E-Paper
Advertisement

Madhapur SI Arrest: రూ.50వేలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎస్ఐ, ఎక్కడో కాదు ఏకంగా పీఎస్‌లోనే..?

Madhapur SI Arrest: రూ.50వేలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎస్ఐ, ఎక్కడో కాదు ఏకంగా పీఎస్‌లోనే..?
Advertisement

Madhapur SI Arrest: హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఏసీబీ సోదాలు స్థానికంగా పెద్ద సంచలనం సృష్టించాయి. విధి నిర్వహణలో నిజాయితీగా ఉండాల్సిన ఓ బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం చర్చనీయాంశమైంది.

మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)గా పనిచేస్తున్న వినయ్, ఒక చీటింగ్ కేసుకు సంబంధించి నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేశారు. సదరు నిందితుడిని జైలు శిక్ష నుండి తప్పించేందుకు లేదా కేసు తీవ్రతను తగ్గించేందుకు సాయం చేస్తానని నమ్మబలికి.. అందుకు ప్రతిఫలంగా రూ.50 వేలు ఇవ్వాలని కోరారు.

Advertisement

లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఈ విషయంపై ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక రచించారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ వినయ్ బాధితుడి నుండి ఆ నగదును తీసుకుంటుండగా.. ఏసీబీ బృందం మెరుపు దాడి చేసి ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

ఎస్ఐ వినయ్ వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఆయన చేతులకు కెమికల్ టెస్ట్ నిర్వహించి అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో సోదాలు నిర్వహించి.. కేసులకు సంబంధించిన కీలక పత్రాలను పరిశీలించారు. నిందితుడైన ఎస్ఐని అదుపులోకి తీసుకుని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు.

Advertisement

Also Read: Viral Video: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భర్త.. మాల్‌లోనే జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు, వీడియో వైరల్

Related News

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

Big Stories

Advertisement
×