E-Paper
Advertisement

ట్రైన్ లో లగేజీ లేదా ఫోన్ పోయిందా?.. ఎలా ఫిర్యాదు చేయాలంటే?

ట్రైన్ లో లగేజీ లేదా ఫోన్ పోయిందా?.. ఎలా ఫిర్యాదు చేయాలంటే?
Advertisement

Lost Phone Bag In Train: దేశంలో ప్రతిరోజూ రెండు కోట్లకు పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దిగే తొందరలో లగేజీ పోగొట్టుకోవడం రైలు ప్రయాణాల్లో సర్వసాధారణం. పర్సులు, బ్యాక్‌ప్యాక్‌లు, ఫోన్‌లు ఇలా చాలా వస్తువులు రైళ్లలో మర్చిపోతుంటారు లేదా పోగొట్టుకుంటారు. రైళ్లలో లగేజీ, ఫోన్లు మర్చిపోయినా, పోగొట్టుకున్నా.. ఎలా ఫిర్యాదు చేయాలో ఇప్పుడు చూద్దాం.

రైల్ మదద్ లో ఫిర్యాదు

ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువుల గురించి ఫిర్యాదు చేసేందుకు రైల్వే శాఖ ‘రైల్ మదద్’ సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చింది. 24×7 అందుబాటులో ఉండే ఈ డిజిటల్ సర్వీస్ లో.. ప్రయాణికులు నేరుగా తమ ఫోన్‌ నుంచే ఫిర్యాదు చేయవచ్చు. తమ PNR నంబర్‌ను ఎంటర్ చేసి, పోగొట్టుకున్న సామాను ఫిర్యాదు చేయాలి. దీంతో రైలు మార్గంలోని సంబంధిత రైల్వే డివిజన్లను అధికారులు తక్షణమే అప్రమత్తం చేస్తారు. లేదా అధికారిక వెబ్‌సైట్ railmadad.indianrailways.gov.in లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే.. అంత వేగంగా గాలింపు చేసి వస్తువులు తిరిగి ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తారు.

స్టేషన్ లో ఫిర్యాదు

Advertisement

ఒకవేళ ప్రయాణికుల వద్ద ఫోన్ లేకపోతే.. తాము దిగిన స్టేషన్‌లో లేదా నెక్ట్స్ మెయిన్ స్టేషన్ ఫిర్యాదు చేయవచ్చు. స్టేషన్ మాస్టర్లు, పోగొట్టుకున్న వస్తువుల కౌంటర్లు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు ఈ తరహా ఫిర్యాదులు స్వీకరిస్తారు. తమ వస్తువులు దొరక్కపోతే.. RPF పోలీసుల వద్ద FIR నమోదు చేయాల్సి ఉంటుంది. రైల్ మదద్ యాప్ లో ప్లాట్‌ఫామ్, టికెటింగ్, క్లీనింగ్ ఇలా రైలులోని సౌకర్యాలు, భద్రతపై ప్రయాణికులు ఫిర్యాదు చేయవచ్చు.

రైలులో ఫోన్ పోతే ఇలా చేయండి.

  • రైలు మదద్ యాప్‌లో కంప్లైంట్ ఇవ్వండి.
  • 139 కి కాల్ చేసి సమాచారం ఇవ్వండి.
  • RPF సహాయం తీసుకోండి.
  • CEIR పోర్టల్‌లో IMEI ద్వారా ఫోన్ బ్లాక్ చేయండి.

ఇలా చేస్తే మీ ఫోన్ డేటా సేఫ్ గా ఉంటుంది. దొంగలు మీ ఫోన్ ను వాడలేరు. ఫోన్ తిరిగి దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×