EC Website Crash: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవ్వగా.. నాలుగు రాష్ట్రాల్లో ఏయే పార్టీలు అత్యధిక స్థానాలు సాధిస్తాయో అంచనాలు మొదలయ్యాయి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని ఎగ్జిట్ పోల్స్ చెప్పగా.. ఇదే నిజమవుతోంది. మిగతా మూడు రాష్ట్రాల్లో రెండింట బీజేపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది.
ఎన్నికల ఫలితాల వేళ.. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈసీ వెబ్ సైట్ ను చూస్తుండటంతో.. వెబ్ సైట్ పై లోడ్ ఎక్కువైంది. దాంతో వెబ్ సైట్ క్రాష్ అయినట్లు సమాచారం. ఈసీ వెబ్ సైట్ క్రాష్ అయిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలను చూసేందుకు ఈసీ వెబ్ సైట్ ఓపెన్ చేస్తుంటే.. ఓపెన్ కావడం లేదంటూ స్క్రీన్ షాట్లు తీసి షేర్ చేస్తున్నారు. ఈసీ వెబ్ సైట్ క్రాష్ అవ్వడంతో ఫలితాల వివరాలు తెలియడం లేదని ఆందోళన చెందుతున్నాయి. ఈ విషయం ఎన్నికల సంఘం దృష్టికి చేరగా.. సమస్యను ఈసీ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.