E-Paper
Advertisement

Komatireddy: నా మాటలు వక్రీకరించారు.. బీజేపీ రాజకీయం చేస్తోంది: వెంకట్‌రెడ్డి

Komatireddy: నా మాటలు వక్రీకరించారు.. బీజేపీ రాజకీయం చేస్తోంది: వెంకట్‌రెడ్డి
Advertisement

Komatireddy Venkat Reddy: తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్‌ మరో పార్టీతో కలవాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ సెక్యులర్‌ పార్టీలని, కాంగ్రెస్‌తో కేసీఆర్‌ కలవక తప్పదని అన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్ మద్దతును కేసీఆర్‌ తీసుకోవాల్సిందేనని తెలిపారు. దీంతో పార్టీ అధిష్టానం కోమటిరెడ్డిపై ఆగ్రహంగా ఉంది.

ఈక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లోని వీఐపీ లాంజ్‌లో ఈ సమావేశం జరిగింది. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన మాటలను వక్రీకరించారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ చెప్పిందే.. తాను రిపీట్ చేశానని వెల్లడించారు. సెక్యూలర్ పార్టీలతోనే పొత్తు అని చెప్పానని చెప్పారు. మీడియా తన మాటల్ని వక్రీకరించిందని మండిపడ్డారు. బీజేపీ ఆ విషయాన్ని రాజకీయం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్‌లో చిన్న చిన్న వాళ్లు కూడా మాట్లాడుతున్నారని.. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే పరిస్థితి ఏంటన్నదే తాను చెప్పానని వివరించారు. ఈ విషయాన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేశారో తెలియట్లేదన్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×