BigTV English

Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌కు ప్రమాదం.. వరుసగా 6 కాన్వాయ్‌లు..

Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌కు ప్రమాదం.. వరుసగా 6 కాన్వాయ్‌లు..

Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ వెళ్తున్న సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ లోని ఆరు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణీస్తున్న వాహన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకే ఉన్న వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకున్నాయి. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.


జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనేందుకు మంత్రి వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను చూసి మంత్రి కారు ఆపాలని డ్రైవర్ కు సూచించారు. దీంతోవెంటనే కారును నిలిపివేశారు. మంత్రి కాన్వాయ్ లోని ఇతర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం కాలేదు. అయితే కొద్దిసేపు అక్కడ ట్రాఫిక్ జాం అయ్యింది.

వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర ఇరిగేషన్ పౌరశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో సంబంధించి ఎవరికి గాయాలు కాలేదు కానీ.. ఎనిమిది వాహనాలు ధ్వంసం అయ్యయి.


Also Read: ఎమ్మేల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టమాటాలతో దాడి..

హుజూర్ నగర్ నుంచి పాలకేడు నుంచి జాన్పహాడ్ దర్గాగు వెళుతుండగా.. ఎర్రడేపల్లి పోలీసు స్టేషన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆపే ప్రయత్నం చేశారు. వెంటనే ఉత్తమ కుమార్ రెడ్డి కాన్వే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో వెనక ఉన్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పూర్తిగా ఆరు నుంటి ఎనిమిది వాహనాలు ఈ కాన్వాయి ప్రమాదానికి గురయ్యాయి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యకర్తలను పరామర్శించి మళ్లీ ఉర్సు ఉత్సవాలకు బయల్దేరారు.

 

Related News

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Karimnagar Fire Accident: కరీంనగర్‌లోని రీసైక్లింగ్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Telangana: ఎమ్మెల్సీ తాతా మధుపై ఖమ్మం జిల్లా నేతల తిరుగుబాటు!

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

TG Number Plates: ఇకపై ఆ వాహనాలపై ‘తెలంగాణ పోలీస్’ స్టిక్కర్లు.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు

Big Stories

×