరాచకాలను సహించదని పేర్కొన్నారు. ప్రతీ పనికి 15 శాతం కమీషన్ కావాలంటూ నేరుగా సీఎంఓ నుంచే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమంటూ గురువారం ఎక్స్ లో ట్వీట్ చేశారు.

తమ అనుచరులకు, ఆప్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు చట్టాన్ని, నిబంధనలను ఏమాత్రం లెక్కచేయటం లేదని కవిత ఆరోపించారు. ఎలాంటి అర్హతలు లేని వారికి కేవలం కమీషన్ల కోసం పనులు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను దోచుకుంటూ కమీషన్ల కోసం బెదిరింపులకు పాల్పడుతున్న వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ లూటీకి పాల్పడిన వాళ్లందరిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

మరోవైపు మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా తెలంగాణలో మహిళా రైతుల దయనీయ పరిస్థితిపై కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని చూసుకుంటూనే ఉదయం నుంచి రాత్రి వరకు పొలం, పాడి పనులతో తీరిక లేకుండా శ్రమిస్తున్న వారికి కనీస గుర్తింపు దక్కటం లేదని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. గ్రామీణ ఆర్థిక ప్రగతి చక్రానికి ఇరుసుగా ఉన్న ఆడబిడ్డల కష్టాలు, త్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మహిళా రైతుల సాధికారత చట్టం -2026 ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం కూడా చట్టం చేయాలన్నారు. మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా సాగులో, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 80 శాతం భాగస్వాములుగా ఉన్న మహిళల శ్రమను గుర్తిస్తూ.. వారిని గౌరవించుకుందామని పేర్కొన్నారు.

Also Read: సీజేపీ నిరసనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. వ్యాపారుల పిటిషన్ కొట్టివేత.. పోలీసులకు కీలక ఆదేశాలు!

Advertisement

అటు దళిత జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ప్రజాస్వామ్యంపై దాడి అని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో దళిత జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన గంభీరావు పేట్ ఎస్సై శ్రీకాంత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీకి పాల్పడిన ఎస్సై సహా మిగతా పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలన్నారు. ఎస్సై భూ అక్రమాలు, పంచాయతీలు, సెటిల్ మెంట్లపై వార్తలు రాస్తే అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు. ఈ విషయంపై డీజీపీ వెంటనే స్పందించి ఎస్సైతో పాటు బాధ్యులపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: ప్రాణాలను పణంగా పెట్టి ఎవరెస్ట్ ఎక్కిన రియల్ హీరో… చరిత్ర మర్చిపోయిన అసలైన వీరుడి ఎపిక్ స్టోరీ… చూస్తే గూస్‌బంప్స్ గ్యారెంటీ

Tags

Related News

సింగరేణిని ముంచింది బీఆర్‌ఎస్సే.. మంత్రి పొంగులేటి సంచలన విమర్శలు!

తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనల డేటా విడుదల.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

రూ. 5 లక్షలు లంచం.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్!

ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్‌‌లో స్కాములు దాస్తున్నారా.. ప్రభుత్వంపై ఎలేటి ఫైర్!

రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. రూ.12 లక్షలు ఇచ్చి ఆదుకున్న బిగ్ టీవీ ఛైర్మన్.. సర్వత్రా ప్రశంసలు!

సీఎం రేవంత్ అత్యవసర కేబినెట్ భేటీ.. ఎల్ నినోతో నష్టపోయిన రైతులకు పరిహరం!

మంచిర్యాలలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల దందా.. అధికారులకు మంత్రి వివేక్ వార్నింగ్!

Big Stories

Advertisement
×