E-Paper
Advertisement

KTR Reaction: మున్సిపల్ ఫలితాలపై కేటీఆర్ మార్క్ విశ్లేషణ.. కాంగ్రెస్‌కు అసంతృప్తి.. బీజేపీకి సెటైర్లు!

KTR Reaction: మున్సిపల్ ఫలితాలపై కేటీఆర్ మార్క్ విశ్లేషణ..  కాంగ్రెస్‌కు అసంతృప్తి.. బీజేపీకి సెటైర్లు!
Advertisement

KTR Reaction: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో స్థానాలు సాధించలేక అసంతృప్తితో ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ శ్రేణులు అద్భుతంగా పోరాడాయని.. తాము 30కి పైగా మున్సిపాలిటీలను ఆశించినప్పటికీ.. ప్రస్తుతం వచ్చిన 17 మున్సిపాలిటీలతో పాటు హంగ్ ఏర్పడిన చోట్ల కూడా తమకు విజయావకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత తమ పార్టీపై విమర్శలు చేసిన వారికి ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ ప్రదర్శనపై కేటీఆర్ సెటైర్లు వేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసినా.. కనీసం ఒక్క మున్సిపాలిటీని కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. గతంతో పోలిస్తే బీజేపీకి ఓట్లు, వార్డులు తగ్గాయని.. అయినా వారు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాతీయ నేతల పర్యటనల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, స్థానిక అంశాలే ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ఉండే సానుకూలతను వారు వాడుకున్నారన్నారు. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యుల నిబంధనలపై ప్రభుత్వానికే స్పష్టత లేదని.. కలెక్టర్లు , చీఫ్ సెక్రటరీ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. నిబంధనల విషయంలో గందరగోళం నెలకొందని ఆయన మండిపడ్డారు.

ఫార్ములా-ఈ కేసులో ప్రభుత్వం మరోసారి విచారణకు పిలవడంపై స్పందిస్తూ.. ఇది కేవలం ఒక ‘తమాషా’ అని కొట్టిపారేశారు. ఈ కేసులో ఎలాంటి పస లేదని ఏసీబీ అధికారులే ముఖ్యమంత్రికి చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తామని.. నిజం చెబుతామని స్పష్టం చేశారు. చివరికి జైలుకు పంపినా భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు.

Advertisement

Also Read: కేబీఆర్ పార్క్‌లో సందడిగా ‘డాగ్ అడాప్షన్ డ్రైవ్’.. 130 కుక్కలను దత్తత తీసుకున్న ఎంపీ!

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×