BigTV English

Taiwan Iguana : ఆ దేశంలో ఊసరవెల్లుల బెడద.. లక్షకు పైగా జీవులను చంపేయాలని ప్రభుత్వ నిర్ణయం

Taiwan Iguana : ఆ దేశంలో ఊసరవెల్లుల బెడద.. లక్షకు పైగా జీవులను చంపేయాలని ప్రభుత్వ నిర్ణయం

Taiwan Iguana | భూగ్రహంపై మానవులదే ఆధిపత్యం. మానవాళికి సమస్యగా మారే జంతువులు, ఇతర ప్రాణులను మనుషులు ఏ మాత్రం సంకోచించకుండా అంతమొందిస్తారు. తాజాగా ఈ కోవలో ఊసరవెల్లులు చేరాయి. ఒక దేశంలో ఊసరవెల్లుల సంఖ్య మరీ ఎక్కువైపోతోందని అక్కడి ప్రభుత్వం వాటిని చంపేయాలని నిర్ణయించింది. ఇది మరెక్కడో కాదు చైనా పొరుగు దేశం తైవాన్ లో జరుగుతోంది.


ఐలాండ్ దేశమైన తైవాన్‌ లో వ్యవసాయ రంగాన్ని ఆకుపచ్చ ఇగ్వానాలు (పెద్ద ఊసరవెల్లులు) తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి తైవాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమస్యాత్మకంగా మారిన ఇగ్వానాలను అంతమొందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అందుకే సుమారు 1.20 లక్షల ఇగ్వానాలను చంపేయాలని తైవాన్ ప్రభుత్వం డిసైడ్ అయింది. అయితే, ఈ సరీసృపాలను (భూమిపై పాకులాడే జీవులు) సాంకేతిక పద్ధతిలో కాకుండా సాధారణ మార్గాల్లోనే వీటిని అంతం చేయాలని నిర్ణయించింది.

దక్షిణ తైవాన్‌ ప్రాంతంలో సుమారు 2 లక్షలకు పైగా ఇగ్వానాలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి ఆకుపచ్చ రంగులో ఉండే సరీసృపాలు, బల్లుల జాతికి చెందినవి. ఇవి ఆకులు, పళ్లు, చిన్నచిన్న మొక్కలను తింటూ జీవనం సాగిస్తాయి. గత కొంతకాలంగా ఈ ఆకుపచ్చ ఇగ్వానాలు.. తైవాన్ లో పంట పొలాల్లోకి గుంపులుగా చొరబడి పంటలను నాశనం చేస్తుండడంతో, వీటి కారణంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.


గత ఏడాది ఇగ్వానాల నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు దాదాపు 70 వేల ఇగ్వానాలను మట్టుబెట్టగా, ఒక్కో జీవిని చంపడానికి ప్రభుత్వం 15 డాలర్లు చెల్లించిందని సమాచారం. అయినప్పటికీ, వీటి సంఖ్య ఏడాది తిరగ్గకుండానే పెరిగిపోవడంతో సమస్య మరింత పెద్దదైంది.

Also Read: 10 శాతం బ్రిటన్‌ ధనవంతుల వద్ద భారత్‌ నుంచి దోచుకున్న సంపద.. ఆక్స్‌ఫామ్ రిపోర్ట్

ఇవి ఎక్కువగా అటవీ ప్రాంతాల సమీపంలో, గ్రామాల పరిసరాల్లో నివసిస్తాయి. వీటి గూళ్లను గుర్తించడంలో స్థానికులు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. ఇగ్వానాలను చంపేందుకు విషపు గుళికలు కాకుండా, ఈటెలు, బాణాలను ఉపయోగించాలని మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇగ్వానాలు గరిష్టంగా 2 అడుగుల పొడవు పెరుగుతాయి. వాటి బరువు 5 కిలోల వరకు ఉంటుంది. ఇవి 20 సంవత్సరాల పాటు జీవించగలవు. ఒకసారి ఆడ ఇగ్వానాలు 80 గుడ్లను పెడతాయి. కొందరు ఇంట్లో పెంచడానికి వీటిని తెచ్చుకుంటున్నప్పటికీ, అవి ఏడాదిలోపే మరణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అందుకే పెంపుడు ఇగ్వానాలను కూడా తైవాన్ ప్రజలు అడవిలో వదిలేస్తున్నారు.

దీనంతటికీ ప్రధాన కారణం మరొకటి ఉంది. అదే ప్రకృతి సమతుల్యం. అంటే ఇగ్వానాలను చంపుతినే జీవులు (పాములు, ఇతర కృూర మృగాలు) తైవాన్ లో ఎక్కువగా లేవు. అందుకే ఇగ్వానాల జనాభా భారీగా పెరిగిపోతోంది. ఈ ప్రకృతి సమతుల్యం సాధించడానికే నడుం బిగించామని తైవాన్ అటవి శాఖ అధికారులు చెబుతున్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×