BigTV English

Raja Singh: ఉగాదే కొత్త ఏడాది.. న్యూ ఇయర్ వేడుకలపై రాజాసింగ్ ఫైర్..

Raja Singh: ఉగాదే కొత్త ఏడాది.. న్యూ ఇయర్ వేడుకలపై రాజాసింగ్ ఫైర్..

Raja Singh: ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ చెలరేగిపోయారు. మరోసారి వార్నింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈసారి ఆయన టార్గెట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.


‘డిసెంబర్ 31న ప్రారంభించే ఈ నూతన సంవత్సర వేడుకలు మన భారతీయ సంస్కృతి కానే కాదు. పాశ్చాత్య సంస్కృతి అని గుర్తుంచుకోండి. 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించిన ఇంగ్లీషు వారి సంస్కృతి ఇది. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల సమయంలో దుష్ట శక్తులు ఆవహించినట్లు ప్రజలు వేడుకల్లోకి పిచ్చిగా మునిగిపోతారు. మన కొత్త సంవత్సరం ఉగాది నాడే ప్రారంభమవుతుంది’ అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేవారిని ‘సమాజాన్ని తప్పుదోవ పట్టించే వ్యక్తులు’ అని రాజాసింగ్ అన్నారు.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిపే పాశ్చాత్య సంస్కృతిని అంతం చేయడానికి దేశంలోని యువత చేతులు కలపాలని పిలుపు ఇచ్చారు. ఈ నూతన సంవత్సరం మనది కాదనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే.. పాశ్యత్య సంస్కృతికి స్వస్తి చెప్పవచ్చని రాజాసింగ్ సూచించారు.


హైకోర్టు ఆంక్షల మూలంగా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లకుండా.. కాస్త మెసేజ్ ఓరియెంటెడ్ స్టైల్ లో వీడియో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. వేడుకలు అడ్డుకుంటాం.. దాడులు చేస్తాం.. లాంటి కాంట్రవర్సీలను ప్రస్తుతానికి పక్కన పెట్టేసినట్టున్నారు. జాగ్రత్తగా మాట్లాడుతూనే.. కేసులకు చిక్కకుండా.. చెప్పాల్సింది చెబుతూ.. పరోక్షంగా ఇవ్వాల్సిన వార్నింగులు ఇస్తున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. న్యూ ఇయర్ వేడుకలపై రాజాసింగ్ లేటెస్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related News

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Big Stories

×