E-Paper
Advertisement

Omni Van Fire: పెట్రోల్ బంక్‌లోకి దూసుకొచ్చిన మండుతున్న వ్యాన్.. ఘట్‌కేసర్‌లో ఊపిరి పీల్చుకున్న జనం! త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Omni Van Fire: పెట్రోల్ బంక్‌లోకి దూసుకొచ్చిన మండుతున్న వ్యాన్.. ఘట్‌కేసర్‌లో ఊపిరి పీల్చుకున్న జనం! త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
Advertisement

Omni Van Fire: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పరిధిలోని అన్నోజిగూడలో గురువారం పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. సినిమా సీన్‌ను తలపించేలా జరిగిన ఈ ఘటన స్థానికులను, వాహనదారులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. మండుతున్న వాహనం జనారణ్యంలోని పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లడం సంచలనం సృష్టించింది.

ఘట్‌కేసర్ వైపు నుంచి ఉప్పల్ వెళ్తున్న ఒక మారుతి ఓమ్ని వ్యాన్‌లో (Omni Van) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనంలోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలను గమనించిన వెంటనే వ్యాన్‌లో ఉన్న డ్రైవర్ ప్రాణభయంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి కిందకు దిగి పరుగులు తీశాడు. అయితే, ఆతృతలో డ్రైవర్ వాహనానికి హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిపోయాడు.

Advertisement

రోడ్డు వాలుగా ఉండటంతో.. మంటల్లో కాలుతున్న ఆ ఓమ్ని వ్యాన్ నెమ్మదిగా కదులుతూ పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. మంటలతో ఉన్న వాహనం నేరుగా పేలుడు పదార్థాలు ఉండే బంకులోకి రావడంతో, అక్కడున్న వాహనదారులు, స్థానికులు అంటూ భయంతో పరుగులు తీశారు. ఒక్కసారిగా అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.

ఈ క్లిష్ట సమయంలో పెట్రోల్ బంక్ సిబ్బంది చూపిన తెగువ, సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకుంటున్నారు. మండుతున్న వాహనం తమ వైపు వస్తున్నా.. భయపడి పారిపోకుండా వెంటనే స్పందించారు. అగ్నిమాపక పరికరాలు (Fire Extinguishers), ఇసుక, డస్ట్ ఉపయోగించి వ్యాన్ మంటలను ఆర్పివేశారు. మంటలు పెట్రోల్ పంపులకు అంటుకోకుండా నిలువరించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Read Also: Phone Tapping Case: ఆరా మస్తాన్ స్టేట్మెంట్లు కీలకం.. రెండోసారి విచారిస్తున్న సిట్

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×