Big Stories

Naegleria Fowleri : బ్రెయిన్‌ తినే అమీబా.. సౌత్‌ కొరియాలో తొలి కేసు!

Naegleria Fowleri : ఓ వైపు కరోనా కల్లోలం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. చైనాలో సునామీలా విరుచుకుపడుతున్న BF.7 కేసులు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. అప్పట్లో చైనా నుంచి కోవిడ్ ఎలా విస్తరించిందో.. అలానే ఎక్కడ మీద పడుతుందో అన్న భయం అంతటా కనిపిస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే .. మరో వార్నింగ్ బెల్ మోగింది. దక్షిణ కొరియాలో మెదడును తినే అమీబా(brain-eating amoeba)కు సంబంధించి తొలి కేసు నమోదయ్యింది. 50 ఏళ్ల వ్యక్తి దీని వల్ల మృత్యువాత పడ్డాడు. దీన్ని నైగ్లీరియా ఫాలెరీ (Naegleria fowleri)గా పిలుస్తుంటారు. థాయ్‌లాండ్‌కు వెళ్లినప్పుడు ఈ అమీబా ఆయనలోకి ప్రవేశించి ఉండొచ్చంటున్నారు వైద్యులు. దాదాపు నాలుగు నెలలపాటు థాయ్‌లాండ్‌లో ఉన్న ఆ వ్యక్తి.. డిసెంబర్‌ 10న సౌత్‌ కొరియాకు తిరిగివచ్చాడు. వచ్చిన కొన్నిరోజులకే అనారోగ్యానికి గురై ప్రాణం కోల్పోయాడు. నైగ్లీరియా ఫాలెరీ (Naegleria fowleri) వల్లే ఆయన ప్రాణం కోల్పోయాడని కొరియా డిసీజ్ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ (KDCA) ప్రకటించింది. 

- Advertisement -

ఏమిటీ మెదడును తినే అమీబా!

- Advertisement -

అమీబా ఏ కణజీవి. ఈ నైగ్లీరియా ఫాలెరీ కూడా ఏక కణ జీవి. నదులు, సరస్సులతో పాటు మట్టిలో కూడా ఉంటుంది. క్లోరిన్ తక్కువగా ఉన్న స్విమ్మింగ్‌ పూల్స్‌లో కూడా జీవిస్తూ ఉంటుంది. ఇది ఉన్న నీటిలో ఈత కొట్టినప్పుడు.. ముక్కు ద్వారా ఇది మనిషి శరీరంలోకి ప్రవేశించి మెదడును చేరుతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత మెదడులోని కణజాలాన్ని, కండరాలను ఒకేసారి నాశనం చేస్తుంది. దీనివల్ల ప్రైమరీ అమీబిక్‌ మెనింగోఎన్‌సెఫలైటిస్‌ (primary amebic meningoencephalitis) అనే ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఆ తర్వాత ప్రాణం పోతుంది. దక్షిణ కొరియా వాసికి జరిగింది ఇదే. అయితే.. ఇది కోవిడ్‌లా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు.అమీబాలన్నీ వాస్తవానికి ప్రాణాంతకం కాదు. కానీ ఈ నైగ్లీరియా ఫాలెరీకి మాత్రం మనిషిని చంపే లక్షణం ఉందంటున్నారు పరిశోధకులు. అది కూడా ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్లినప్పుడే ప్రాణాంతకంగా మారుతుంది. గొంతులో నుంచి కడుపులోకి వెళ్లినప్పుడు ఎలాంటి ప్రమాదమూ ఉండదంటున్నారు. సాధారణంగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నైగ్లీరియా ఫాలెరీ ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. అందుకే.. వేడి ఎక్కువగా ఉన్న సమయంలో నదులు, సరస్సుల్లో ఈతకు వెళ్లొద్దంటున్నారు పరిశోధకులు. ఒకవేళ ఆ సమయంలో స్విమ్మింగ్ చేయాల్సి వచ్చినా నీళ్లు ముక్కులోకి వెళ్లకుండా చూసుకోవాలంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News