E-Paper
Advertisement

Maha Shivratri 2026: శివాభిషేకంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా ? అయితే జాగ్రత్త !

Maha Shivratri 2026: శివాభిషేకంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా ? అయితే జాగ్రత్త !
Advertisement

Maha Shivratri 2026: శివారాధనలో అత్యంత పవిత్రమైంది జలాభిషేకం. భోళాశంకరుడు స్వల్ప అభిషేకానికే ప్రసన్నుడవుతాడు. అందుకే ఆయనను ‘అభిషేక ప్రియుడు’ అంటారు. అయితే.. భక్తితో చేసే ఈ పూజలో మనం తెలియక చేసే కొన్ని పొరపాట్లు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. జలాభిషేకం చేసేటప్పుడు భక్తులు.. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జలాభిషేకంలో నివారించాల్సిన ముఖ్యమైన పొరపాట్లు:

Advertisement

1. పాత్ర ఎంపికలో జాగ్రత్త:
చాలా మంది జలాభిషేకం చేసేటప్పుడు ప్లాస్టిక్, స్టీల్ లేదా అల్యూమినియం పాత్రలను ఉపయోగిస్తుంటారు. శాస్త్రాల ప్రకారం.. శివాభిషేకానికి రాగి, వెండి లేదా ఇత్తడి పాత్రలు అత్యంత శ్రేష్ఠం. ముఖ్యంగా.. రాగి పాత్రలో పోసిన నీరు పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే.. రాగి పాత్రలో పాలు పోసి అభిషేకం చేయడం నిషిద్ధం. ఎందుకంటే.. రాగి పాలతో కలిసినప్పుడు విషతుల్యం అవుతుందని నమ్ముతారు. పాల అభిషేకానికి వెండి లేదా ఇత్తడి పాత్రలను వాడాలి.

2. అభిషేక ధార, దిశ:
అభిషేకం చేసేటప్పుడు నీటిని ఒకేసారి గుమ్మరించకూడదు. నీరు చాలా సన్నని ధారగా.. నిరంతరాయంగా.. పడాలి. అలాగే.. శివ లింగానికి అభిషేకం చేసేటప్పుడు మీరు ఉత్తర దిశ వైపు ముఖం చేసి నిలబడటం ఉత్తమం. ఎందుకంటే శివుని ఎడమ భాగం (శక్తి స్వరూపం) ఉత్తర దిశలో ఉంటుంది. తూర్పు వైపు నిలబడటం వల్ల ద్వారపాలకులు అడ్డుగా ఉంటారని, పడమర వైపు శివుని వెనక భాగం ఉంటుందని చెబుతారు.

Advertisement

3. జలంధరిని దాటకూడదు:
లింగం నుంచి అభిషేక జలం బయటకు వచ్చే మార్గాన్ని ‘జలంధరి’ లేదా ‘సోమసూత్రం’ అంటారు. శివాలయాల్లో ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ జలంధరిని ఎప్పుడూ దాటకూడదు. అక్కడి వరకు వెళ్లి మళ్ళీ.. వెనక్కి తిరిగి ప్రదక్షిణ పూర్తి చేయాలి. అది శివశక్తి స్వరూపంగా భావిస్తారు.

4. నిషిద్ధ వస్తువుల వాడకం:
శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు లేదా పూజించేటప్పుడు కొన్ని వస్తువులను అస్సలు వాడకూడదు.

కేతకీ పుష్పం (మొగలి పువ్వు): పురాణాల ప్రకారం.. శివుడు ఈ పుష్పాన్ని శపించాడు. కాబట్టి దీనిని పూజలో వాడకూడదు.

తులసి దళాలు: జలంధరాసురుడనే రాక్షసుడి భార్య తులసి. శివుడు అతడిని సంహరించడం వల్ల తులసి శివపూజకు దూరమైంది.

పసుపు, కుంకుమ: శివలింగం పురుష తత్వానికి ప్రతీక కాబట్టి.. ముఖానికి రాసే పసుపును లింగంపై నేరుగా వాడకూడదు.

5. శుభ్రత, ప్రశాంతత:
అభిషేకం చేసే ముందు మీరు స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మనసులో కోపం, అసూయ వంటివి పెట్టుకుని చేసే అభిషేకం ఫలితాన్ని ఇవ్వదు. “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని జపిస్తూ అత్యంత ప్రశాంతంగా పూజ చేయాలి. అభిషేకం పూర్తయిన తర్వాత శివలింగాన్ని మెత్తని వస్త్రంతో తుడవాలి. లేదంటే తేమ వల్ల లింగం దెబ్బతినే అవకాశం ఉంటుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×