E-Paper
Advertisement

రూ. 5 లక్షలు లంచం.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్!

రూ. 5 లక్షలు లంచం.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్!
Advertisement

Keesara Bribery: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వ కార్యాలయంలో లంచం డిమాండ్‌ చేసిన వ్యవహారంలో కీసర మండల డిప్యూటీ తహసీల్దార్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వ్యవసాయ భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్‌ చేయగా, అందులో భాగంగా బుధవారం రూ.2.50 లక్షలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు రంగారెడ్డి రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ కుమార్‌ మీడియాకు వెల్లడించారు.

నెలల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

కీసర మండల పరిధిలోని వ్యవసాయ భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు బాధితులు పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నారని డీఎస్పీ తెలిపారు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు వివరించారు. ఈ క్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌ కుమార్‌ రెడ్డి రూ.5 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఫిర్యాదు అందిందన్నారు. ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టి, రూ.2.50 లక్షలు తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నట్లు వెల్లడించారు.

వీఆర్వో, ప్రైవేటు వ్యక్తి పాత్రపైనా విచారణ

Advertisement

ఈ వ్యవహారంలో వీఆర్వో విజయ్‌ కుమార్‌, ప్రైవేటు వ్యక్తి బాలకృష్ణ పాత్రపైనా ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.లంచం డిమాండ్‌ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Also read: ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్‌‌లో స్కాములు దాస్తున్నారా.. ప్రభుత్వంపై ఎలేటి ఫైర్!

Tags

Related News

తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనల డేటా విడుదల.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్‌‌లో స్కాములు దాస్తున్నారా.. ప్రభుత్వంపై ఎలేటి ఫైర్!

రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. రూ.12 లక్షలు ఇచ్చి ఆదుకున్న బిగ్ టీవీ ఛైర్మన్.. సర్వత్రా ప్రశంసలు!

సీఎం రేవంత్ అత్యవసర కేబినెట్ భేటీ.. ఎల్ నినోతో నష్టపోయిన రైతులకు పరిహరం!

మంచిర్యాలలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల దందా.. అధికారులకు మంత్రి వివేక్ వార్నింగ్!

చెత్త సేకణనలో కొత్త రూల్స్.. అందరూ ఇవి చేయాల్సిందే: సుప్రీంకోర్టు డెడ్‌లైన్!

సీఎం రేవంత్‌ మాదిరిగా గడ్డం పెంచుకుంటే అధికారంలోకి వస్తావా? కేటీఆర్‌కు విప్ వీరేశం స్ట్రాంగ్ కౌంటర్

Big Stories

Advertisement
×