Kamareddy : కామారెడ్డిలో సంచలనం ఫలితం రాబోతోందా? కేసీఆర్ కు ఓటమి తప్పదా? అంటే అవుననే ఫలితాలు ట్రెండ్స్ చెబుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ కామారెడ్డిలో వెనుకంజలో ఉన్నారు. తొలుత బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పుంజుకున్నారు. 3వ రౌండ్ ముగిసే సరికి రేవంత్ 2500 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.
తెలంగాణలో పోలింగ్ ముగిసిన వెంటనే హాట్ టాపిక్ గా నిలిచిన నియోజకవర్గం కామారెడ్డి. అప్పటివరకు ఇక్కడ కేసీఆర్ గెలుస్తారనే భావించారు. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి సంచలన ఫలితం వస్తుందనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు కౌంటింగ్ సమయంలో అదే జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో కేసీఆర్ వెనుక బడ్డారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి కే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ తర్వాత రేవంత్ రెడ్డి లీడ్ లోకి వచ్చారు. ఈ ట్రెండ్స్ కొనసాగితే రేవంత్ రెడ్డి సంచలన విజయం సాధించడం ఖాయమని అంటున్నారు.