BigTV English

Summer: ఈసారి ఎండలు మండుడే.. జర జాగ్రత్త..

Summer: ఈసారి ఎండలు మండుడే.. జర జాగ్రత్త..

Summer: శివరాత్రికి శివ శివా అంటూ చలిపోతుందని అంటారు. కానీ, ఈసారి శివరాత్రికంటే ముందే చలి పరారైనట్టు ఉంది. అయితే, కంప్లీట్ గా పోకుండా.. ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ మండుతూ.. మిక్స్డ్ వెదర్ కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే ఎండ సుర్రున కాలుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందుముందు ఇంకెలా ఉంటుందోననే టెన్షన్ మొదలైంది. ఎందుకంటే.. ఎండ దెబ్బ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.


రాత్రివేళలో చలి ఉంటోంది. తెల్లవారుజామున మరింత చలి పెరుగుతోంది. 11 తర్వాత బయటకు వచ్చే వాళ్లకు మాత్రం ఎండ ప్రతాపం తెలిసొస్తోంది. ఇలా డిఫరెంట్ కాక్ టైల్ వెదర్ తో తెలుగు ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఈ సీజన్ లో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ చెబుతోంది. అందుకు కారణం.. ‘ఎల్ నినో’. ఈ పేరు వింటేనే జనం హడలిపోతున్నారు గతంలో ఓ ఏడేళ్ల పాటు ‘ఎల్ నినో’ ఎఫెక్ట్ కు ఎండలు మండిపోయి.. వానలు కురవకుండా పోయి.. కరువు తాండవించి.. అబ్బో జనాలంతా ఆగమాగం అయ్యారు. ఆ ఎల్ నినో ఈసారి మళ్లీ వస్తోందనే మాటే కంగారు పెడుతోంది.


ఈ ఏడాది ఊహించిన ‘ఎల్ నినో’ కారణంగా వేసవి కాలం కఠినంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలపై కూడా ఆ ఎఫెక్ట్ పడనుందని చెబుతున్నారు. తెలంగాణ, ఏపీ అంతటా ఎండలు మండిపోతాయని హెచ్చరిస్తున్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×